- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

క్రికెటర్ చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడిపోతున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాహల్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి హైడ్ చేసిన ధనశ్రీ తాజాగా వాటిని రిస్టోర్ చేశారు. దీంతో వీరు విడిపోవట్లేదా? లేదా తాను ఇంకా అతని భార్యనేనని ఆమె గుర్తు చేస్తున్నారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చాహల్ ఇటీవల RJ మహ్వాష్తో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి.
“మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషన్‌లో ఉంటుంది!” అంటూ సోమవారం, ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక రహస్యమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్టు హల్చల్ రేపడంతో, నెటిజన్లు దీన్ని యుజ్వేంద్ర చాహల్ తో అనుసంధానించారు. అయితే, కొంతమంది మాత్రం ఇది ఆమె సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌కు స్పందన అని అభిప్రాయపడ్డారు.
చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల బంధం తర్వాత గతేడాదే వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇద్దరూ విడిపోయి ఉంటున్నారని తెలిసింది. ఈ విషయంపై ఇద్దరూ మౌనం వహిస్తూనే వచ్చారు.

మట్టి కుండలలో వంట చేసే సంప్రదాయం పురాతన కాలం నుండి ఉంది. కానీ తరాలు మారుతున్న కొద్దీ వాటి వాడకం కూడా కనుమరుగైంది. కానీ మళ్లీ ఇప్పుడు మట్టి కుండల వాడకం బాగా పెరిగింది. కుండలలో వండిన ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ సహా అనేక ఇతర ఆహార పదార్థాలను మట్టి కుండలలో అమ్ముతున్నారు. అదేవిధంగా మట్టి కుండలో పెరుగు తయారు చేసి తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? వేసవిలో పెరుగును మట్టి కుండలో ఎందుకు చేయాలనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో వడదెబ్బను నివారించడానికి.. చల్లని పెరుగు భోజనం మరింత రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండా కాలంలో మన మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి పెరుగు ఒక గొప్ప ఎంపిక. కానీ మీరు ఎంచుకునే పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. దీనికి సరైన కంటైనర్ ఉపయోగించినప్పుడు మాత్రమే.. అది మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి :
మట్టి కుండలలో తయారుచేసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. స్టీల్, గాజు వంటి పాత్రలలో తయారు చేసిన పెరుగు కంటే మట్టి కుండలలో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
పెరుగు పెరుగుగా మారడానికి సహాయపడుతుంది;
మట్టి కుండలో తయారుచేసిన పెరుగునే చాలా మంది తినడానికి ఇష్టపడతారు. నిజానికి మట్టి పాత్రలు సహజంగా నీటిని గ్రహిస్తుంది. ఇది పెరుగు బాగా గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అదనంగా మట్టి కుండలో నిల్వ చేసిన పెరుగు ఇతర పాత్రలలో నిల్వ చేసిన పెరుగు కంటే భిన్నంగా ఉంటుంది. మట్టి పాత్ర యొక్క సహజ లక్షణాలు పెరుగు యొక్క సహజ రుచిని నిలుపుకుంటాయి. ఇది ఈస్ట్ చాలా పుల్లగా మారకుండా నిరోధిస్తుంది. అందుకే మట్టి కుండలలో ఉంచిన పెరుగు చాలా రుచిగా ఉంటుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్‌లో ఓటు హక్కు, మెరుగైన జీతాల కోసం 15 వేల మంది మహిళలు నిరసనకు దిగారు. ఆ రోజును దృష్టిలో పెట్టుకుని USలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ తర్వాత క్లారా జెట్కిన్ 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8ను మహిళా దినోత్సవంగా గుర్తించింది.
సమాజంలో మహిళలకూ పురుషులకున్న హక్కులు ఉంటాయని, అన్ని రంగాల్లోనూ వారికి సమాన అవకాశాలు కల్పించాలనే మాట ప్రతి రాజకీయ నాయకుడి నోటి నుంచి వస్తుంటుంది. రాజ్యాంగం వీరికి 33% రిజర్వేషన్ కల్పించినా ఎంత మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు? ఎంత మంది మహిళా మూర్తులకు మంత్రుల పీఠం దక్కింది? ప్రైవేటు ఉద్యోగాల్లో ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారు? వారి హక్కులను వారు పొందినప్పుడే నిజమైన ‘ఉమెన్స్ డే’.

ప్రధాని మోడీ ఈరోజు, రేపు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, గుజరాత్లో పర్యటించనున్నారు. దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, గుజరాత్లో మోడీ పర్యటించనున్నారు. సిల్వాసాలో రూ.2,580 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సిల్వాసాలో నమో ఆస్పత్రి ఫేజ్-1ను మోడీ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవ్సరిలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు పూర్తిగా మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా మహిళా పోలీసులతో పహారా చేపట్టనున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ గాయని కల్పన నిజాంపేటలోని హోలిస్టిక్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బుధవారం డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా వేగంగా కోలుకుంటున్నారని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే అపస్మారకంలోకి వెళ్లినట్లు వివరించారు. లంగ్స్‌లో వాటర్ చేరడంతో వెంటి లేటర్ అవసరం అయిందని, ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటలలో డిశ్చార్జి చేస్తామని హోలిస్టిక్ వైద్యులు తెలిపారు. కల్పన ఆత్మహత్యయత్నానికి కుటుంబ కలహాలే కారణమన్న కోణంలో పోలీసులు భావిస్తున్నారు.
ఆసుపత్రిలో ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. కేరళలో చదవుకుంటున్న పెద్ద కూతురిని హైదరాబాద్ రమ్మని కోరానని, ఆమె మాత్రం కేరళలో ఉంటానని పట్టుబట్టిందని, దీంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కల్పన చెప్పినట్లు తెలుస్తోంది.
కల్పన పెద్ద కూతురు దయా ప్రసాద్ కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూశారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న కథనాలను తోసిపుచ్చారు. ఒత్తిడి గురవడంతో వైద్యులు ఇన్సోమ్నియా టాబ్లెట్ రాశారని, ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని తెలిపారు. తమ కుటుంబం లో ఎటువంటి కలహాలు లేవని, మీడియా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరింది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. కాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను తీశారని వర్మపై గతంలోనే సీఐడీకి ఫిర్యాదులు అందాయి. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆర్జీవీ సినిమా తీశారంటూ పలు చోట్ల సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి సీఐడీ నోటీసులు పంపింది. అయితే, ఆయన దీనిని హైకోర్టులో సవాల్ చేశారు.
సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా పిటిషన్లో పేర్కొన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడులో దారుణం జరిగింది. అన్లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. భార్య, ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్లైన్ రమ్మీలో అప్పులు చేసి… ఆట ఆడినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో ప్రేమ్‌రాజ్ పేర్కొ్న్నాడు. ప్రేమ్‌రాజ్.. స్థానికంగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ప్రముఖ గాయని, బిగ్ బాస్ ఫేమ్ కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్న కల్పన మోతాదు కు మించి నిద్రమాత్రలు మింగడంతో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఇంటి తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో తలుపు తెరిచిన అపార్ట్మెంట్ వాసులు అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కల్పనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిజాంపేట్ వర్టెక్స్ ఫ్రీ విల్లాలో కల్పన నివాసం ఉంటున్నట్టు పోలీసులు చెప్పారు. ప్రముఖులు కల్పనను పరామర్శించారు. ఆమె సూసైడ్ అటెంప్ట్ కు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండో భర్తను ప్రశ్నించారు. ఇంట్లో గొడవలు లేవని ఆయన చెప్పినట్టు సమాచారం. ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మన ఫోన్లో బ్యాటరీ అయిపోయిన వెంటనే ఛార్జింగ్ పెడుతుంటాం.. అయితే కొన్ని సార్లు ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా ఫోన్ ఛార్జ్ అవ్వదు. అలాంటప్పుడు వెంటనే దాన్ని రిపేర్ చేయించడానికి తీసుకెళ్తాం.. అలాకాకుండా దాన్ని మీరే రిపేర్ చేసుకునేలా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం...
పోన్ ఎప్పుడైనా ఛార్జ్ కానట్లయితే మొదటగా చేయాల్సిన పని రీస్టార్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ కాకపోవడానికి కారణమైన సాప్ట్వేర్ లోపాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా ఫోన్లోని ప్రధాన భాగాలన్ని రిఫ్రెష్ అవుతాయి. ఫోన్లోని కొన్ని యాప్‌లు కూడా ఛార్జింగ్ సమస్యలకు కారణం కావచ్చు. కావున ఇటీవల డౌన్లోడ్ చేసిన యాప్స్‌లో ఒకటి మీ ఛార్జింగ్ సమస్యలకు కారణం అవచ్చు ఏమో అనేది ఓసారి చూసుకోండి. దాని వల్ల సమస్యే అనిపిస్తే వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేయాలి. అలాగే వాటిలో ఉపయోగించని యాప్‌లనూ కూడా డిలీట్ చేయాలి.
కొన్ని సార్లు ఛార్జర్ పిన్ బాగలేకపోవడం వల్ల కూడా ఛార్జ్ కాకపోవచ్చు. ఛార్జింగ్ పెట్టే సమయంలో కేబుల్‌లోని తీగ వదులుగా ఉండవచ్చు, అడాప్టర్‌లో కూడా లోపాలు ఉండవచ్చు. మనం ఉపయోగించే కేబుల్ మంచిదా కాదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఫోన్‌ను యుఎస్బి ద్వారా డెస్క్ టాప్కు కనెక్ట్ చేయడం. ఒక వేళ మీ ఫోన్‌ను కంప్యూటర్ ఛార్జ్ చేస్తే, అడాప్టర్ లేదా సాకెట్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.
మెుబైల్ ఛార్జ్ అవకపోవడానికి మరో సమస్య ఛార్జింగ్ పోర్ట్ వద్ద పేరుకుపోయిన ధూళి కణాలు విద్యుత్తు సరఫరా కాకుండా అడ్డు పడతాయి. కావున అక్కడ ఏమైనా దుమ్ము, ధూళి ఉంటే పొడిబట్టతో తుడువాలి. ఫోన్ లో నీరు చేరితే వెంటనే ఛార్జ్ చేయకూడదు. ముందు ఫోన్ లోపలి భాగాలు డ్రై అయ్యేలా చూసుకోవాలి. తడిసిపోయిన భాగాలను హెయిర్ డ్రయర్‌తో వేడి గాలిని పంపిస్తూ ఆరబెట్టాలి అలా చేసిన తర్వాత కనీసం ఒకరోజైనా ఛార్జ్ చేయకుండా ఉండాలి. ఇలా పోన్ ఛార్జ్ అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కావున పై పరిష్కారాల ద్వారా ఛార్జీంగ్ సమస్యను అధిగమించవచ్చు.

స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు కానటువంటి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలి. వీరు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్ లిస్టెడ్ టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్‌ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే, రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.
రూల్ ఏంటి? ఫైన్ ఎంత?
వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లపై రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణించడాన్ని ఇప్పుడు పూర్తిగా నిషేధించింది. అంటే మీ టికెట్ వేచి ఉండి ఉంటే, మీరు AC లేదా స్లీపర్ కోచ్‌లో ప్రయాణించలేరు. మీరు స్టేషన్ విండో నుండి టిక్కెట్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పటికీ. ఈ తరహా టిక్కెట్‌పై రిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రయాణించడాన్ని రైల్వే ఇప్పుడు నిషేధించింది. రిజర్వ్ చేసిన కోచ్‌లలో కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లతో ప్రయాణించే వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పటికీ, వెయిటింగ్ టిక్కెట్‌పై ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు రిజర్వ్డ్ కోచ్‌లలో జర్నీ చేస్తే టీటీ అతడిపై రూ.440 ఫైన్ వేసి, దారిలో రైలు నుంచి దిగేలా చేయవచ్చని రైల్వే తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో ఇలా..
జులై వరకు ఇండియన్ రైల్వేస్ లో స్టేషన్ విండో నుండి వెయిటింగ్ టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లయితే, అతను రిజర్వ్ చేయబడిన కోచ్‌లలో కూడా ప్రయాణించవచ్చు. అతనికి ఏసీ కోసం వెయిటింగ్ టికెట్ ఉంటే.. ఏసీలో వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీలో, స్లీపర్ వెయిటింగ్ టికెట్ ఉంటేస్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్లపై ఇలా ప్రయాణించడంపై ఇప్పటికే నిషేధం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దానంతట అదే క్యాన్సల్ అవుతుంది.

వైసీపీ నేత, జగన్ సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ భార్గవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసరంగా పిటిషన్ వేశారు. సజ్జల, అతని కుమారుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశానని పోసాని వాంగ్మూలం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోరారు. తమను అమాయకులమని... తమను అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని వీరు కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా, తమకు ఈ నేరంలో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కూడా పేర్కొన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని... ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆశా వర్కర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనుంది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. వర్కర్లందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది ఉంటే... పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక సర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు అందే అవకాశం ఉంది.

1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది.
ఇది గోధుమ, శనిగ వంటి పంటలకు ముప్పు కలిగించవచ్చని హెచ్చరించింది. మార్చి నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వెల్లడించారు. 2023 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత పరంగా ఫిబ్రవరి 2025 రెండో అత్యంత వెచ్చనిది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.

అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు పోసాని కృష్ణ మురళికి.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోసానిని కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో రైల్వే కోడూరు కోర్టులో రాత్రంతా వాదనలు కొనసాగాయి. రాత్రి 9.30కు పోసానిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు 10 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5.30 వరకు సుమారు 7 గంటలపాటు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం... పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.

ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలతో సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇక గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇక జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
ఉత్తర పాకిస్తాన్, దాని పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆహార వ్యర్థాలు వృథా కాకుండా వినియోగించుకునేందుకు ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఆ వ్యర్థాలను ‘ఈ-కొలి’ లాంటి నాన్-పాథోజెనిక్ (వ్యాధులను సంక్రమింపజేయని) బ్యాక్టీరియాతో కలిపి కాంక్రీట్‌లో మిళితం చేయడం ద్వారా దృఢమైన నిర్మాణ పదార్థాన్ని తయారు చేశారు. నిర్మాణ బలాన్ని రెట్టింపు చేయడంతోపాటు కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయడం ఈ కాంక్రీట్ ప్రత్యేకత. ఆహార వ్యర్థాలు కుళ్లిపోతే కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది.
ఆ వ్యర్థాలతోపాటు బ్యాక్టీరియాను కాంక్రీట్‌లో కలిపితే అందులో ఉండే కాల్షియం అయాన్లతో కార్బన్ డయాక్సైడ్ చర్య జరిపి కాల్షియం కార్బొనేట్ స్ఫటికాలను ఏర్పరుస్తుందని ఇండోర్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సందీప్ చౌదరి వెల్లడించారు. ఈ స్ఫటికాలు కాంక్రీట్‌లోని రంధ్రాలు, పగుళ్లను పూడ్చేస్తాయని, తద్వారా ఆ కాంక్రీట్ బరువుపై పెద్దగా ప్రభావమేమీ చూపదని, పైగా దాని దృఢత్వాన్ని బాగా పెంచుతాయని ఆయన వివరించారు.

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం అప్రజాస్వామికం కాదని, దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఎటువంటి హాని జరగదని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘం సభ్యుల ప్రశ్నలకు ఈ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ స్పందించింది.
మన దేశంలో గతంలో 1951 నుంచి 1967 వరకూ జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపు సహా పలు ఇతర కారణాల వల్ల జమిలి ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొంది. కమిటీ వేసిన మరికొన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో బదులిచ్చేందుకుగాను.. ఆ ప్రశ్నలను ఎన్నికల సంఘానికి న్యాయ శాఖ పంపినట్లు సమాచారం. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని కమిటీ మంగళవారం నిర్వహించనుంది.

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలతో వెళ్తున్న ఆటో ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఆరుగురు కూలీలతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బీహార రాష్ట్రం పట్నాజిల్లాలోని మాసౌర్హి- నౌబత్‌పూర్ రహదారిపై ధనిచక్‌మోర్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతిచెందిన కూలీలు అంతా పట్నా జిల్లాలోని డోరిపూర్ గ్రామానికి చెందినవారు కాగా.. డ్రైవర్ సుశీల్‌కుమార్ హన్సదిహ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆరుగురు కూలీలు పనికి వెళ్లి సాయంత్రం ఆటోలో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టగానే రెండు వాహనాలు రోడ్డు పక్కనున్న లోతైన నీటి గుంతలో పడిపోయాయి. దాంతో జేసీబీల ద్వారా మృతదేహాలను బయటికి తీశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి నీటి గుంతలో నుంచి మృతదేహాలను బయటికి తీయించారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. తాజాగా రెండు వేల మంది ‘యూఎస్ ఎయిడ్’ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ఉద్యోగులపై వేటు పడింది. తొలగింపు నిలిపివేయాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది. యూఎస్ ఎయిడ్ ద్వారానే ప్రపంచంలోని పలు దేశాలకు సాయం అందుతుంది.
‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ ద్వారా ప్రపంచ దేశాలకు అందుతున్న సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ సంస్థ ద్వారా భారత్‌కు అందుతున్న రూ.182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం కొంతమందిని మినహాయించి మిగిలినవారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ఈ విషయం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్ యంత్రాంగం ముందుకెళ్లినట్లు తెలిసింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు.
కాగా, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప.. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్.. ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేకమంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే.
కాగా, USAIDలో ప్రస్తుతం 10వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు యూఎస్ మీడియా తెలిపింది. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలో 9,700 మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మరికొద్దిరోజుల్లో మహా కుంభమేళా ముగియనుంది. ఇక ఈనెల 26న మహా శివరాత్రి కారణంగా అత్యధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆయా సంస్థలు లేనిపోని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన 140 సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు మహా కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పండుగకు అవసరమైన ఏర్పాట్లను పోలీసులు చేశారని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

భారతీయ అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్ డైరెక్టర్ కావటం ఇదే మొదటిసారి. దేశ అత్యున్నత సంస్థకు నేతృత్వం వహించటం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ కాష్ పటేల్ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, ‘ఎఫ్‌బీఐకి ఉత్తమ డైరెక్టర్ అవుతారు. ఏజెంట్స్ ఇష్టపడే వ్యక్తి అవుతాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్‌లోని 1000 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లను బదిలీ చేయాలని కాష్ పటేల్ ఆదేశించినట్టు సమాచారం.

మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. అలాగే సురక్ష పేరుతో రూపొందిస్తున్న ప్రత్యేక యాప్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. మార్చి 8 కల్లా యాప్ రూపకల్పన పూర్తి కావాలన్నారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని పేర్కొన్నారు. విద్య, సాధికారిత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందన్న వంగలపూడి అనిత.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై హోం మంత్రి చర్చించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ను భూకంపం వణికించింది. గారో హిల్స్ లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

కొందరు కవలల్లో అస్సలు తేడా గుర్తించలేం. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. కేరళకు చెందిన ఈ కవల సోదరీమణులు కూడా అలాంటివాళ్లే.. ఈ కవలలు పెళ్లి చేసుకున్నారు. తమలాగే అచ్చం ఒకేలా ఉండే కవల సోదరులనే ఈ ఐడెంటికల్ ట్విన్స్ పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు కవల అబ్బాయిలు కూడా ముమ్మూర్తులా ఒకేలా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లిలో ఈ కవల జంటలు ధరించిన దుస్తులు కూడా ఒకేలాగా ఉన్నాయి. వేద మంత్రాల సాక్షిగా ఈ జంటలు ఒక్కటయ్యారు. ఈ నూతన కవల జంటలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య యుద్ధం ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ చర్చించినా ప్రయోజనం లేకుండా పోవడంతో.. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, కేబినెట్ మీటింగ్ లో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ప్రధాన విధాన, పాలన సంబంధిత అంశాలపై చర్చించడానికి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశాలను నిర్వహిస్తున్నారు.

మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాంచరణ్ తేజ్ ను ఉపాసన ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబీకుల మధ్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. దాదాపు వీరికి పదకొండేళ్ల తర్వాత క్లీంకార జన్మించింది. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి, వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికంగా అభిమానులతో పంచుకుంటుంది. అందులో క్లింకార కూడా ఉన్నప్పటికీ.. ఫేస్ ను మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ క్లీంకారపై క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదిక అయిన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ రాసుకొచ్చింది. వాలెంటైన్స్ డే 22 ఏండ్లు అంతకన్నా చిన్న వయస్సున్న బాలికల కోసం.. మీ వయస్సు 22 దాటిందా..! ఆంటీ దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి' అని రాసుకొచ్చింది. కింద రెండు నవ్వే ఎమోజీలను జోడించింది.

సినీ నటుడు రామ్ చరణ్ నివాసంలో పెంపుడు చిలుక ఈ మధ్య కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు. రామ్ చరణ్ కుటుంబం కుట్టి అనే ఆఫ్రికన్ గ్రేచిలకను పెంచుకుంటోంది. రెండు రోజుల క్రితం చిలుక తప్పిపోయిందని, కనిపిస్తే చెప్పండి అంటూ ఉపాసన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ చేశారు. పోస్ట్‌ను చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చిలుకను వెతికి పట్టుకుని రామ్ చరణ్ దంపతులకు అప్పగించారు. చిలుకను ఇంటికి తీసుకురాగానే అది చరణ్ భుజంపై కూర్చుంది. తన పెట్ ను తిరిగి అప్పగించిన యానిమల్ వారియర్స్ టీమ్ కు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. చిలుకను ఎలా కనిపెట్టామనేది యానిమల్ వారియర్ టీమ్ వివరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగానే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో అరెస్ట్ చేశారా.? లేదా మరో కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా.? అనే విషయాలపై మరికాసేపట్లో ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. ఒకవేళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది.

రాష్ట్రంలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రస్తుతం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే బీర్లతో పాటు ఇతర మద్యం ధరలపై పలు రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది.
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు తిసభ్య కమిటీ సిఫార్సును అబ్కారీ శాఖ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్యంగా బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ కూడా 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల పెట్టె మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ.250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీర్ రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగాయి. కొత్త రేట్లతో ప్రభుత్వానికి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 మేరకు అదనపు ఆదాయం కూరే అవకాశం ఉందని అబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు.

పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీర్ఘకాలిక వీసాలపై వచ్చేవారు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయడం కోసం, అనుమతులు లేకుండా హజ్ యాత్ర చేయడం వంటివాటికి పాల్పడుతున్నారని అధికారులు చెప్పారు. మల్టిపుల్ ఎంట్రీ వీసాల నిలిపివేత నిర్ణయం తాత్కాలికమేనని తెలిపారు. సింగిల్ ఎంట్రీ వీసాలు 30 రోజులపాటు మాత్రమే చెల్లుతాయి. హజ్, ఉమ్రా, రెసిడెన్సీ వీసాల్లో మార్పులు ఉండవు.

అమెరికాలో ప్రస్తుత ‘ఫ్లూ సీజన్’ నడుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో(వింటర్ వైరస్ సీజన్, ఫ్లూ సీజన్) రికార్డు స్థాయిలో ఫ్లూ రుగ్మతలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు శుక్రవారం ఇక్కడి ఆసుపత్రి సమాచార వర్గాలతో పాటు సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అంచనాలు వెల్లడించాయి.
మొత్తం 43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు ఉన్నారని, ఎక్కువమంది శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర ఫ్లూ రుగ్మతల బారిన పడుతున్నారని, సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే గరిష్ఠ స్థాయిని మించి ప్రస్తుతం కేసుల సంఖ్య ఉన్నట్లు పేర్కొన్నాయి. సీడీసీ గణాంకాల ప్రకారం ఈ సీజన్లో సుమారు 2.4 కోట్లమంది ఫ్లూ వైరస్ల బారిన పడగా, 3.1 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. 13 వేల మరణాలు సంభవించాయి. మృతుల్లో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కోవిడ్-19 ఉన్న చిన్నారులు సైతం అధిక సంఖ్యలో ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరూ వార్షిక ఫ్లూ టీకాను పొందాలని, సీజనల్ వైరస్‌లను నివారించడానికి సంబంధిత నిబంధనలను తప్పక పాటించాలని అమెరికా ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట ఓ మహిళ హల్చల్ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ జగన్ ఇంటి ఎదుట అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమరెడ్డి ఈ నెల 6న తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు చేరుకుంది. జగన్‌తో కలిసి ఫొటో దిగే వరకు వెళ్లేదే లేదని అక్కడ ఉన్న సిబ్బందికి తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను లోపలికి అనుమతించి జగన్‌తో ఫొటో తీయించారు. తర్వాత తనకు అప్పులు ఉన్నాయని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని అంజమరెడ్డి కోరినట్లు తెలిసింది. వారు నిరాకరించడంతో బయటకు వచ్చి గేటు వద్ద అడ్డుగా కూర్చొంది. అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కల్యాణ్‌రాజు ఆ ప్రాంతానికి చేరుకుని మహిళా పోలీసులతో ఆమెను వాహనంలో స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన తర్వాత ఆమెను విడుదల చేశారు.

అమెరికాలోని అలస్కా మీదుగా 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దీనిపై మాట్లాడుతూ.. ఉనాలాక్లీట్ నుంచి బయలుదేరి నోమ్ వెళ్తున్న సమయంలో సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ విమానం అదృశ్యమైనట్లు వివరించారు.
ఆ విమానం అమెరికాకు చెందిన బెరింగ్ ఎయిర్ ఎయిర్‌లైన్ సంస్థదని చెప్పారు. విమానంలో మొత్తం పది మంది ఉండగా, వారిలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒకరు పైలట్. అదృశ్యమైన విమానాన్ని గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, వారం రోజుల క్రితమే అమెరికాలోని జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని ఓ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా ఆ ప్రమాదం సంభవించింది. ఇటీవల మరో ప్రమాదంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ వద్ద ఓ విమానం కూలింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. అంతేగాక, అక్కడి ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం 2027లో జరుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలంలోని శిలలను భూమికి తేవడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ ప్రయోగం వచ్చే ఏడాది జరుగుతుందన్నారు. భారతీయ వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన రోదసినౌకలో దిగువ భూ కక్ష్యలోకి తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు.
అదేవిధంగా సముద్రయాన్‌ను కూడా వచ్చే సంవత్సరమే నిర్వహిస్తామన్నారు. దీనిలో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, పరిశోధనలు జరుపుతారని చెప్పారు. సముద్రయాన్ వల్ల ముఖ్యమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర సంబంధిత జీవ వైవిధ్యం వంటివాటి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com