- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మంలో నిరసన చేపట్టిన మంత్రి పువ్వాడ.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కట్ అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందుతోందని చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్ కష్టాలు ఉండేవని విమర్శించారు.రైతులకు ఉచిత కరెంట్ వద్దు అన్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొడతారని మంత్రి పువ్వాడ తేల్చిచెప్పారు.

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీని వీడిటీడీపీలో చేరనున్నారు సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. ఆయనతో పాటు దాదాపు 3వేల అనుచరులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. భారీ కాన్వాయ్‌తో నంద్యాల నుంచి బయలుదేరి కావలి టీడీపీ క్యాంపుకు బయలుదేరారు వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు. యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన ఆదిత్య నవీన్, గగులోతు చంటి.. సూర్యాపేటకు చెందిన ఎల్. సుమన్ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 77కు చేరింది. సోమవారం ఒక్కరోజే 19 మంది అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకర్ నాగరాజును అరెస్ట్ చేశారు. ఏఈ పోల రమేష్ నుంచి 30 లక్షలకు నాగరాజు పేపర్ కొన్నాడు.

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ మండలం బోడుమల్ల దిన్నెకు చెందిన టమోటా వ్యాపారి రాజశేఖర్ దారుణ హత్యకు గురయ్యారు. రాజశేఖర్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అటుగా వెళ్లిన పశువుల కాపర్లు రాజశేఖర్ హత్యపై పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ హత్యపై పలు కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు.

కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నాడని.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడంటూ విరుచుకుపడ్డారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అన్నారు. చిన్నకారు రైతంటే కాంగ్రెస్ కు చిన్నచూపని సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అని ఆరోపించారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి హాలీవుడ్‌లో కొత్త వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పటికే వేతనాల సవరణ కోసం హాలీవుడ్ రైటర్స్ సమ్మె చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లక్షా 60 వేల మంది యాక్టర్లు సభ్యులుగా ఉన్న సాగ్ ఆఫ్ట్రా యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. వేతనాలను సవరించడంతో పాటు ఏఐతో ఏర్పడే ఇబ్బందుల నుంచి తమకు రక్షణ కూడా కల్పించాలని నటీ నటులు డిమాండ్ చేస్తున్నారు. యాక్టర్లతో చర్చలకు తాము సిద్ధమేనని వాల్ డిస్నీతో పాటు నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంపెనీలు పేర్కొన్నాయి.

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో దారి దోపిడి జరిగింది. శివాలయం గుడి సమీపంలో ఇద్దరిని బెదిరించి వారి వద్ద నున్న 12వేల రూపాయల నగదు, సెల్‌ఫోన్లు తీసుకుని పరారయ్యారు. స్థానికంగా ఉండే వెంకటయ్య, సిద్దయ్య లేబర్ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించారు. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. ఇద్దరిని బట్టలు విప్పించారు. వారి వద్దనున్న 12వేల నగదు తీసుకున్నారు. అలాగే ఇద్దరి సెల్‌ఫోన్లు లాక్కుని పరారయ్యారు. వెంకటయ్య, సిద్ధయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తు అదుపుతప్పి ముందున్న లారీని ఢీ కొట్టింది మరో లారీ. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం చేటు చేసుకుంది. పెద్దలు ప్రేమను అంగీకరించరనే భయంతో ఓ జంట ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు భగీరథ్, నేహాగా గుర్తించారు పోలీసులు. వీరి కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

చిత్తూరు జిల్లా :ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిద్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజక వర్గం లో వింత బ్రతికి వున్న తనను రెవిన్యూ రికార్డులో చంపేశారని భాధితురాలు ఆవేదన..
బ్రాహ్మణపల్లి పంచాయతీ సచివాలయంలో బతికుండగానే కనకమ్మకు డెత్ డిక్లరేషన్ ఇచ్చిన సచివాలయ సిబ్బంది

పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో టీఎంసీ 28వేల 985 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మరో వేయి 540 గ్రామ పంచాయతీల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 7వేల 764 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోగా, 417 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్ ఫ్రంట్ 2వేల 468 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించగా, CPI అండ్ CPM 2వేల 409 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 260 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.

రైతుల పట్ల రేవంత్‌కు ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుందని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో దూరిన గాడ్సే రేవంత్‌రెడ్డి అంటూ పువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు. వ్యవసాయం ఏనాడైనా చేశావా? అంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 3 గంటల కరెంట్ ఇస్తామని పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రచారానికి వస్తే కాంగ్రెస్ నేతల్ని రైతులు ఉరికించి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.

నిజామాబాద్ జిల్లాను తొలకరి పలకరించింది.రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిస్తున్నాయి.గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నైరుతి సీజన్‌లో దాదాపు 90 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 17 సెంటీమీటర్లు కురిసిన పరిస్థితి నెలకొంది. అటు శ్రీరాం సాగర్, నిజాం సాగర్‌లలో జలకళ తప్పింది.గోదావరి, మంజీర నదుల్లో నీటి ప్రవాహం తగ్గింది.

రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. తెలంగాణ రైతుల ఆర్ధిక పురోభివృద్ధి నచ్చని రేవంత్‌కి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి ఆదుకుంటుంటే... కాంగ్రెస్ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. రైతులను మళ్లీ చీకట్లో నెట్టేసే కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారన్నారు. ఇప్పటికే ధరణి వద్దంటున్నారని, రేపు రైతుబంధు, రైతు బీమా కూడా వద్దంటారని ధ్వజమెత్తారు.

శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుంది. ఐసీడీఎస్‌లకు బడ్జెట్ పెంచాలంటూ 36గంటల నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. హామీలు అమలు చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

24 గంటల కరెంట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలతో.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పొలిటికల్ అటాక్‌కు దిగుతోంది. అటు.. గులాబీనేతలకు కాంగ్రెస్ సైతం ధీటుగా కౌంటర్ ఇస్తోంది. రేవంత్ వ్యాఖ్యల్ని వక్రీకరించి చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. 24 గంటల కరెంట్ ప్రచారం... కేవలం బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనం కోసమేనంటూ ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్ వద్ద.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ... అంగన్వాడీలు36 గంటల మహా ధర్నా చేపట్టారు. ఇవాళ రెండో రోజు.. మహా ధర్నా కొనసాగుతోంది. ఇవాళ కలెక్టరేట్‌ను ముట్టడించారు అంగన్వాడీలు. పెద్ద సంఖ్యలో వచ్చిన అంగన్‌వాడీలు... కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.... అంగన్వాడీలను.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఉచిత విద్యుత్ పై బీఆర్‌ఎస్ మంత్రులకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వదని బీఆర్‌ఎస్ పేక్ ప్రచారం చేస్తోందని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. 24 గంటల కరెంట్ వెనుక ఉన్న అవినీతి గురించే కాంగ్రెస్ మాట్లాడిందిని దాన్ని వక్రీకరించి చూపుతున్నారని అన్నారు. అసలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు కేటీఆర్ పిలుపునివ్వడం..చూస్తే వారు ఖచ్చితంగా ఓడిపోతున్నారని తెలుస్తోందని అన్నారు.

యువగళం పాదయాత్రలో... లోకేష్ 2000 కిలోమీటర్ల మైలురాయి దాటడంతో.. గుంటూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చంద్రమౌళి నగర్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం నుంచి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తెలుగు దేశం పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్ కోవెలమూడి రవీందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర జనప్రభంజనంతో.. ముందుకు సాగుతోందన్నారు కోవెలమూడి రవీందర్. నవరరత్నాల పేరుతో.. నవ మోసాలు చేస్తున్న సైకో సీఎం జగన్‌కు జనం బుద్ది చెబుతారన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇందులో నలుగురు తెలుగు విద్యార్థులున్నారు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా ఓ అమ్మాయి ఉంది. అయితే ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు గురించి తెలియకపోవడంతో మంత్రి కేటీఆర్‌ను ఫోన్ ద్వారా సంప్రందించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కులూ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయం అందించాల్సిందిగా కోరారు.

కాసేపట్లో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండాలో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం స్థూల గేమింగ్ ఆదాయంపై 28 శాతం చొప్పున పన్ను విధించాలా అనే విషయాన్ని కౌన్సిల్‌కు వదిలివేసింది. దీని ప్రకారం, సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం మందులు, ఆహారంపై పన్ను రేటును 12 శాతానికి తగ్గించడం వంటి ప్రతిపాదనలపై చర్చ జరగనుంది.

ఇవాళ విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ ఇవాళ విచారణకు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో జగన్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని నిందితుడి తరుపు లాయర్ సలీం వాదనలు వినిపించారు.

తిరుమల శ్రీవారికి కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని టీటీడీ శాస్రోత్తకంగా నిర్వహించింది.ఇక 17న ఆణివార ఆస్థానం కార్యక్రమం నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు అర్చకులు. సుప్రభాత సేవ అనంతరం దర్శనాలు నిలిపివేసి ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక మధ్యాహ్నం 12గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.ఏపీ ప్రభుత్వం, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్యలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేయనుంది. రాజధానిపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుంది. గతంలో ఈ పిటిషన్లను జస్టిస్ జోసెఫ్ విచారించారు. ఆయన పదవీ విరమణ చేయడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అమరావతి కేసులను విచారించనుంది.

బయట స్వేచ్చగా తిరగాల్సిన కోడి లాకప్‌లో బందీ అయ్యింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పీఎస్‌లో చోటు చేసుకుంది. బురెడ్డిపల్లి శివారుల్లో నాటు కోళ్ల చోరీ వ్యవహారంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో నిందితుడు కొట్టేసిన కోడిని సైతం జైలుకు తరలించారు. ఇక అందులోనే దర్జాగా గడుపుతున్న కోడి కూతలతో స్టేషన్‌ను హోరెత్తిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతని వద్ద ఉన్న కోడిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

అల్లూరి మన్యం జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి.కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖ - కిరండూల్ కేకే లైన్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. కరక వలస, బొర్రా గుహలకు మధ్య రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు పడ్డాయి. దీంతో విద్యుత్ లైన్లు తెగిపోయి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లను రైల్వే స్టేషన్ యార్డ్‌లోనే నిలిచిపోయాయి. కిరండూల్ నుంచి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధికారులు నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు విద్యుత్ లైన్లు, రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సాగర్ కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఘటనలో 8 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు డిపోకు చెందిన ఇంద్ర బస్సును పెళ్లి బృంది అద్దెకు తీసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజు పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. తెలంగాణాలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 12న మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

సేవా కార్యక్రమాలలో ముందున్న ఏలూరు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏలూరు అశోక్ నగర్ శ్మశాన వాటికలో తమ సంస్థ నిర్మాణాలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని వివరించారు. 19 ఏళ్లుగా అంతిమ సంస్కారాల సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అంతిమ సంస్కారాలకు అవసరమయిన సామాగ్రిని పెట్టేందుకు స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ.. సమస్య పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

దేశ రాజకీయాల్లో మోదీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత రాహుల్‌గాంధీయేనని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. పార్లమెంట్‌లో రాహుల్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, RSS కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

తానా సభలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక పరిస్థితి సరిగా లేనివాళ్లే జాత్యాహంకారపు, కులహంకారపు ఆలోచనలు చేస్తారని అలాంటి ఆలోచనలనే వ్యాప్తిలోకి తెస్తారని అన్నరు. ఇలాంటి మానసిక పరిస్థితి ఉన్నవాళ్లే విచ్ఛన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను తన కుటుంబం తప్ప ఇలాంటి వారికి ఇంకేవి పట్టవన్నారు. ఇలాంటి వారి ప్రచారాన్ని నమ్మి వినాశానానికి ఊతమిస్తామంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవన్నారు ఎన్వీ రమణ.

గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోడు భూములకు పట్టం కట్టి గిరిజనుల్ని రైతులను చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జహీరాబాద్‌లో గిరిజనులకు మంత్రి హరీశ్‌రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజనులు 10 రకాల ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా ఉందన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ పనితనం పక్క రాష్ట్రాలలో ఉన్న రజినీకాంత్ లాంటి వారికి అర్ధం అవుతుందని కానీ.. కాంగ్రెస్, బీజేపీలో ఉన్న గజినీలకు అర్ధం కావడం లేదని విమర్శించారు.

కాకినాడ జిల్లాలో మైనింగ్ మాఫియాతో వైసీపీ ప్రభుత్వం రెచ్చిపపోతుందని, ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. గొల్లప్రోలు మండలం కొడవలిలో తురకల కొండను మైనింగ్ తవ్వకాలకు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తురకల కొండపై రెండు వందల కుటుంబాలు, జీడి మామిడి తోటలు ఇతర పంటలు పండించుకుంటూ జీవిస్తున్నాయన్నారు. కొండను తవ్వితే వారి బ్రతుకులు బజారున పడతాయని ఆవేదన వ్యక్తం చేసారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రోద్భలంతోనే, అడ్డగోలుగా అనుమతులు తెచ్చుకుని మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే వర్మ.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న విపక్ష నాయకులను వైసీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మండిపడ్డారు. విపక్ష నేతలను వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి విష సంస్కృతి మొదలైందన్నారు. పవన్‌కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించాలనుకుంటే విమర్శించండి కానీ.. వారి ఇంట్లోని మహిళలపై సోషల్‌మీడియా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శేజల్ మరోసారి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కేంద్ర మహిళా కమిషన్‌కు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశానని తెలిపారు. కమిషన్ ఆదేశాలతో లోకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేపై పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. ఏదో కారణం చెప్పి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని శేజల్ మండిపడ్డారు.

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు లక్ష ఓట్లు మెజారిటీ రావాలని, మహిళలు కాణిపాకంలో ప్రత్యేక పూజలు చేశారు. అటు మహాశక్తి పథకం విజయవంతం కావాలని కోరుతూ పార్ధించారు. కుప్పం నుంచి కాణిపాకం ఆలయానికి చేరుకున్న మహిళలు, వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


