వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో వచ్చే మెజారిటీ ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. ఆయన మరోసారి పులివెందుల ప్రచారంలో తన పవర్ చూపించారు. తన సొంత గడ్డ పులివెందుల అని, ఇది తన ప్రాణమని సీఎం జగన్ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.
పులివెందుల ఏనాడూ బెదిరింపులకు లొంగదన్నారు జగన్. టీడీపీ నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలేనని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు తెప్పించానని జగన్ చెప్పారు. తనను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకం అవుతున్నారని సీఎం జగన్ అన్నారు. తన కుటుంబాన్ని, తన చెల్లెళ్లను కూడా తనపై ఉసిగొల్పుతున్నారని రాజకీయ వైరి పార్టీలపై ఫైరయ్యారు జగన్.
బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. 'చిన్నాన్నకు రెండో భార్య, సంతానం ఉన్న మాట వాస్తవమా కాదా? ఎవరు ఫోన్ చేయడం వల్ల అవినాష్ ఆయన ఇంటికి వెళ్లాడు? ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి. అవినాష్ ఏ తప్పూ చేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికంటే చిన్నపిల్లోడైన అవినాష్‌ను తెరమరుగు చేయాలని చూడటం చాలా దారుణం' అంటూ షర్మిల, సునీత సహా చంద్రబాబు, జగన్ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు.