ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే లేకుండా, జైత్రయాత్ర సాగించిన భారత్...పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ...అదేజోరు కొనసాగించింది. చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదిపై, 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో...తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని, భారత బ్యాటర్లు విజృంభించారు. జీవితకాల అద్భుత ఇన్నింగ్స్ తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ...టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
క్రికెట్‌లో నం.3 బ్యాటర్ ఎంతో కీలకం. ఓపెనర్లలో ఎవరైనా ఔటైతే ఇన్నింగ్సును చక్కదిద్దే బాధ్యత అతడిదే. ఈ స్థానంలో వచ్చే విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు ఒత్తిడిని జయించి భారత్‌కు విజయాలను అందించారు. ఇప్పుడు తిలక్ వర్మ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. టీ20ల్లోనే కాకుండా వన్డేల్లోనూ ఈ యువ ఆటగాడికి ఛాన్సులు ఇవ్వాలని, భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉందని నెటిజన్లు అంటున్నారు.