AP Assembly Sessions : 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Update: 2024-06-12 06:20 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.

అసెంబ్లీలో పార్టీల వారీగా సీటింగ్ మారనుంది. టీడీపీ ( TDP ), జనసేన ( Jana Sena ), బీజేపీ ( BJP ), వైసీపీ ( YCP ) ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News