ఏపీ సార్వత్రిక ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన జనసేన ( Jana Sena ) ఫలితాలలోను ప్రభంజనం సృష్టించింది. బలమైన వైసీపీ 11 స్థానాలకు కుప్పకూలిపోగా 22 స్థానాలతో జనసేన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఎదగడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఇప్పుడు అధికారంలో కూడా భాగస్వామి కానుంది.
గెలిచిన ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశమైన పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) రాష్ట్రంలో జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదాతో పాటు అధికారంలో భాగస్వామ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనసేన నుంచి కేబినెట్ కు పంపే అభ్యర్థులలో ముగ్గురిపై స్పష్టత ఇచ్చారు. ఫైనల్ ఫిగర్ కన్ ఫామ్ కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వీరమహిళ మాధవికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం నాలుగు లేదా ఐదు స్థానాలు జనసేనకు దక్కవచ్చని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలు రావచ్చని చెబుతున్నారు. కీలక శాఖలు చంద్రబాబు, పవన్, లోకేశ్ వద్దే ఉంటాయని తెలుస్తోంది.