Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో చార్జిషీట్ కోర్టు పరిగణనలో లేనందున మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. తాము నిబంధనల ప్రకారం 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుల వాదనలు సరికాదని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వారు తమ వాదనలకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఉదహరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు గురువారానికి వాయిదా వేశారు.