చిట్టి న్యూస్

చంద్రబాబు మహిళా పక్షపాతి: కేశినేని చిన్ని

విజయవాడలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాడు అన్న ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పిస్తే.. ఇవాళ చంద్రబాబు మహిళలకు మహా శక్తి కార్యక్రమం కింద అద్భుతమైన కార్యక్రమాలను ప్రకటించారని అన్నారు. దీపం పథకం కింద మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత అమ్మకు వందనం కింద ఏడాదికి 15వేలు.. ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించారని చిన్ని అన్నారు.. చంద్రబాబు మహిళా పక్షపాతి అని అన్నారు.

ఢిల్లీలో దారుణం

16ఏళ్ల ఓ బాలికను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, సోమవారానికల్లా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని  సాక్షి(16)గా గుర్తించారు. దాదాపు ఇరవై సార్లు నిందితుడు సాక్షిని కత్తితో పొడిచినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. 

కడచూపుకు రాని కుమారులు... బాధతో ఇంట్లోనే తండ్రి శవాన్ని...

కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి దహన సంస్కారాలకు కుమారులు రాలేదని మనస్తాపం చెందిన తల్లి, ఇంటి ఆవరణలోనే భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు కుమారులకు తండ్రి మరణం వార్త తెలియజేసినప్పటికీ, వారు రాలేమని చెప్పడంతో ఆమె ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ సమీపంలోని షూటింగ్ స్పాట్ లో అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. థర్మాకోల్‌కు అగ్ని కీలలు అగ్నికీలలు అంటుకున్నాయి. అయితే అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో వీరమల్లు చిత్ర యూనిట్‌కు ముప్పు తప్పింది. 

తిరుమల ఘాట్‌ రోడ్డులో కారు ప్రమాదం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ ఆర్చ్‌ను కారు ఢీకొట్టింది. తిరుమల వెళ్లే ఎగువ ఘాట్‌ రోడ్డులోని 12వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు.. గాయపడినవారిని హుటాహుటినా స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. 

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.fire accident at goblej kheda district gujarat గ్రామంలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తుంది.

తిరుమల ఘాట్ రోడ్డులో మరో రోడ్డు ప్రమాదం

తిరుమలదిగువ ఘాట్ రోడ్డులోని 6వ మలుపు వద్ద టెంపో వాహనం బోల్తా.

టెంపోలో ప్రయాణిస్తున్న భక్తులందరికి గాయాలు,

ఇద్దరి పరిస్థితి విషమంచడంతో అంబులెన్స్ లో వాళ్ళను రూయా ఆసుపత్రికి తరలించారు.

చిత్రపురి కాలనీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదగా చిత్రపురి కాలనీలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆదర్శనీయుడని, రాజకీయ నాయకుడుగా, సినీ నటుడుగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మహనీయులని తలసాని కొనియాడరు.

140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం

నూతన పార్లమెంట్ కేవలం భవనం కాదని.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబమని అన్నారు ప్రధాని మోదీ. ఇది పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్పం సందేశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందన్నారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందని.. దేశ అభివృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణ అవుతుందని చెప్పారు. సేవా, కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక అన్న ప్రధాని మోదీ.. రాజదండంకు పూర్వ ప్రతిష్ట, గౌరవం తీసుకురావాలన్నారు. 

అబుదాబీ వేదికగా ఐఫా 2023 అవార్డులు

అబుదాబీ వేదికగా శనివారం రాత్రి జరిగిన  ఐఫా 2023 అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో సినీతారలు తలుక్కున మెరిసారు. అవార్డులు అందుకున్న విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. గంగూబాయి కతియావాడి చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటి ట్రోఫీని అందుకోగా, విక్రమ్ వేద చిత్రానికి హృతిక్ రోషన్‌కు తగిన క్రెడిట్ లభించింది. ఉత్తమ నటిగా అలియా భట్, ఉత్తమ నటుడుగా హృతిక్ రోషన్ అవార్డులను గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడి ట్రోఫీని ఆర్ మాధవన్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ మరియు విక్కీ కౌశల్  హోస్ట్‌లుగా చేశారు.

పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చారు

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతోంది. లాలూ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చింది. కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఆర్‌జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ, “మా ట్వీట్‌లోని శవపేటిక ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడాన్ని సూచిస్తుంది. దీన్ని దేశం అంగీకరించదు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం మరియు చర్చలు జరపడానికి ఇది వేదిక అని అన్నారు.

బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు BJP చూస్తోంది: దీదీ

మణిపూర్‌ తరహాలోనే బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు BJP ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి బీర్బహా వాహనంపై దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. 

IPL 2023: చెన్నైvsగుజరాత్‌ నేడే ఫైనల్‌

క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2023 సమరం తుదిదశకు చేరుకుంది. ఇవాళ గుజరాత్‌ టైటాన్స్, చెన్నై కింగ్స్‌ జట్టు మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ జరగనుంది. 

డివైడర్‌ను ఢీ కొట్టిన శర్వానంద్ కారు

హీరో శర్వానంద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు.

ఉరవకొండలో దొంగల హల్‌చల్‌

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని ఇందిరానగర్‌ 9వ వీధిలో రెండు ఇళ్లలో చోరీ జరిగిది. 

అభివృద్ధే లక్ష్యంగా తొలి మ్యానిఫెస్టో

తెలుగుదేశం పార్టీ మహానాడుతో రాజమండ్రి పసుపుమయమైంది. వేమగిరి జనసునామీని తలపిస్తోంది. ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. కాసేపట్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. 120 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభావేదిక నుంచే టీడీపీ తొలి మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించబోతున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తొలి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు..

కాంగ్రెస్‌, బీజేపీలపై హరీష్ విమర్శలు

కాంగ్రెస్‌, బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకంటే ప్రమాద కరంగా తయారయ్యాయని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి సభలకు కిరాయి మనుషులను తరలిస్తున్నారని అన్నారు. విపక్షాలకు 40 చోట్ల అభ్యర్థులు కూడా లేరన్నారు. బీజేపీ నేతలకు డిపాజిట్ల రావన్న భయం పట్టుకుందన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మెళనంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

రుతు పవనాల రాక.. అప్పుడేనట!

దేశంలోకి జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. ఐఎండీ వెల్లడించింది. మొదటివారంలో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు, రెండవ వారంలో తెలుగు రాష్ట్రాలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. వాయువ్య భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

అంతర్జాతీయ యోగా దినోత్సవం

దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోంది. హైదరాబాద్‌లో వరుసగా రెండో సారి కేంద్రం భారీ ఎత్తున యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్షణ్, నటులు విశ్వక్‌ సేన, శ్రీలీలలు పాల్గొన్నారు. 

కేసీఆర్ తో భేటీ అవ్వనున్న కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నేడు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డిన్సెను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని ఆయన విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. 

సర్వం సిద్ధం... అవసరమైతే వైద్య సేవలు కూడా

మహానాడులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలుగుదేశం వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రక్తదానం కార్యక్రమంతో పాటు, వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. 

మెహబూబ్ నగర్ లో ఉద్రిక్తత

మహబూబాబాద్ ఆర్తీ గార్డెన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. దాంతో బాధిత మహిళలు అధికారులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు 15 మంది గుడిసెవాసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గుడిసెవాసులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏలూరులో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు

ఏలూరు జిల్లాలో కొందరు అక్రమార్కులు చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు పథరం రచించారు. కైకలూరు, కాంటూరులో తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండపల్లి మండలం, మణుగులూరులో చెరువుల తవ్వేందుకు భారీగా జేసీబీ, ప్రొక్లైయినర్లను తరలించారు. ఫారెస్ట్ అధికారులను బెదిరించి మరీ కాంటూరు పరిధిలో చెరువులు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడుస్తోందని వినిపిస్తోంది. 

మహానాడుకు నల్లపాటి రాము విరాళం

జగన్‌ ప్రభుత్వంలో యువత, మహిళలు,రైతులు దగా పడ్డారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము. మహానాడుతో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించబోతుందని అన్నారు. రేపు జరిగే ప్రతినిధుల సభకు 20వేల మంది హాజరు అవుతారని, ఎల్లుండి జరిగే బహిరంగ సభకు 15 లక్షల మంది హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ పాలనపై విసిగిపోయారని అన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీకి రూ. 5 లక్షలు విరాళం అందించారు నల్లపాటి రాము.

కాంగ్రెస్ పై మండిపడిన నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ నేతలపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జడ్చర్ల బహిరంగ సభలో హస్తం నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాటు పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, కరెంట్, ఫించన్, ప్రాజెక్టులు.. ఇలా అన్నీ కాంగ్రెస్ పాలనలో పెండింగ్ పెట్టిందన్నారు. పెండింగ్‌కు పర్యాయపదంగా మారిన కాంగ్రెస్‌కు పాలమూరు స్థానం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు.

నకిలీ విత్తనాల పట్టవేత్త

సైబరాబాద్ SOT పోలీసులు భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 85 లక్షల విలువైన 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలతో పాటూ, ఏడుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం BG-3 HT విత్తనాలను బ్యాన్‌ చేసిందని నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్ పై అన్ని వివరాలు తప్పక చూడాలి అని సీపీ తెలిపారు.

అపచారం... ఈవో అయ్యుండి ఇదేం పని!

నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు కొలనులో ఈతకొట్టడం వివాదానికి దారి తీసింది. అర్చకులు వారిస్తున్నా బేఖాతరు చేసిన వేణు స్వామివారికి అభిషేకం జరుగుతుండగానే ఈతకొట్టారు. ఈవో తీరుపై భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. నాలుగు ఆలయాలకు ఇన్‌ఛార్జ్‌ ఈఓగా పనిచేస్తున్న వేణు ఆలయ పవిత్రతను దెబ్బతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే స్వామి భక్తి...

నాయుడు పేట మున్సిపాలిటిలో ప్రభుత్వ ఆసుపత్రి తలుపుల పై జగన్‌ బొమ్మ వేయించి స్వామి భక్తిని చాటుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య. మళ్లీ వైసీపీదే అధికారం అంటూ స్టిక్కర్ల స్థానంలో పర్మినెంట్‌ పెయింటింగ్‌ లు వేయించారు. స్థానిక అగ్రహారంలో 85 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్యకేంద్రానికి సీఎం జగన్‌, ఎమ్మెల్యే సంజీవయ్య ఫోటోలను పెయింట్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పెయింటింగ్‌లు ఏంటని జనం మండిపడుతున్నారు.

బస్సుల కోసం గగ్గోలు...

విజయవాడలో ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బస్సులను అమరావతి సెంటు పట్టా పేరుతో తరలించగా, ప్రయాణికులు మండుటెండలో అష్టకష్టాలు పడుతున్నారు. బస్సుల కోసం పడిగాపులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు వారి ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులు ఎప్పుడొస్తాయని అడిగితే.. ఎప్పుడొస్తే అప్పుడు బస్సు ఎక్కడమే అంటూ ఆర్టీసీ అధికారులు వింత సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

అవినాశ్ రెడ్డి అనుచరులు రికార్డు స్థాయిలో తాగేశారట

కర్నూలులో రికార్డ్‌ స్థాయిలో మద్యంలో అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లో అవినాష్‌ రెడ్డి అనుచరులు తెగ తాగేస్తున్నారని వైన్‌ షాపు యజమానులు అంటున్నారు. ఈ మేరకు కేవలం మూడు రోజుల్లో 23 వైన్‌ షాపుల్లో రూ.  3.14 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. విశ్వభారతి హాస్పటల్‌ దగ్గరల్లోని వైన్‌ షాపులో మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. తమ కార్లనే మొబైల్‌ బార్లుగా మార్చుకుని మరీ తాగేశారని తెలుస్తోంది. 

సీఎం పట్టాల పంపిణీ కార్యక్రమ బహిష్కరణ

జగన్‌ సర్కార్‌కు మంగళగిరి ఎస్టీ కాలనీ వాసులు షాక్ ఇచ్చారు. రాజధానిలో ఇవాళ్టి ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ సభకు వెళ్లకూడదని తీర్మానించారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. రాజధాని ఆర్‌-5 జోన్‌లో సెంటు స్థలం కేటాయించిన నల్ల రేగడి భూమిలో... ఇళ్లు కట్టుకునేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత హంగామా అవసరమా!

కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కడిని అరెస్టు చేయడానికి ఇంత హంగామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. హత్య కేసులోని నిందితుడ్ని అరెస్టు చేయడానికి దేశాన్ని కాపాడే సైన్యం అవసరమా అని నిలదీశారు. వివేకా కేసులో విచారణకు అవినాష్‌రెడ్డి వెళ్లకుండా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. 

మహానాడుకు ముస్తాబైన రాజమహేంద్రవరం

తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడుకు రాజమహేంద్రవరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రెండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమం నేపథ్యంలో జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో రహదారులు పసుపుమయంగా మారాయి. రేపు ప్రతినిధుల సభ జరగనుండగా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ఈ మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 24 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. 

కావలిలో మునిసిపల్ అధికారుల అత్యుత్సాహం

నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నగరంలో టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీ ప్లెక్సీలు తప్ప కావలిలో ఎవరి ప్లెక్సీలు ఉండొద్దంటూ అధికారులకు వైసీపీ పెద్దలు హుకుం జారీ చేశారు. ఈమేరకు టీడీపీ అభిమానులు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కర్నూలుకు చేరుకున్న సీబీఐ విచారణ బృందం

ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వేకెషన్ బెంచ్ లో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. వారం రోజులుగా... అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. 

ఆస్ట్రేలియాలో  భారీ అగ్ని ప్రమాదం

ఆస్ట్రేలియా సిడ్నీలోని ఏడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సర్రీ హిల్స్‌లోని రాండిల్ స్ట్రీట్‌లో ఉన్న ఏడంతస్తుల భవనంలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. గంటల వ్యవధిలో మంటలు నివాస భవనాలకు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వంద మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక దళం, 20 అగ్నిమాపక వాహనాలు నిర్వీరామంగా పనిచేస్తున్నాయి.