సెల్‌ఫోన్ రికవరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. CEIR పోర్టల్ ప్రారంభించిన 396 రోజుల్లోనే రాష్ట్రంలో 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 35,945 రికవరీలతో మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా.. 7,387 ఫోన్ల రికవరీలతో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు.
35,945 సెల్‌ఫోన్స్ రివకరీలతో కర్నాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 7387 సెల్‌ఫోన్స్ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఫోన్ దొంగతనం లేదా కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని పేర్కొన్నారు.