- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి శోభ నెలకొంది.గురుపౌర్ణమి పురస్కరించుకుని సాయి బాబా ఆలయాల్లో భక్తుల సందడి కన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని సాయి బాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి 8లీటర్ల ఆవుపాలతో సాయి బాబాకి అభిషేకం నిర్వహించారు. ఇక 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయి బాబా దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ఆటో బోల్తా పడింది. పలాస మండలం కిష్టుపురం గ్రామ సమీపంలో స్కూలు పిల్లలతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనం నుంచి పిల్లల్ని బయటికి తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటున్నారు. టాటామ్యాజిట్ ఆటో బోల్తా పడ్డ విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి పరగులు తీసారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులున్నారు.

పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే గేట్ మ్యాన్ నిర్వాకంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు వచ్చే సమయం కావడంతో గేటు వేసి రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాడు.రైలు వెళ్లిన ఎంతకు గేట్ ఓపెన్ చేయకపోవడంతో వాహనాలు గేటు వద్దే నిలిచిపోయాయి.చివరికి వాహనదారులు వెళ్లి పిలిచిన తర్వాత నిద్ర లేచిన గేట్ మ్యాన్ గేటు ఓపెన్ చేశాడు. ఘటనపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గురుపౌర్ణమి పురస్కరించుకుని షిరిడీ సాయి బాబా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇక మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజా, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే షిరిడీ సాయిని దర్శించుకుంటున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పాలాభిషేకాలు నిర్వహస్తు భక్తి పరావశ్యంలో మునిగిపోతున్నారు. ఇక గ్రామ వీధుల్లో బాబా గీతాలాపాన చేస్తూ డప్పు వాయిదాల మధ్య బాబావారి పల్లకి సేవ నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి పౌర స్మృతికి BSP సుప్రీం మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని, దీన్ని అమలు చేయడం వల్ల భారత్‌కు బలం చేకూరుతుందన్నారు. ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తుందన్నారు.అయితే బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు. యూసీసీ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల సమస్యలు వస్తాయన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ధరలు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యవసతులపై దృష్టి సారించాలన్నారు.

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథ యాత్ర ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ అయ్యింది. అంతకుముందు టీడీపీ హయాంలో నిర్మించిన మోడల్ డిగ్రీ కాలేజ్, నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు కళ్యాణ మండపాన్ని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథ యాత్ర ద్వారా వైసీపీ వైఫ్యల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. సీఎం జగన్ అరాచకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా బట్టబయలు చేసింది టీవీ5.గుట్టుగా ఇంటి పేరు మార్చి.. ఏమార్చి కిడ్నీ దోచేసిన వైనాన్ని టీవీ5 బయట పెట్టడంతో స్పందించిన అధికారులు ప్రధాన నిందితుడు ఉదయ్‌కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కృష్ణాజిల్లా నిడమర్రుకు చెందిన ఉదయ్‌కిరణ్ సామాన్య,మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా చేసుకొని.. ఓ దళిత మహిళ కిడ్నీని దోచేసింది ఈ ముఠా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మాయ మాటలు చెప్పి వారి కిడ్నిలను అమ్మేసుకుంటున్నారు.ఈ కేసులో బ్రోకర్ ప్రసాద్ కోసం గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు పెద్దగా తేడా లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే సామార్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యాగన్ల తయారీతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జూలై 8న మోడీ రైల్వే వ్యాగన్ల పరిశ్రమకు, నేషనల్ హైవేలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మోడీ రాగానే వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ఎదగాలన్నదే మోడీ ఆకాంక్ష అని అన్నారు కేంద్ర సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి.

గోల్కొండలో బోనాల సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో ఆదివారం అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాలుగో బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొట్టెలలను ఊరేగింపుగా తెస్తున్నారు. లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెల 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ గ్రామంలో చిరుత పులుల సంచారం కలకలం రేగింది. మేకల మందపై రెండు చిరుత పులులు దాడి చేశాయి. అయితే గ్రామ శివారులోని కొండల్లో చిరుతలు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఏక్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయోనని కోటెకల్ గ్రామ ప్రజలు భయందోళన చెందుతు న్నారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు పోతే కానీ చిరుతలను పట్టుకోరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానికులకు రేషన్ కార్డు కష్టాలు తప్పడం లేదు.రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు ఎక్కించేందుకుఅధికారులు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా కనికరించడం లేదని ఓ వైసీపీ కార్యకర్త అధికారులను నిలదీశాడు.మూడేళ్లగా పట్టించుకోవడం లేదంటూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తనని,గ్రామంలో మొదటి వైసీపీ జెండా వ్యక్తిని కూడా తానే నన్నాడు..తన పిల్లలకు కూడా జగన్, షర్మిల పేర్లు పెట్టానని అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకం అందలేదని.. చివరకు తాను స్వంతంగా కట్టుకున్న ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేయలేదని అన్నాడు.

రణబీర్ కపూర్ అభిమానులకు మరోసారి నిరాశ చెందారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న రణబీర్ కపూర్ మూవీ యానిమల్ డిసెంబర్ 11న విడుదల కానుంది. వాస్తవానికి ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కావాలి. అయితే… ఆగస్టులో సన్నీ డియోల్ తీస్తున్న గదర్ సీక్వెల్‌తో పాటు అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ సీక్వెల్ మూవీలు విడుదల అవుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. యానిమల్ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని... దీంతో సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మధ్య ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ తరఫున ప్రధాని మోడీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. షాదోల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో అయుష్మాన్ గ్యారంటీ కార్డు తాము ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్డు నమూనాను ప్రజలకు వివరించారు. మధ్యప్రదేశ్‌లో కోటి మందికి ఈ కార్డును ఇస్తామని అన్నారు. ఈ కార్డు ద్వారా ప్రజలకు 5 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు అందిస్తామని ఆయన అన్నారు. పేదలకు మెడికల్ చెకప్‌ల కోసం ఈ కార్డును ప్రత్యేకంగా తెచ్చినట్లు ప్రధాని వివరించారు.

కమ్యూనిస్టు పార్టీ నేతలపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదరపల్లిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతుండగా కమ్యూనిస్టు పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కమ్యూనిస్టుల తీరును తప్పుపట్టిన రఘునందన్‌రావు.. సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరించారు.

దళితులపై బెదిరింపులు పాల్పడుతున్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి చందు. బి. ఆలేరుకు చెందిన దళిత నేతకు వార్నింగ్ ఇచ్చాడు. తమకు పట్టాలు ఇవ్వాలని దళితులు అడగడంతో.. ఆ దళిత నేతకు వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ హయంలో దళితులకు ఇచ్చిన పట్టాలు....రద్దు చేసి వాటిని వైసీపీ వర్గీయులకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. నిన్న పట్టాల పంపిణి కోసం సభ ఏర్పాటు చేశారు. తమకు కూడా పట్టాలు ఇవ్వాలాంటూ ఆందోళనకు దిగారు దళితులు. దీంతో.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పట్టాల పంపిణి ఆపేసి వెళ్లిపోయారు.

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 31 వరకు మొత్తం 62 రోజులపాటు జరుగనునున్న ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర కు అన్ని ఏర్పాట్లు చేసింది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం. భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. డ్రోన్లతో నిఘా ఉంచారు. ఉగ్రదాడులు జరగొచ్చనే నిఘా విభాగం హెచ్చరికలతో ఎక్కడికక్కడ సైనికులను భారీగా మొహరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు

ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు బయటపడటం కలకలం రేపుతోంది. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 19వేల దొంగ ఓట్లను గుర్తించారు టీడీపీ నేతలు. డోర్ నెంబర్‌లోని ఇండ్లకు 10కి పైగా బోగస్ ఓట్లు నమోదు చేశారని టీడీపీ నేత పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై తిరుపతి ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కొందరు ప్రభుత్వ అధికారులే వైసీపీ నేతలకు సహకరిస్తున్నారంటూ విమర్శించారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని పులివర్తి నాని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్, భూ నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సచివాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేయగా... భూ నిర్వాసితులు తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని తహసీల్దార్‌ని కోరారు. ఇక తహసీల్దార్ భూ సేకరణ జరగడం లేదనడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో జగన్ హామీ ఇచ్చారంటూ భూ నిర్వాసితులు తహసీల్దార్‌కు గుర్తు చేశారు. గతేడాది కలెక్టర్ కూడా హామీ ఇచ్చారని చెబుతున్న భూ నిర్వాసితులు.. ఇప్పుడు తహసీల్దార్ సంబంధం లేదడనడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో సినీనటి మృణాళ్ ఠాకూర్ సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్‌ను ఆమె ప్రారంభించారు. వస్త్ర రంగంలో అతివలను ఆకట్టుకునే అన్నిరకాల వస్త్రాలను అందించే ఏకైక వస్త్రాలయం.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఆమె కొనియాడారు. పట్టు, కంచి, ధర్మవరం చీరలతో పాటు వెస్ట్రర్న్ దుస్తులు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్నిరకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే వస్త్ర రంగంలో దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన ఒరవడులు సృష్టిస్తుందన్నారు.

పెన్షన్ రావడం లేదంటూ సబ్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్నాడు వృద్ధుడు. కళ్లు చెమర్చే ఈ ఘటన మడశిర మండలం మణూరు గ్రామంలో జరిగింది. ఓటర్ కార్డులోను, ఆధార్ కార్డులోనూ పుట్టిన తేదీలు తేడాగా ఉన్నాయంటూ, అధికారులు పెన్షన్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయాడు గంగన్న. సత్యసాయి జిల్లాలో సురక్షా కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో, పెనుగొండ సబ్ కలెక్టర్ కాళ్లపై పడ్డాడు వృద్ధుడు గంగన్న.

సత్యసాయి జిల్లా కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద భారీ నగదు పట్టుబడింది. సుమారు కోటి 75లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ ముగ్గురు అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన వారిగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న ధనుంజయ రెడ్డి, ముత్యాలప్ప, ప్రదీప్‌లను చిలమత్తూరు పోలీసులు విచారిస్తున్నారు. నగదును రెవెన్యూ అధికారుల సమక్షంలో ఐటీ శాఖ అధికారులకు డీఎస్పీ అప్పగించారు. ఇక తనిఖీల్లో పట్టుబడ్డ నగదుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రూప్‌లు తీసుకురాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శాకాంబరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.

ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా మరిన్ని అడుగులు పడ్డాయి. జులై 3న న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని..న్యాయమంత్రిత్వ శాఖ, లా కమిషన్ అధికారులకు పిలుపు వెళ్లింది.దేశంలోని పౌరులకు ఒకే చట్టం ఉండాలని..మత ప్రాతిపదికన చట్టాలు ఉండరాదని ప్రధాని మోదీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టంపై ఇప్పటికే లా కమిషన్ ప్రజాభిసేకరణను ప్రారంభించింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి చట్టం బీజేపీ అజెండాలో ప్రధానాంశంగా ఉంది.

రాష్ట్రపతి పాలన దిశగా మణిపూర్ పరిణామాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవికి బీరేన్‌సింగ్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.కాసేపట్లో గవర్నర్‌ను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అల్లర్ల నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. మరోవైపు అక్కడి సహాయ, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించిన రాహుల్..మరి కాసేపట్లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

అనకాపల్లిలో భారీ ఆగ్నిప్రమాదం జరిగింది.అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న సాహితీ ల్యాబ్‌లో రెండు రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భారీ శబ్దంతో పేలడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని అసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏపీలొ విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు జరుగుతున్నాయి. విజయవాడలో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగిన ధర్నా నిర్వహించాయి. సీఎం జగన్ సామాన్యుల పొట్ట కొట్టి కార్పొరేట్‌ల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు సీపీఎం నేత బాబురావు. ట్రూఅప్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ కనుసన్నల్లో జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా పసుపు ధర 10 వేల మార్క్‌కు చేరుకుంది. గడిచిన 15 రోజుల్లోనే క్వింటా పసుపు ధర రెండున్నర వేలు పెరిగింది. దీంతో ముందే పంటను అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు పంటకు ఒక్కసారిగా ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నడి రోడ్డుపై ఓ వ్యక్తిపై, గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో దాడి చేసారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై, కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు, గాంధీనగర్‌కు చెందిన మహేష్‌పై దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. తప్పించుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. నడిరోడ్డుపై తన్నుకుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారు స్థానికులు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అబిడ్స్ డాక్ సదన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకతను ప్రస్పుటించేలా పోస్టల్ కార్డును విడుదల చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బావపూర్ కుర్రుపై పోస్ట్‌కార్డును విడుదల చేశారు. పోస్టల్ శాఖ ప్రజల జీవితాలతో భాగస్వామ్యమై సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. ఇదే సంప్రదాయాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలని కిషన్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్ ఫతేనగర్‌లో అమ్మెనియా గ్యాస్ లీక్ అవడంతో 15మంది అస్వస్థతకు గురయ్యారు. పైప్‌లైన్ రోడ్డులోని చెత్తకుప్పంలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్ల ఇత్తడి వాల్వ్‌లు ఓ దొంగ తీసే యత్నం చేశాడు. ఈ క్రమంలోనే సిలిండర్ నుంచి భారీగా అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో దొంగ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. గాల్లో 15మీటర్లకు పైగా అమ్మోనియా గ్యాస్ వ్యాపించడంతో పక్కనే ఉన్న కంపెనీలో పని చేస్తున్న బీహార్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వెళ్తున్న రెండు కంటైనర్లు అదుపుతప్పి ఒకదాన్ని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ కంటైనర్‌లోని గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది.పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

జపాన్‌లోని నాగో నగరంలో నది ఒక్కసారిగా ముదురు ఎరుపు రంగులోకి మారింది. దీంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇక్కడున్న ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీకి చెందిన కూలింగ్ వ్యవస్థల్లో ఏర్పడిన లీకేజీనే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో ఆహారపదార్థాల్లో ఉపయోగించే రంగు పొరపాటున లీక్ అయింది.అది నదిలోకి విడుదల కావడంతో నీరంతా ముదురు ఎరుపురంగులోకి మారిపోయింది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవంటోంది ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యం.అలాగే క్షమాపణలు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

సూర్యాపేట పట్టణంలో పట్టపగలు కత్తిపోట్లు కలకలం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు మరో ముగ్గురు యువకులు. సంతోష్ అనే యువకుడికి తన స్నేహితుడైన బంటితో మద్య వివాదాలలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సంతోష్‌పై బంటి, మరో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంటిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విశేష చరిత్ర కలిగిన విజయ డైరీ వ్యవస్థాపకులకు తీరని అవమానం జరిగింది. చిత్తూరు జిల్లాలో విజయ డైరీ పేరు ఉన్న శిలాఫలకం తొలగించడమే కాకుండా, సంస్థ వ్యవస్థాపకులు ఎన్‌పీ వీరరాఘవులు నాయుడు విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. విగ్రహానికి వస్త్రాన్ని కప్పి ఒక మూలన పడేశారు. కింద ఉన్న దిమ్మెనూ నేలమట్టం చేశారు. సీఎం జగన్ డెయిరీ ఆస్తులను గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు కట్టబెడుతున్నారని అందుకే అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదస్పద ట్వీట్ కలకలం రేపింది. గేదెను తన్నే వీడియోను ట్వీట్ చేసిన జితేందర్ రెడ్డి ఇలాంటి ట్రీట్‌మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ కామెంట్ పెట్టి, అమిత్ షా, బీఎల్ సంతోష్‌కు మాజీ ఎంపీని ఈ ట్వీట్ కు ట్యాగ్ చేశారు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేవారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం మంచిర్యాలగా తెలుస్తోంది. రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న రామయ్య నాలుగున్నరేళ్లుగా మింట్ కాంపౌండ్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది. అయితే వెంటనే చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


