ఆ ఓట్లే కనుక వైసీపీకి పోలై ఉంటే ఆ స్దానాలు కూడా వారి ఖాతాలోకే..

నోటా నేతల తలరాతలు మార్చింది. ఏపీలో చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను శాసించింది. ఏపీలో నోటా ఏకంగా 4లక్షల మార్కును దాటింది. వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాత 4 స్థానంలో నిలిచింది. అసలు ఏపీలో ఏం జరిగింది? ప్రజలు నోటాకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు..?

ఈవీఎంలలో పోటీ చేసే అభ్యర్థుల గుర్తుతోపాటు మరో ఆప్షన్‌ కూడా ఉంటుంది. అదే నోటా! పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు. నన్‌–ఆఫ్‌–ది అబోవ్‌‌ అని తేల్చి చెప్పడమే ఈ నోటా ఉద్దేశం. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే.. ఓటర్లు ఈ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఇప్పుడు ఈ నోటానే నేతల తరలరాతలను మారుస్తోంది. అభ్యర్థుల పోటములను డిసైడ్ చేస్తోంది.. ఏపీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ..స్పాట్..

ఏపీ ఎన్నికల ఫలితాలపై పూర్తి క్లారిటీ వచ్చే కొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి…ఇక్కడ పోలైన ఓట్లలో నోటా నాలుగోస్థానంలో నిలిచింది. ఏకంగా నోటాకు 4 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. అంతే కాదు సీపీఎం, సీపీఐ, బీఎస్పీ పార్టీలు కూడా నోటాతో పోటీ పడలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో నోటాకు వచ్చిన ఓట్లు 1.28 శాతం ఉన్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల వార్ లో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా ఆశ్చర్యకరమే…

ఎపీ ఎన్నికల్లో మొత్తం 49.95 శాతం ఓట్లతో వైసీపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక టీడీపీ 39.18 శాతంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 6.79 శాతం ఓట్లతో జనసేన 3వ స్ధానంలో నిలిస్తే… 1.28 శాతం ఓట్లతో నోటా నాలుగో స్థానం దక్కించుకుంది. 1.17 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఐదో స్థానంలో…0.84 శాతంతో ఓట్లతో బీజేపీ 6వ స్ధానంలో నిలిచాయి.. ఇక సీపీఎం, సీపీఐ, బీఎస్పీ పార్టీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 0.32 శాతం ఓట్లతో CPM 7వ స్ధానంలో, 0.28 శాతం ఓట్లతో BSP 8వ స్ధానంలో 0.11 శాతం ఓట్లతో సీపీఐ 9వ స్ధానంతో సరిపెట్టుకున్నాయి..స్పాట్….
.
ఇక టీడీపీ గెలిచిన 3 ఎంపీ స్థానాల్లోనూ… సాధించిన మెజార్టీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి… అంటే ఇక్కడ నోటా వైసీపీ అభ్యర్థులతో ఓ ఆట ఆడుకుందనే చెప్పొచ్చు.. ఆ ఓట్ల గనుక వైసీపీకి పోలైతే శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు పార్లమెంట్ సీట్లు కూడా ఆ పార్టీ ఖాతాలోకే చేరేవి. శ్రీకాకుళంలో నోటాకు ఏకంగా 25వేల పైచికులు ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ గెలుపొందిన రామ్మోహన్ నాయుడు మెజార్టీ కేవలం 6 వేలు మాత్రమే.. విజయవాడలో 8వేల 911 నోటాకు వచ్చాయి… ఇక్కడ విజయ సాధించిన కేశినేని నాని ఆధిక్యం 8వేలు, ఇక గుంటూరులో 6 వేల వేట్లు నోటాకు నొక్కారు..ఇక్కడ గల్లా జయదేవ్ మెజార్టీ 5వేల 2వందలే..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయనకు పోలైన ఓట్లకంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ….ఈవీఎంలలో పోటీ చేసే అభ్యర్థుల గుర్తుతోపాటు మరో ఆప్షన్‌ కూడా ఉంటుంది. అదే నోటా! పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు. నన్‌–ఆఫ్‌–ది అబోవ్‌‌ అని తేల్చి చెప్పడమే ఈ నోటా ఉద్దేశం. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే.. ఓటర్లు ఈ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఇప్పుడు ఈ నోటానే నేతల తరలరాతలను మారుస్తోంది. అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తోంది.. ఏపీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ..

వీడిన ఉత్కంఠ. .అక్కడ ఆయనే గెలిచారు

విశాఖ ఉత్తర నియోజకవర్గం సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపించడంతో వైసీపీ అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టారు. నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. తాజాగా గంటా విజయం సాధించినట్లు ప్రకటించారు.

మొదట గురువారం రాత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఆ సమయానికి గంటా రెండువేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ కేంద్రంలో తొలుత కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ కారణంగా రౌండ్ల లెక్కింపునకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాటిని పక్కనపెట్టి తర్వాతి రౌండ్ల లెక్కింపును కొనసాగించారు. ఇలా సుమారు ఆరు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తేలింది. మొత్తం రౌండ్లు పూర్తయ్యాక, మొరాయించిన ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లను లెక్కించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైసీపా అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టారు. అయితే ఆ వీవీప్యాట్లకు సంబంధించిన ఓట్లను కేకే రాజుకు కలిపినా కూడా.. గంటా శ్రీనివాసరావుకే ఆధిక్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి గంటా విజయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఆధిక్యంలో కొనసాగుతున్న అభ్యర్థులు వీరే

మచిలీపట్టణంలో వైసీపీ అభ్యర్థి పేర్ని నాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు, చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ముందంజలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక డోన్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. నరసాపురం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధిక్యత కొనసాగుతున్నారు.

టీడీపీ కార్యకర్త దారుణ హత్య

కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య. క్రిష్ణగిరి మండలం తాపల కొత్తూరులో టీడీపీ కార్యకర్త శేఖర్‌రెడ్డిని దారుణంగా చంపేశారు. మల్లేపల్లి సమీపంలో బైక్‌పై వెళ్తుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. రాళ్లతో కొట్టి చంపారు. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు జరిగిన హత్య కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణగిరి మండలంలో టీడీపీ కార్యకర్త శేఖర్‌రెడ్డిని పాతకక్షలతోనే చంపేశారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ దిశగానే పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

ఏపీలో సైకిల్‌ గాలి లేదు.. అయినా మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలని..

ఉనికి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారు- మాధవ్‌
ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని విమర్శించారు
ఏపీలో సైకిల్‌ గాలి లేదు-బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌
మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలని విష్ణుకుమార్‌ రాజు అనటం ఆయన వ్యక్తిగతం
త్వరలొ టీడీపీ రెండుగా చీలిపోతుంది.

 

ఉనికి కోసమే సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ . ఏపీలో సైకిల్‌ గాలి లేదని ఎగ్జిట్ పోల్స్‌ తెలియజేస్తున్నాయని అన్నారు. మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలని విష్ణుకుమార్‌ రాజు అనటం ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోతుందని ఆరోపించారు. మాజీ సీఎస్‌ పునేఠ తొలగింపునకు కారణం ఎవరో అందరికి తెలుసు అంటూ విమర్శించారు మాధవ్‌.

 

ఆ విషయంలో వెనకడుగేయని సీఎం చంద్రబాబు.. నేడు..

ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో నేతను రెండు మూడు సార్లు కలుస్తూ వారిలో విశ్వాసాన్ని కల్పిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జాతీయ నేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్న చంద్రబాబు.. ఇవాళ కూడా మరికొంత మంది బీజేపీయేతర నేతలను కలవనున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటల 30 నిమిషాలకు బీజేపీయేతర పార్టీల సమావేశం జరగనుంది. ఒకవేళ ఎన్డీయేకు మెజారిటీ రాకపోతే ఎన్డీయేతర పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరే అంశం మీద చర్చిస్తారు. ఎన్నికల కమిషన్‌ వైఖరిపై కూడా నేతలు చర్చించనున్నారు. ఇందులో 21 పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.

జేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా అన్ని విపక్ష పార్టీలను ఏక తాటిపై తెస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..మరోవైపు ఈవీఎంలపై పోరును కూడా ఉధృతం చేశారు. సమావేశం అనంతరం సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో 21 పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీతో భేటీ కానున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ లెక్కింపు విషయంలో తమకున్న అభ్యంతరాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలని, ఈవీఎంల కంటే ముందుగా వీవీ ప్యాట్లనే లెక్కించాలని కోరనున్నారు.

మరోవైపు ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీఈసీ కార్యాలయం ముందు విపక్ష పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5 గంటల వరకు ఆందోళన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ధర్నాకు అందరూ రావాలని చంద్రబాబు వివిధ పార్టీల అధినేతలను కోరారు. నిన్న పశ్చిమ బెంగాల్‌ సీఎంతో భేటీ అయిన చంద్రబాబు ఫలితాల అనంతరం పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఇవాళ ఈసీని కలిసేందుకు ఢిల్లీ రావాలని మమతను కూడా ఆహ్వానించారు టీడీపీ అధినేత. ఇప్పటికే సోనియా, రాహుల్‌, శరద్‌ పవార్‌, సీతారాం ఏచూరి, అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌, మాయావతితో మాట్లాడిన చంద్రబాబు.. సోమవారం కోల్‌కతాకు వెళ్లి మమతతో కీలక చర్చలు జరిపారు.

మైండ్ గేమ్స్‌ తో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు… 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభం అవుతుందన్నారు. ఇది 120 నుంచి 130 సీట్ల వరకు వెళ్లొచ్చన్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.

మైండ్ గేమ్స్‌తో కొందరు గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామన్న చంద్రబాబు.. ముందుగా వీవీపాట్లు లెక్కించాలనే డిమాండ్ పై నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదన్నారు చంద్రబాబు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 22న కౌంటింగ్ ప్రక్రియపై మరోసారి అందరిఇక శిక్షణ ఇస్తామన్నారు. వీవీపాట్ల లెక్కింపులోను చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మోదీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు.

ఎలైట్ సర్వే.. 38.65 శాతం మంది టీడీపీకి..

ఎలైట్ సర్వేలో భాగంగా మొదటి ప్రశ్న ఏపీ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అంటే అత్యధికంగా 38.65 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. కొంత సంతృప్తిగానే ఉన్నామని 18.39శాతం మంది అన్నారు. 35.4శాతం మంది అసంతృప్తిగా ఉన్నామన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినవారు కేవలం 8.56శాతం మాత్రమే.

అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ పార్టీ వస్తే బాగుంటుందని అడిగిన రెండో ప్రశ్నకు టీడీపీ వైపే ప్రజలు మొగ్గుచూపారు. టీడీపీకి 43.8శాతం మంది కోరుకుంటే.. వైసీపీ ప్రభుత్వం రావాలని 40.3శాతం మంది కోరుకున్నారు. జనసేన పట్ల కేవలం 12.6శాతం మాత్రమే మొగ్గు చూపారు. ఇతరులు అంటే బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పీ లేదా కొత్త పార్టీలను 3.3 శాతం మంది కోరుకున్నారు. ఇక్కడ వైసీపీ – టీడీపీ మధ్య 3.5శాతం వ్యత్యాసం కనిపించింది. ఇక టీడీపీ ప్రభుత్వ పనితీరుపై అడిగిన మూడో ప్రశ్నకు.. 36.5శాతం మంది బాగుందన్నారు. 34.8శాతం మంది బాగాలేదన్నారు. ఫర్వాలేదని 20.6శాతం మంది, తెలియదని 8.1శాతం మంది అన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాయకుడు ఎవరని నాలుగో ప్రశ్నకు జనాలు చంద్రబాబుకే మొగ్గు చూపారు. 45.8శాతం మంది టీడీపీ అధినేతకు మొగ్గుచూపగా.. 40.6శాతం మంది జగన్ ను కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల కేవలం 9.7శాతం మంది మాత్రమే విశ్వాసం ఉంచారు. ఇతరులు 3.9 శాతంమంది ప్రత్యామ్నాయం ఉందని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఓటేశారని ప్రశ్నిస్తే.. 44.6శాతంమంది టీడీపీకి వేసినట్టు సర్వే తెలింది. ఇక వైసీపీకి 41.3శాతం మంది ఓటేశారు. జనసేన దాని మిత్రపక్షాలకు 12.8శాతం ఓట్లు పడ్డాయి. ఇతర పార్టీలకు 1.3శాతం ఉంది. ఎందుకు ఆ పార్టీకి ఓటేశారన్న ప్రశ్నకు కూడా సమాధానం రాబట్టడం జరిగింది. పార్టీని బట్టి వేశామని 26.7శాతం మంది అంటే… అభ్యర్ధిని బట్టి వేశామని కేవలం 10.8శాతంమంది మాత్రమే సమాధానం ఇచ్చారు. సంక్షేమ పథకాలు అత్యధికంగా 31శాతం ప్రబావితం చేశాయన్నారు. మరోక్క చాన్స్ ఇద్దామని 14శాతం మంది ఓటేశారు. మార్పు కోసం 13శాతం మంది.. మేనిఫెస్టో నచ్చి వన్ పాయింట్ 5 శాతం మంది ఓటేశారు. మరో 3 శాతం మంది ఇతర కారణాలు చెప్పారు.

ఓటింగ్ సరళిపైనా వివిధ వర్గాల నుంచి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్ధులు వైసీపీ పట్ల 44శాతం మంది మొగ్గుచూపారు. టీడీపీకి 34శాతం మంది మాత్రమే ఓటేశారు. జనసేనకు 22శాతం మంది మద్దతుగా ఉన్నారు. రైతులు వైసీపీకి 30శాతం మంది అండగా ఉంటే.. టీడీపీకి అత్యధికంగా 55శాతం మంది ఉన్నట్లు సర్వేలో చెప్పారు. జనసేన పట్ల రైతులు 13శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కూలీల విషయానికి వస్తే 42శాతం మంది వైసీపీగా అండగా ఉంటే.. టీడీపీకి 40శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. జనసేనకు 15శాతం మంది, ఇతర పార్టీలకు మరో 2శాతం మందిఅండగా ఉన్నారు. గృహిణిలు మాత్రం ఏకపక్షంగా సుమారు 59శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలగా.. 37శాతం మంది వైసీపీ పట్ల మొగ్గు చూపారు. జనసేనకు కేవలం 4శాతం అండగా ఉంటే.. ఇతర పార్టీలకు 3శాతం ఓట్లేశారు. ఉద్యోగులు వైసీపీ పట్ల మొగ్గుచూపారు. 52 శాతం మంది జగన్ కే జై కొట్టారు. 44శాతమంది మాత్రమే టీడీపీకి ఓటేసినట్టు తెలిపారు. జనసేనకు 4శాతం మంది అండగా ఉన్నారు. వ్యాపారులు 36 శాతం మంది మాత్రమే వైసీపీకి ఉంటే.. 61శాతం మంది మాత్రం టీడీపీకి జైకొట్టారు. పవన్ కళ్యాణ్ పార్టీకి కేవలం 3శాతం మంది మద్దతిచ్చినట్లు తేలింది.

18 -30 ఏళ్ల వయస్కులు వైసీపీకి మొగ్గు చూపారు. 49శాతం ఫ్యాన్ కు ఓటేస్తే…. 37 శాతం మంది టీడీపీని ఆదరించారు. 14శాతం మంది జనసేన పట్ల ఆకర్శితులయ్యారు. 31-40 మధ్య వయసు ఓటర్లు మాత్రం వైసీపీ, టీడీపీలకు సమానంగా ఓటేశారు. 45శాతం మంది చొప్పున ఓటేయగా.. 10శాతం మంది జనసేన వైపు మొగ్గుచూపారు. 41- 50 మధ్య వయసున్న ఓటర్లు 48శాతం మంది టీడీపీకి అండగా ఉంటే…. 46శాతం మంది వైసీపీకి జై కొట్టారు, 6శాతం జనసేనకు మద్దతు తెలిపారు. 51-60 మధ్య వయసున్న ఓటర్లలో 56 శాతంమంది టీడీపీకి పట్టం కట్టారు. 43శాతం మంది వైసీపీ పట్ల మొగ్గుచూపారు. 1శాతం మాత్రమే జనసేనకు అండగా ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన వృద్దులు 64శాతం మంది టీడీపీకి గంప గుత్తగా ఓటేశారు. 35శాతం మంది మాత్రమే వైసీపీ పట్ల విశ్వాసం చాటుకున్నారు. 1 శాతం మాత్రమే జనసేనకు ఓటేశారు.

ఆ నాయకుల జాతకాలు తెలిసే సమయం దగ్గరపడింది

ఎక్కడ చూసినా పోలింగ్ ఫలితాలపైనే చర్చ. నెల.. వారాలు.. రోజులు.. గంటలు లెక్కపెడుతున్నారు.. పోటీ చేసిన నాయకులకొక టెన్షన్ అయితే పోటీలో నిలబడిన నాయకుడి గెలుపుకోసం ప్రజలు పడుతున్నటెన్షన్ మరో వైపు.. ఎక్కడ చూసినా అదే అటెన్షన్ వాతావరణం నెలకొంది..

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలు.. అరకు పార్లమెంటులోని రంపచోడవరం అసెంబ్లీ స్థానం.. మొత్తం 19 నియోజకవర్గాల్లో తలబడిన నాయకుల జాతకాలు తెలిసే సమయం దగ్గరపడింది. జేఎన్టీయూ, ఆదికవి నన్నయ్య పీజీ సెంటర్, రంగరాయ మెడికల్ కాలేజీ, ఐడియల్ కాలేజీ, జిల్లా స్పోర్స్ట్స్ గ్రౌండ్ లలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిస్తూనే మరోవైపు పొలిటికల్ పార్టీల నాయకులకు కౌంటింగ్ ప్రక్రియమీద అవగాహన కల్పిస్తూ ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

రాష్ట్రంలోనే అత్యధికంగా 4581 పోలింగ్ కేంద్రాలున్న జిల్లా.. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతీ నియోజకవర్గానికి పది నుంచి 14 టేబుళ్లు పెట్టి కౌంటింగ్ నిర్వహించనున్నారు. శాసన సభ స్థానాలకు 252 టేబుళ్లు, పార్లమెంటు స్థానాలకు 244 టేబుళ్లు ఏర్పాటు చేయడం ద్వారా కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను కౌంట్ చేస్తారు. జిల్లాలో పార్లమెంటుకు సంబంధించి 19418 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందగా శాసన సభకు సంబంధించి 21727పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నికల యంత్రాంగానికి అందాయి. వీటిని లెక్కించిన తరువాత ఈవీఎంలు లెక్కిస్తారు. జిల్లాలో సగటున 16 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానుండగా అత్యధికంగా రంపచోడవరం నియోజకవర్గానికి 29 రౌండ్లలో ఫలితాలు వస్తాయి. చివరి ఫలితం రంపచోడవరందే. ఇవి కాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గానికి ఐదునుంచి ఆరు వీవీ ప్యాట్‌ల స్లిప్పులను కౌంటింగ్ చేస్తారు. అంతే కాకుండా అభ్యర్ధనల మేరకు కౌంటింగ్ చేసే వీవీప్యాట్‌ల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సిబ్బందితో కలిపి 5,908 మంది సిబ్బంది కౌంటింగ్ నిర్వహణలో ఉండబోతున్నారు. ఓట్ల లెక్కంపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్‌తో పాటు పార్టీల నాయకులు, ఏజెంట్లు ఎక్కడుండాలి..? ఎలాంటి సూచనలు పాటించాలి అన్నదానిపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. చివరిదశ పోలింగ్‌ మరికొన్ని గంటలలో జరుగుతున్నాయనగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, సి.కాలేపల్లిలో రేపు రీపోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ తాజా నిర్ణయంతో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది.

తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రగిరిలో ఇప్పటికే 5 పోలింగ్ బూత్‌లతో రీపోలింగ్ నిర్వహణకు ఇప్పటికే ఈసీ నిర్ణయం తీసుకుంది.

చంద్రగిరి నియోజకవర్గ రీపోలింగ్ నిర్వహణ వ్యవహరం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఈనేపథ్యంలో రీపోలింగ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 300 మంది పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మరోవైపు చంద్రగిరి రీపోలింగ్ అంశంపై ఢిల్లీలోని ఈసీ కార్యాలయం చుట్టూ వివాదం ముసురుకుంది.. పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.