చిట్టి న్యూస్

సెక్స్ రాకెట్ నడిపిస్తోన్న భోజ్ పూరీ నటి

మోడల్స్ ను వ్యభిచారకూపంలోకి దించుతున్న భోజ్ పురి నటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆరే కాలనీలోని రాయల్ పామ్ హోటల్‌లో . సుమన్ కుమారి (24) అనే నటి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితులను ట్రాప్ చేసేందుకు పోలీసులు ఓ నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. అతనితో ఒక్కో మోడల్‌కు 50,000 నుంచి 80,000 రూపాయల ధరను మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. నటి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది.

మహిళా నక్సలైట్ల ఎన్కౌంటర్

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందారు. వీరిపై రూ.28 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నక్సలైట్లు.... భోరమ్‌దేవ్ కమిటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యురాలు సునీత, సరితా ఖతియా మోచాగా గుర్తించామని తెలిపారు. గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.  

రైతు కంట రక్త కన్నీరు

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నిన్ని రాత్రి కురిసిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. నిన్న ఒక్క రోజే సుమారు 50 వేల పై చిలుకు బస్తాలు రావడంతో ధాన్యం కాంటా వేయడం ఆలస్యం అయ్యింది. దీంతో రైతుల ధాన్యం కుప్పలు అలాగే ఉండటంతో కాంటా వేసిన బస్తాలు సహా ధాన్యం రాశుల కిందకు వర్షం నీరు చేరి తడిసిపోయాయి. అధికారుల తీరు వల్లే ఇలా జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

క్రమంగా విస్తరిస్తోన్న కరోనా

భారతదేశంలో 12,000కి పైగా తాజా కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య 67,556కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,48,81,877గా నమోదైంది. మొత్తం యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉండగా, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,300కి చేరుకుంది. 

చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు...

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా.. సుగంధ భరిత చందనంలో కొలువుండే సింహాద్రినాథుడు ఒక్క వైశాఖ శుధ్ద తదియనాడు.. మాత్రమే తన నిజ రూప దర్శనాన్ని ఇస్తాడు. దీనినే భక్తులంతా చందోనోత్సవంగాను, చందన యాత్రగానూ పిలుస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం.. లక్షలాది మంది వస్తారన్న అంచనాతో... భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారలు. ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరవుతారు.


విపక్ష నేతపై రాళ్ల దాడి

తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్‌ ఎర్రగొండపాలెం చేరుకుంటున్న సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో ఎన్‌ఎస్‌జీ కమాండోస్‌ చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక కమాండెంట్‌ తలకు గాయమైంది.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు కాన్వాయ్‌ వరకూ రానివ్వగా, దగ్గరకొచ్చిన తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. చంద్రబాబుపైకి రాళ్లు విసిరాయి.


బాగా లాగించేస్తున్నారు...

రంజాన్‌ నెలలో హైదరాబాదీలు హలీమ్ ను తెగ లాగించేస్తున్నారు. కేవలం స్విగ్గీ ద్వారానే పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్‌ చేశారట. స్విగ్గీ చేసిన ఓ సర్వే లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఒక్క స్విగ్గీ యాప్‌ ద్వారానే ఇంత ఫుడ్‌ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని భాగ్య నగరవాసులు అంటున్నారు.


అమరావతిలో అలజడి

అమరావతిలో మళ్లీ అలజడి చెలరేగింది. రాజధానిలో పేదలకు సెంటు స్థలం ఇస్తామంటూ.. ఆర్‌5 జోన్‌లో భూములను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తోంది సీఆర్డీఏ. నిన్న కృష్ణాయపాలెంలో ప్రొక్లెయినర్లను దించిన సీఆర్డీఏ.. ఇవాళ ప్రొక్లయినర్‌తో ఐనవోలు సమీపంలో కంపను తొలగించే ప్రయత్నం చేస్తోంది. సీఆర్డీఏ చర్యలపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌5 జోన్‌ అంశం హైకోర్టులో ఉన్నందున.. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణే అంటున్నారు రైతులు.

అమరావతిలో మళ్లీ అలజడి

అమరావతిలో మళ్లీ అలజడి చెలరేగింది. రాజధానిలో పేదలకు సెంటు స్థలం ఇస్తామంటూ.. ఆర్‌5 జోన్‌లో భూములను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తోంది సీఆర్డీఏ. నిన్న కృష్ణాయపాలెంలో ప్రొక్లెయినర్లను దించిన సీఆర్డీఏ.. ఇవాళ ప్రొక్లయినర్‌తో ఐనవోలు సమీపంలో కంపను తొలగించే ప్రయత్నం చేస్తోంది. సీఆర్డీఏ చర్యలపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌5 జోన్‌ అంశం హైకోర్టులో ఉన్నందున.. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణే అంటున్నారు రైతులు.

HYD: ఒక్క స్విగ్గీలోనే 4లక్షల హలీమ్స్‌.. మిగతా వాటి లెక్కెంతో..!

రంజాన్‌ నెలలో హైదరాబాదీలు తమ అభిరుచికి తగ్గట్లుగా పండుగ చేసుకున్నారు. రెగ్యులర్‌గా తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్‌ హలీమ్, స్వీట్లు భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే ఈసారి 20శాతం ఎక్కువగా ఆర్డర్‌ చేసి తెప్పించుకుని తిన్నారు. స్విగ్గీ చేసిన ఓ సర్వే లో వెల్లడైన వివరాలను ఇవి. ఒక్క స్విగ్గీ యాప్‌ ద్వారానే ఇంత ఫుడ్‌ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని భాగ్య నగరవాసులు అంటున్నారు.

ఇక రంజాన్‌ మాసంలో ఎప్పటిలాగే హలీమ్‌ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్‌ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్‌ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్‌ హలీమ్‌ ఉన్నా బిర్యానీకి క్రేజ్‌ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్‌ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్‌ చేశారని.. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్‌ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్‌ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయని స్వీగ్గి తెలిపింది. వీటితో పాటుమల్పువా, ఫిర్నీ,రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్‌ పెరిగింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్‌ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది.

మరోవైపు హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్‌ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్‌ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.  

మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌కు  సీబీఐ సమన్లు

మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ సీబీఐ సమన్లు పంపింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనుంది. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్స్‌ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందన్నారు సత్యపాల్ మాలిక్. దీంతో సత్యపాల్ మాలిక్‌కు పరువునష్టం నోటీసు పంపారు రామ్ మాధవ్. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గానే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లోనూ గవర్నర్‌గా మాలిక్‌ పనిచేశారు.

నేటి నుంచే గంగా పుష్కరాలు

నేటి నుంచి గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గంగా పుష్కరం లేదా గంగా పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమై 3 మే 2023న ముగుస్తాయి. వైశాఖ శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమై వైశాఖ శుక్ల త్రయోదశి నాడు ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈ 12 రోజుల పుష్కర కాలంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం, కర్మకార్యాలు నిర్వహించడం, ఇతర ఆచారాలు పాటించడం ఎంతో పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుష్కరం అనేది మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు సంబంధించిన నదుల పండుగ. ఇది ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం జరుగుతుంది. నదిని పవిత్రంగా మార్చే శక్తి పుష్కరుడుకు ఉంటుందని నమ్మకం. పుష్కరుడు బృహస్పతితో కలిసి అశ్వినీ నక్షత్ర మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అన్ని పుష్కరాలలో గంగా పుష్కరాలు అత్యంత పవిత్రమైనవి. గంగను సుర నది అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది మూడులోకాల్లో ప్రవహించే పుణ్యనది. గంగా పుష్కరాలు గంగానదీ తీరం వెంబడి ఉండే పవిత్ర పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి, ఋషీకేశ్, అలహాబాద్లలో జరుగుతాయి. గంగా పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు

సెలబ్రిటీ ఖాతాలకు బ్లూటిక్ తొలగింపు

దేశంలోని సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూటిక్‌ తొలగించింది. సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ బ్లూటిక్​ను.. నెలవారీ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది. సాధారణ యూజర్లు సైతం బ్లూటిక్ పొందేలా సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది. అలాగే డబ్బులు చెల్లించనివారికి టిక్ మార్క్​ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు సెలబ్రిటీలకు బ్లూ టిక్‌ మార్క్‌ కనిపించడం లేదు.


రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌ఘడ్‌ నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఐరన్ ఓర్ కోసం వెళ్తున్న లారీని తగులబెట్టారు. పరస్‌గావ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓర్చ వద్ద జరిగిన ఘటనను నారాయణపూర్ జిల్లా ఎస్పీ పుష్కర శర్మ ధృవీకరించారు. ఐరన్ మైన్‌ లోడ్ కోసం చోటే నగర్ వెళ్తున్న లారీని మావోయిస్టులు తగులబెట్టారని తెలిపారు.

అడుగంటుతోన్న జల వనరులు

నల్గొండ జిల్లా పరిధిలోని భారీ ప్రాజెక్టు అయినా నాగార్జున సాగర్‌ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతుంది. వేసవి మొదట్లోనే ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 523 అడుగులకు పడిపోయింది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి సామర్థ్యం 156 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది కంటే 16 అడుగులు మేర నీటిమట్టం తగ్గిపోయింది.

భగ్గుమంటోన్న సూరీడు....

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. ఇక తీర ప్రాంతం అయిన విశాఖ నగరంలో సైతం వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఎండవేడిమి కారణంగా అస్వస్థతకు గురై పలువురు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇక ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

గజరాజుల భీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల హల్‌చల్ చేశాయి. కొమరాడ మండలం బందవలసలో విధ్వంసం సృష్టించాయి. శ్రీనివాసరావు అనే రైతు ఆయిల్ ఫామ్‌ తోటలోకి ప్రవేశించిన ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అక్కడే ఉన్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు ఆవులు మృతి చెందాయి. మరోవైపు తోటలో పార్క్ చేసిన కారును పూర్తిగా ధ్వంసం చేశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగుల నుంచి తమను రక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.

నాణేల రూపంలో రూ. 11కోట్ల

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ( SSST ) డిపాజిట్ చేసిన నాణేలను ఉంచడానికి బ్యాంకులకు భారంగా మారింది. ఏకంగా రూ. 11 కోట్లు నాణేల రూపంలో కలిగి ఉండటంతో స్థలం కొరత ఏర్పడింది. ఈ కారణంగా షిర్డీలోని నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నాణేలను తీసుకోవడం మానేశాయని ట్రస్ట్ సీఈఓ రాహుల్ జాదవ్ తెలిపారు. దీంతో ట్రస్ట్ ఆర్‌బిఐకి లేఖ రాసింది. అహ్మద్‌నగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేసే అవకాశం కల్పించమని కోరింది. 

గర్భగుడిలోకి నో ఎంట్రీ

సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి దేవాదాయశాఖ మంత్రితో పాటు.. వీఐపీలు కూడా గర్భగుడిలోకి వెళ్లకూడదని ట్రస్ట్ సభ్యుల తీర్మానం చేశారు. సీఎం కార్యాలయానికి 12 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు లేఖ పంపారు. ధర్మకర్త, పీఠాధిపతులు తప్ప ఇంకెవరు కూడా.. గర్భగుడిలోకి వెళ్లేందుకు వీలు లేదని కోరారు. ఈనెల 23న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. బోర్డు సభ్యులు తీర్మానం చేసి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్న  PSLV-C55

తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని షార్‌ నుంచి రేపు PSLV-C55 రాకెట్‌ ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌ చెందిన 741 కిలోల బరువు గల టెల్‌ ఈవోఎస్‌-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల బరువైన మరో చిన్న ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఇవాళ ఉదయం 11.49 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంట్‌డౌన్‌ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. 

నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

హైదరాబాద్‌ నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ను మంత్రి హారీష్‌ రావు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు డయాలసిస్‌ కేంద్రాలు ఉంటే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 102కి పెంచుకున్నట్లు చెప్పా రు. నగరం నలుమూలల టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణం చేసుకున్నామన్నారు. మరో రెండు వారాల్లో 250 కోట్ల రూపాయలతో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

నంద్యాలలో నక్షత్ర తాబేళ్ల కలకలం

నంద్యాలలోని గెలివి స్కూల్‌ ఆవరణలో నక్షత్ర తాబేళ్లు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో రైడ్‌ చేసిన ఫారెస్ట్ అధికారులు.. ఏడు నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన తాబేళ్లను పారెస్ట్‌లో విడిచిపెడతామని తెలిపారు. ఇక స్కూల్‌ యాజమాన్యాన్ని విచారిస్తామని వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఉన్న తాధికారులు ఆదేశించారు.

అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దర్యాప్తు ముమ్మరం

గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులు లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. నిందితులను భారీ బందోబస్తు మధ్య ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. మర్డర్ జరిగిన ప్లేస్‌లో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.

గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్‌తో పాటు అతడి సోదరు అష్రఫ్‌ను ముగ్గురు నిందితులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి చంపారు. పోలీసు కస్టడీలో ఉన్న వీరిని ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తరలిస్తుండగా.. మీడియా ప్రతినిధుల్లా వచ్చిన నిందితులు సుమారు 14 రౌండ్లకుపైగా కాల్పు జరిపారు. ఘటనలో అతీక్‌ సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు.

మలుపులు తిరిగిన సాహస యాత్ర

రెండు రోజుల క్రితం మౌంట్ అన్నపూర్ణ శిఖరంపై గల్లంతు అయిన భారత పర్వతారోహకుడు అనురాగ్ మలూ ఆచూకీ లభించింది. సోమవారం మలూ అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి బేస్ క్యాంప్ నాలుగు నుంచి మూడుకు తిరిగి వస్తుండగా అతడి అచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మరణించి ఉంటాడని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మలూ ప్రాణాలతోనే ఉన్నారని తెలిసింది. అనురాగ్ మలూ ప్రాణాలతోనే లభించినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అతడి సోదరుడు తెలిపాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోందని స్పష్టం చేశాడు. 

కొత్త టీజర్ పై డివైడ్ టాక్

ఆదిపురుష్ కొత్త టీజర్‌ విడుదలైన దగ్గర నుంచి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై ఎడతెగని చర్చ సాగుతోంది. పాత టీజర్ కు, కొత్త టీజర్ కు మధ్య వ్యత్యాసంపై జనాలు చర్చించుకుంటున్నారు. ఓ వైపు ప్రభాస్ ఫ్యాన్స్ టీజర్ లో జరిగిన మార్పులపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం మాత్రం ఇంకా పెదవి విరుస్తూనే ఉన్నారు. కలర్ గ్రేడ్ తప్ప కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ లో ఎలాంటి మార్పు లేదని తేల్చేస్తున్నారు. 

కిక్కిరిసిన మెట్రో

హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. కెపాసిటీకి మించి మెట్రోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణికులు. ఎండల తీవ్రత పెరగడంతో నగరవాసులు, ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వేడి, ఉక్కపోత తట్టుకోలేక మెట్రోలో కూల్ జర్నీ చేస్తున్నారు. అటు ప్రయాణికులతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోతోంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

బహిరంగ సభకు నిరాకరణ; తెలుగు తమ్ముళ్ల ధర్నా

సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అధికారులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు మున్సి పల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 23న ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం బాలకృష్ణ అభిమానులు అప్లై చేశారు. అయితే కార్యక్రమానికి ఇవాళ అనుమతి ఇస్తామన్న అధికారులు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగారు. 

జయహో సీరత్ !

జమ్ములోని కతువా ప్రాంతంలో ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న చిన్నారి సీరత్ నాజ్ స్కూల్ ఆవరణలో ఓ వీడియో ద్వారా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ వీడియో చేసిన సంగతి తెలిసిందే. మోదీ జీ మా స్కూల్ పరిస్థితి చూడండి అంటూ తమ కష్టాలను చెప్పుకొచ్చింది. ఈ వీడియో కాస్తా జాతీయ స్థాయిలో వైరల్ గా మారడంతో జమ్మూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రవిశంకర్ హుటాహుటిన స్కూల్ ను సందర్శించారు. అక్కడి పరిస్థితులు స్వయంగా పర్యవేక్షించి స్కూల్ పునర్ నిర్మాణానికి తొలి విడతగా రూ. 91లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

సవాల్ కు ప్రతి సవాల్

అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్‌ మధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతుంది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. రామచంద్రారెడ్డి సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి కాలువ.. ఎన్ హనుమాపురం వేదికగా చర్చకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇక అభివృద్ధిపై ప్రశ్నించిన ఉప సర్పంచ్‌పై కేసు పెడతారా అంటూ కాలువ శ్రీనివాస్ మండిపడ్డారు. 

హిందూపురం మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థి తులు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అధికారులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు మున్సి పల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 23న ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం బాలకృష్ణ అభిమానులు అప్లై చేశారు. అయితే కార్యక్రమానికి ఇవాళ అనుమతి ఇస్తామన్న అధికారులు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగారు. అంతే కాదు MGM గ్రౌండ్‌ను కేవలం క్రీడలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ప్రై వేట్‌ ఫంక్షన్‌లకు ఇవ్వబోమన్నారు. అయితే పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులు, బాల కృష్ణ అభిమానులు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పో యింది. దీంతో మున్సిపల్‌ అధికారుల తీరును నిరసిస్తూ బాలకృష్ణ అభిమానులు ఎండలో నిరసన తెలియజేస్తున్నారు. వేడుకల నిర్వహణ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

ముంబై హై కోర్టును ఆశ్రయించిన బిగ్ బీ మనుమరాలు

బిగ్ బీ మనవరాలు, అందాల ఐశ్వర్యారాయ్, అభిషేక్ ల గారాల పట్టి ఆరాధ్యా బచ్చన్ 11ఏళ్ల పసి ప్రాయంలోనే తన హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గానూ పది యూట్యూబ్ ఛానళ్లపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై వచ్చిన కథనాలను పూర్తిగా డిలీట్ చేయాల్సిందిగా పిటిషన్ లో ప్రస్తావించింది. 

తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి విద్యార్థి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. పరీక్షా హాల్‌లో టీచర్ల ఎదుటే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. బాధిత విద్యార్థి రక్తపు మడుగులోనే కుప్పకూలాడు. ఆ విద్యార్థిని హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించారు టీచర్లు. కత్తి దాడిలో గాయపడ్డ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

అనంతలో సంచలనంగా మారిన మంత్రి అనుచరుడి ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో మంత్రి ముఖ్య అనుచరుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. కళ్యాణ్‌దుర్గం తహశీల్దార్ కార్యాలయం ఎదుట.. మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుడు బిక్కీ హరి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. దాంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. తన భూమిని అక్రమంగా కాజేసేందుకు.. తిప్పేస్వామి అనే వైసీపీ నేత ప్రయత్నిస్తున్నారని హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి సమీపంలో ఉన్న వంకను ఆక్రమించుకునేందుకు.. తిప్పేస్వామి అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

అటు తిప్పేస్వామి.. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వర్గానికి చెందిన మనిషి అని స్థానికులు అన్నారు. బాధితుడి భార్య కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బిక్కీ లక్ష్మీదేవి అని తెలిపారు. మంత్రి అనుచరుడి ఆత్మహత్యాయత్నం అనంతలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఏపీలో ప్రజలు ఆస్తులకే కాదు అధికార పార్టీ నేతలకు చెందిన భూములకు రక్షణ లేకుండాపోయిందని వైసీపీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నారు.

కిక్కిరుస్తున్న మెట్రోలు.. ప్రమాదకరంగా ప్రయాణం

హైదరాబాద్ మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. కెపాసిటీకి మించి మెట్రోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణికులు. ఎండల తీవ్రత పెరగడంతో నగరవాసులు, ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వేడి, ఉక్కపోత తట్టుకోలేక మెట్రోలో కూల్ జర్నీ చేస్తున్నారు. అటు ప్రయాణికులతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోతోంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ..పిటిషన్‌ తిరస్కరించిన సూరత్‌ కోర్టు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. రాహుల్‌ పిటిషన్‌ను సూరత్ కోర్టు తిరస్కరించించింది. ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ సూరత్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇపుడు కోర్టు తీర్పు నేపథ్యంలో రేపు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించనున్నారు రాహుల్‌గాంధీ.