చిట్టి న్యూస్

PAWAN: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పవన్‌ పరామర్శ

రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మాణీలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం వీరిని కలిసి ధైర్యం చెప్పారు. అరగంట పాటు చంద్రబాబు కుటుంబసభ్యులతో జనసేనాని సమావేశమయ్యారు. చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని మీరు కూడా అధైర్యపడొద్దని ఆత్మస్థైర్యం నింపారు.

BALAYYA: భువనేశ్వరికిబాలయ్య పరామర్శ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రి చేరుకున్నారు. సోదరి భువనేశ్వరి, కూతురు బ్రహ్మణితో ఆయన సమావేశమై వారిని పరామర్శించారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు బాధాకరమని బాలకృష్ణ విచారం వ్యక్తంచేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తోనూ బాలకృష్ణ భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ముగ్గురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ముగ్గురు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.



Chandra Babu:   బెయిల్ కోసం పూజలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు త్వరగా బెయిల్ మంజూరు కావాలంటూ... గంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో... నాజ్ సెంటర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెదేపా నేతలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తమ అధినేత చంద్రబాబు బయటకు వస్తారని తెదేపా నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. అటు చిత్తూరు జిల్లా కుప్పంలో... తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ ఆలయంలో పూజల తర్వాత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నిరసన దీక్షలో పాల్గొని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

BABU ARREST: భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలుగుదేశం భగ్గుమంది. ఎలాంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం వైసీపీ సర్కార్ నిరంకుశ పాలనకు నిదర్శనమని నేతలు మండిపడ్డారు. రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలనేది జగన్ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది.


చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, అభిమానులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నేతల గృహ నిర్బంధాలు, అరెస్టులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇంటి ముందు చదలవాడ అరవిందబాబు బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నాను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరవిందబాబు ఎత్తుకుని తీసుకెళ్లి ఇంట్లో నిర్బంధించారు.


విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ముమ్మాటికీ అప్రజాస్వామికమని ఉమ మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్యను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెదేపా శ్రేణులెవరూ అక్కడికి రాకుండా ఆంక్షలు విధించారు. గుంటూరు, బాపట్ల జిల్లాలోనూ తెదేపా శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు నెలకొన్నాయంటూ నేతలు మండిపడుతున్నారు.


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో తెదేపా శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో గృహనిర్బంధంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ నాయకులు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంకటాపురం నుంచి ధర్మవరం వస్తున్న మాజీమంత్రి పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ధర్మవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా పరిటాల శ్రీరామ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ.... కడప ఇర్కాన్ సర్కిల్ వద్ద తెలుగుదేశం నేతలు రోడ్డెక్కారు. నిరనసకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదంటూ నేతలు ధ్వజమెత్తారు.

బెంగాల్‌ విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో.. నలుగురు అరెస్ట్‌

విశాఖలో సంచలనం సృష్టించిన బెంగాల్‌ విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆకాష్‌ బైజూస్ కాలేజీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు.. సాధన హాస్టల్‌ యజమాని, వార్డెన్ కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే రీతి సాహా చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నీట్ శిక్షణ కోసం కోల్‌కతా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా.. జులై 14న హాస్టల్‌ టెర్రస్‌పై నుంచి పడి సాహా మృతి చెందింది. 

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నన్ను కిడ్నాప్‌ చేయించారు: శ్రీనివాసులురెడ్డి

జమ్మలమడుగు వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. నిన్న కిడ్నాపైన వైసీపీ నేత శ్రీనివాసులురెడ్డి మీడియా ముందుకొచ్చారు. తనను కిడ్నాప్‌ చేయించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. నీ పాపం పండింది, పైన దేవుడు ఉన్నాడు అని కామెంట్‌ చేశారు. తాను పెట్టిన పోస్ట్‌లో ఎలాంటి తప్పు లేదని.. ఎమ్మెల్యేను విభేధించి బయటికి వచ్చినందుకు తమపై కక్ష పెంచుకున్నాడని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది- భట్టి

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండటం సంతోషంగా ఉందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ఆర్ కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవముందని తెలిపారు. భావోద్వేగాలతో వారు పార్టీకి దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు తిరిగి సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నామని అన్నారు.
ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో భారీ మెజారిటీతో గెలిచి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం లాంటిదని ఆరోపించారు.

Telangana BJP: అసెంబ్లీ సెక్రటరీకి డీకే అరుణ లేఖ

అసెంబ్లీ సెక్రటరీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇచ్చిన లేఖపై వివాదం నెలకొంది.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కోర్టు ఆర్డర్‌ సమర్పించిన ఆమె బీజేపీ లెటర్‌ హెడ్‌ పై లేఖ ఇచ్చారు. ఒకవేళ శాసనసభ స్పీకర్‌ డీకే అరుణ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తే ఆమె కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గా పరిగణిస్తారు. అయితే స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ లీగల్‌సెల్‌ అంటోంది.ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా ఉన్నారు డీకే అరుణ. దీంతో స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 

AP TDP: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విడుదల


ఢిల్లీ నుంచి వస్తుండగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో.. అయ్యన్నపాత్రుడును కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం యువగళం సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని అయ్యన్న విమర్శించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టుపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టులతో జగన్‌ తమ గొంతులు నొక్కలేరన్నారు.

Drugs Case: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరెస్ట్ అయిన వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్‌ ఆరా తీస్తోంది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 పైగా కేసులు నమోదైయ్యాయి. ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ వెంకట్‌ నిర్మాతలు సి. కళ్యాణ్‌,రమేష్‌ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిర్మాతల నుంచి 30 లక్షలకు పైగా కొట్టేశారు వెంకటరత్నారెడ్డి.ఓ ఐఆర్‌ఎస్‌ అధికారిని కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం.సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేసి మోసం చేశారని పోలీసుల విచారణలో తేలింది.

వన్‌ నేషన్.. వన్ ఎలక్షన్‌ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఐతే.. వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉండనున్నారు.    

TS: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ పెద్దలు.బీఆర్‌ఎస్‌లో నాలుగేళ్లుగా ఉన్నా గుర్తింపు లభించలేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 2019లోక్‌సభ ఎన్నికల వేళ ఎంపీ ఎన్నికల్లో కవిత గెలుపు కోసం మండవ ఇంటికి వచ్చిన కేసీఆర్‌ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. మండవకు ఎమ్మెల్సీ,రాజ్యసభ పదవి అంటూ ప్రచారం జరిగినా ఎలాంటి పదవులు దక్కలేదు. నాడు ఇంటికొచ్చి చేర్చుకొని..వాడుకొని వదిలేశారని ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Pakistani: పాకిస్థానీ అల్లుడికి అక్రమంగా ఆధార్‌ కార్డు


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు.తొమ్మిది నెలల తర్వాత అతని వ్యవహారం బయటపడింది.ఆధార్‌ కార్డు సంపాదించే నేపధ్యంలో పోలీసులకు చిక్కాడు.పాకిస్థాన్‌కి చెందిన ఫయాజ్‌ అహ్మద్‌ ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. అక్కడి సైఫ్‌జోన్‌లోని గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా..హైదరాబాద్‌ కిషన్‌బాగ్‌కు చెందిన నేహ ఫాతిమా పరిచమైంది. అది కాస్తా ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్‌ వచ్చి కిషన్‌బాగ్‌లోని బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్‌ పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు.

ఇక హైదరాబాద్‌ వస్తే గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్‌ షేక్‌, అఫ్జల్‌ బేగం హామీ ఇచ్చారు.2022 నవంబరులో నేపాల్‌లో ఉన్న ఫయాజ్‌ను కలసి అక్కడి స్ధానికులతో కలసి సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చి కిషన్‌బాగ్‌లో నివాసం ఏర్పాటు చేశారు.అతనికి ఆధార్‌ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు ప్లాన్‌ వేశారు. మాదాపూర్‌లోని ఓ ఆధార్‌ సెంటర్‌ల్లో తమ కుమారుడు మహ్మద్‌ గౌస్‌ పేరిట రిజిస్టర్‌ చేసేందుకు ప్రయత్నించారు. నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు సమర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.జుబేర్‌,అఫ్జల్‌బేగం పరారీలో ఉన్నారు. 

స్మశానం పక్కన  ప్లాట్లు  వద్దంటున్న లబ్ధిదారులు

రాష్ట్రంలో 23వేల కోట్లతో భూములు కొని ఇళ్ల ప్లాట్లు పేదలకు ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటున్న సీఎం జగన్ చిరువోలు గ్రామ లబ్దిదారుల సమస్య పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. పూర్తిగా స్మశానం పక్కన ఆర్ సి కరకట్ట స్థలంలో లే ఔట్ వేయటంతో నెలకొన్న సమస్య పరిశీలించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ఈ గ్రామంలో ఎస్సీ బీసీలకు అన్యాయం జరిగిందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  

Missing: అల్లూరి జిల్లా ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్ధునులు అదృశ్యం

అల్లూరి జిల్లా చింతపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధునులు అదృశ్యమయ్యారు. పోలీసులకు ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పాంగి గాయత్రి, గెమ్మిల నీరజ, 5వ తరగతి చదువుతున్న పాంగి గీత అనే ముగ్గురు విద్యార్ధునులు మంగళవారం సాయంత్రం ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటికి వెళ్లిపోయారు. తోటి విద్యార్ధులు ఆరా తీయగా బంధువుల ఇంటికి వెళుతున్ననట్లు చెప్పినట్లు తెలిపారు. బంధువుల ఇళ్లకు వెళ్లి వాకబు చేయగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

TPCC: హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.2 రోజుల పాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు ఈనెల 17న కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీకాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్ఎస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు.తెలంగాణ కోసం కాంగ్రెస్‌ త్యాగాలను వివరించడంతో పాటు, కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 

TS: తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్యూచర్‌ ఉమెన్ లీడర్ ప్రొగ్రాం

తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫ్యూచర్‌ ఉమెన్‌ లీడర్‌ పోగ్రామ్ 2023 పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టీఎస్పీఏలో గ్లోబెల్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మూడ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌పీఏ డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరయ్యారు. 

Aditya-L 1: శ్రీచెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్యా ఎల్-1 ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రేపు ఉదయం 11.50 గంటలకు పీఎస్‌పీ సి-57 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. అక్టోబర్ లో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ - 2 ద్వారా ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్‌ను నింగిలోకి పంపుతామన్నారు. నవంబరులో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

Uniform Civil Code: ఒకే దేశం, ఒకే ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

ఒకే దేశం, ఒకే ఎన్నికలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉండనున్నారు  పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒక దేశం ఒక ఎన్నిక, యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది. 

నేడు  సుప్రీంకోర్టులో ఆర్‌5 జోన్ కేసు విచారణ

అమరావతిలోని ఆర్‌5 జోన్ కేసు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. అమరావతి రాజధాని కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనమే.. ఆర్‌5 జోన్ కేసును విచారించనుంది. పిటిషన్‌పై విచారణ మధ్నాహ్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆర్‌5జోన్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. 

Janasena: 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రం రూపొందించిన ఫ్యాన్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వస్తుందంటే ఆయన అభిమానులకు పెద్ద పండగే. నెల్లూరుకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తమ నాయకుడికి పుట్టినరోజు కానుకగా అపూరపమైన బహుమతి ఒకటి ఇచ్చారు. 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని తీర్చిదిద్దారు. నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఈ కళాకృతిని తయారు చేయించారు. 470 కేజీల వెండి పట్టీలు, మువ్వలతో చిరునవ్వులు చిందిస్తోన్న పవన్ కల్యాణ్ ముఖచిత్రాన్ని రూపొందించారు.  

Rain: తెలంగాణలో తేలికపాటి వర్షాలు

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో  వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Yuvagalam: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇవాళ 201వ రోజు పాదయాత్ర ఉదయం 8గంటలకు పొంగుటూరు క్యాంపు నుంచి ప్రారంభంకానుంది. పోతవరంలో స్ధానికులు, రైతులతో సమావేశం కానున్నారు. ఉదయం 11గం. 30ని.లకు కవులూరులో స్దానికులు, మధ్యాహ్నం 12గం. 30ని.లకు చీపురుగూడెంలో గీతకార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6గం. 30ని.లకు ప్రకాశరావుపాలెంలో స్దానికులు, దళిత మహిళలతో సమావేశం కానున్నారు.

Crime: బాలిక గర్భం కేసులో ట్విస్ట్.. నిందితుడు వాలంటీర్‌ రాజశేఖర్‌

అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన బాలిక గర్భం దాల్చిన కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ రాజశేఖర్‌ బాలికను గర్భవతిని చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో ఉంచిన కానిస్టేబుల్ రమేష్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. గ్రామ పెద్దలకు కానిస్టేబుల్ రమేష్ కు మధ్య మనస్పర్ధల కారణంగానే రమేష్‌ను ఇరికించినట్లు తెలుస్తోంది.

AP: ఏపీలో పలుచోట్ల  డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్

ఏపీలో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేస్తున్నారు. కార్డ్ 2.0ను అమలు చేయోద్దంటూ నిరసన చేశారు. విశాఖ, మధురవాడలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు దిగారు. పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్నామని,.. డాక్యుమెంట్ విధానాన్ని డిజిటలైజేషన్ ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము రోడ్డును పడతామంటున్నారు. ప్రైమ్ 2.0 అనే కొత్త విధానంతో డాక్యుమెంట్లలో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెన్ డౌన్ చేస్తున్నారు డాక్యుమెంట్‌ రైటర్లు. 

మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలు అమలు- పురందేశ్వరి

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంఖానాదం కార్యక్రమంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. మహిళల కోసం మోదీ ఒక అన్నగా ముందు నిలిచాడని తెలిపారు. మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. నాడు కొంత మంది అవహేళన చేశారని విమర్శించారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారని పురందేశ్వరి అన్నారు. 

Drugs: మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో సంచలనాలు

మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో సంచలనాలు బయటికి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి డ్రగ్ మాఫియాతో లింక్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డ్రగ్స్‌ మాఫియా కింగ్ పిన్‌లతో వెంకట్, బాలాజీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్‌లో 5 రకాల మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. LSD, ESTACY పిల్స్, MDMA , కొకైన్, గాంజా స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రకలా డ్రగ్స్ ఉండటం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు పొన్నై అటవీప్రాంతంలో ఏనుగు బీభత్సం

తమిళనాడు పొన్నై అటవీప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జనసంచారం ప్రాంతంలోకి వచ్చిన గజరాజు ఓ మహిళను చంపేసింది. ఏనుగు దాడిలో మహిళతో పాటు ఓ ఆవు ప్రాణాలు కోల్పోయింది. పార్క్‌ చేసి ఉన్న బైక్‌ను ఏనుగు ధ్వంసం చేసింది. కుంకి ఏనుగుల సాయంతో దాడికి పాల్పడిన ఏనుగును అటవీ ప్రాంతలోకి తరమడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం రామాపురం ప్రాంతంలో ఏనుగు సంచరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరి ఏనుగును నియంత్రించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

శ్రీసత్యసా యి జిల్లాలో చెలరేగిపోతున్న ఆకతాయిలు

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర కత్తులతో యువకుల వీరంగం కలకలం సృష్టించింది. రద్దీ ప్రాంతంలో సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే మద్యం మత్తులో యువకులు హల్‌చల్‌ చేశారు. కత్తులు పట్టుకుని రోడ్డుపై తిరుగుతుంటే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తచెరువు ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో యువకుడు హంగామా సృష్టించిన ఘటన జరిగి వారం గడవకముందే ప్రధాన సర్కిల్‌ కత్తులతో వీరంగం వేయడంపై స్థానికుల వణికిపోతున్నారు. వీడియో వైరల్‌ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

ఐదు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

వచ్చే నెలలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం కానుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు.. ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. అకస్మాత్తుగా పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుందా? లేదంటే కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్ష నేతల్లోనూ విభిన్నరకాల చర్చలు జరుగుతున్నాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిరాతక భర్త

భార్యను వేట కొడవలితో నరికి చంపేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనలో లక్ష్మీ దేవి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాపూజీ పార్క్ వద్ద భార్యతో భర్త రఘు గొడవ పడ్డాడు. అనంతరం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె రోడ్డుపైకి రావడంతో కొడవలితో వెంటపడి నరికి చంపడానికి ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకున్నా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

NIMS: నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు

హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రకృతి వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. యోగ, ప్రకృతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో యోగాసనాలతో పాటు 159 రకాల థెరపిలను ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలో కొత్తగా మరో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.   

ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ పండగ

తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ వేదికగా నిలిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాసంలో ఆత్మీయుల మధ్య రాఖీపౌర్ణమి వేడుకలు జరిగాయి. రక్షాబంధన్‌ సందర్భంగా కేసీఆర్‌కు అక్కచెల్లెలు రాఖీ కట్టారు. ఆ తర్వాత సోదరీమణులకు కేసీఆర్‌ పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకలో కేసీఆర్‌ సతీమణి శోభతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.  

వైసీపీకి గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు గుడ్‌బై

విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు లేఖ పంపారు. కొండలరావు అరకు నియోజకవర్గం పరిశీలకునిగా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసరావు.. గజపతినగరం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న తన తమ్ముడు కొండపల్లి అప్పలనాయుడు, తన కుమారుడుతో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. 

రానున్న రోజుల్లో మరిన్ని కరెంటు కోతలు: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా 12 గంటలకు మించి కరెంటు ఎక్కువ ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కరెంటు కోతలు తప్పవని ఇప్పటికే నీరందక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసిన రైతులు నిండా మునిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. రైతుబంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదన్నారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయభేదాలు?

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. కిషన్‌రెడ్డి, ఈటల మధ్యలో గ్యాప్‌ రావడంతో మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌ చేరిక ఆఖరి నిమిషంలో ఆగింది. ఈటల ద్వారా బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తనను సంప్రదించకపోవడంతో చేరికను వాయిదా వేశారు పార్టీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. మరోవైపు బీజేపీలో చేరక ముందే అంబర్‌ పేట్‌ నుంచి పోటీ చేస్తానన్న కృష్ణాయాదవ్‌ ప్రకటించేశారు. దీంతో కిషన్‌ రెడ్డి అలర్ట్‌ అయినట్లు తెలుస్తోంది.