AP : చంద్రబాబు, పవన్ కు కేసీఆర్ శుభాకాంక్షలు

Update: 2024-06-05 07:35 GMT

కొత్త ప్రభుత్వాలను అభినందించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

వారిద్దరిని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల మద్దతుతో కూటమి విజయం సాధించిందని, పాలనలోనూ వారి విశ్వాసం పొందాలని సూచించారు.

ఐతే.. ఏపీలో వైసీపీ అద్భుత విజయం సాధించబోతోందని కేసీఆర్ అంచనా వేశారు. ఇదే విషయాన్ని లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఐతే.. ఆ అంచనా అట్టర్ ఫ్లాప్ అయింది.

Tags:    

Similar News