- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్ కోల్‌కతాకు సాయంగా ఐఎన్‌ఎస్ సుభద్ర, భారత వాయుసేన కూడా రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.

తాలిబన్ పాలిత దేశం ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. గురువారం ఉదయం కాందహార్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్వదేశీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో కొందరు స్థానికులు తమ జీతాలను తీసుకునేందుకు సెంట్రల్ కాందహార్ నగరంలోని న్యూ కాబూల్ బ్యాంక్ బ్రాంచ్ వెలుపల వేచి ఉన్నట్లు తెలిపారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

అస్సాంలో డీఎస్సీ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్‌ను కిరణ్ నాథ్‌గా గుర్తించారు. గోలాఘాట్ జిల్లాలోని లాచిత్ బోర్‌పుకాన్ పోలీసు అకాడమీలో పనిచేస్తున్నారు. 15 ఏళ్ల బాధితురాలను ఆ ఆఫీసర్ పదేపదే రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనను ఆ ఆఫీసర్ ఇంట్లో బంధించినట్లు బాధితురాలు చెప్పుకున్నది. కుటుంబసభ్యులతో కలిసి డీఎస్పీ తనను వేధించినట్లు ఆ యువతి పేర్కొన్నది. డేర్‌గావ్ పోలీసు స్టేషన్‌లో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు నమోదు చేశారు. విచారణ ద్వారా ఆధారాలను సేకరించి డీఎస్పీ నాథ్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఐపీసీలోని 376, 506, పోక్సోలోని సెక్షన్ 6 కింద నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పల్నాడు జిల్లా వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు తాయిలాల పంపిణీకి తెరలేపారు. మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చీరలు పంచుతున్నారనే సమాచారం అందుకుని గ్రామానికి చేరుకున్న వీఆర్వోను చూసి..వాలంటీర్లు చీరల మూటలు ఎక్కడివక్కడ వదిలి పరారయ్యారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో వైసీపీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రాల్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య ,గరటయ్య పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం లోకి ఆహ్వానించారు.

లోక్ సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్- బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను కేటాయించినట్టు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు RSప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశముంది. త్వరలోనే... ఈ అంశంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు.... పరస్పర సహకారంతో పయనిస్తాయని ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలో తమ లౌకిక కూటమి విజయం సాధిస్తుందని ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తంచేశారు. అటు...... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించడంపై... మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఇక్కడ పోటీ చేసే బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ విజయానికి... కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు.

ఎన్నికలకు సై అంటున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం,34 మందితో రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు
ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం: చంద్రబాబు

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త దేవీసింగ్ షెకావత్ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు.ప్రతిభాపాటిల్.. 1962లో మహారాష్ట్రలోని జాల్‌గావ్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 వరకు వరుసగా నాలుగుసార్లు ఎద్లాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1985 నుంచి 90 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1991 సాధారణ ఎన్నికల్లో అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందారు.

కుక్కలను ప్రాణప్రదంగా పెంచుకునే వారికి కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. పిట్‌బుల్ టెర్రీర్, అమెరికన్ బుల్‌డాగ్, రాట్‌వీలర్, మాస్టివ్స్, షెపర్డ్ తదితర 23 జాతుల(బ్రీడ్స్)కు చెందిన కుక్కలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది. వాటి దాడి వల్ల మనుషులు చనిపోతుండటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాలు జారీచేసింది. జాబితాలోని 23 జాతుల కుక్కల అమ్మకాలను, వృద్ధి(బ్రీడింగ్)ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సదరు కుక్కలకు సంబంధించి లైసెన్సులు జారీ చేయకూడదని ఆదేశించింది.

వాణిజ్య పరంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోజ్…లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది. టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ నిర్మించిన కైరోస్ రాకెట్‌చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరింది. అయితే, గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే 60 అడుగుల పొడవైన ఆ రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్షర్‌లోని లాంచ్ ప్యాడ్‌లో చోటు చేసుకుంది. ఈ పేలుడుతో లాంచ్ ప్యాడ్ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే ఆ దేశంలో శాటిలైట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా స్పేస్ వన్ అవతరించేది.

రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్-76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది. కాగా, గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్ తమ ఐఎల్-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా?అని ప్రశ్నించారు.

డ్రోన్ చిత్రాలు, గ్రీన్ మ్యాట్‌తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దేశవ్యాప్తంగా 85వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు తీసే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దృశ్యమాధ్యమం ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సాధారణ సేవలు.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు మార్చి 13, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. టిక్కెట్ బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గురువారం మినహా ప్రతీ రోజు ఈ రైలు సేవలు అందించనుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో.. అవసరాల దృష్ట్యా దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. వందేభారత్ రైలుతో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలో 193 వన్ నేషన్- వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 9 గతిశక్తి కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్స్‌ను ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2 జన్ ఔషధీ కేంద్రాలు, డబుల్ లైన్, థర్డ్ లైన్, గేజ్ కన్వర్షన్, బైపాస్ లైన్ 14 సెక్షన్లు, 3 రైల్ కోచ్ రెస్టారెంట్లు ప్రధాని జాతికి అంకితం ఇస్తారు.

హైదరాబాద్ కు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త చేతిలో హత్యకు గురైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ AS రావ్ నగర్ కు చెందిన శ్వేతకు అశోక్ రాజ్ అనే వ్యక్తితో.. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉండే అశోక్ రాజ్ తన భార్యను చంపి మృత దేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పడేసినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు.

అనంతరం భారత్ కు వచ్చిన అశోక్ రాజ్ తన కుమారుడిని హైదరాబాద్ లోని శ్వేత పుట్టింట్లో వదిలేసి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. శ్వేత మృతిపై దర్యాప్తు చేపట్టిన విక్టోరియా పోలీసులు ఆమెను అశోక్ రాజ్ చంపినట్టు గుర్తించిఅతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు విక్టోరియా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ లక్ష్యంగా క్షిపణి దాడి యత్నం జరిగినట్లు సమాచారం. అయితే వారు ఈ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో పడినట్లు సమాచారం. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో జరిగింది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్‌తో కలిసి జెలెన్‌స్కీ నగర సందర్శనకు బయల్దేరారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగ పైకి ఎగసిపడటాన్ని ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. గత రెండేళ్లుగా జెలెన్‌స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పలువురు ప్రపంచ నాయకులతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కానీ బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్‌షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్‌కల్యాణ్ కలిశారు. ఇరుపార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు, బీజేపీతో పొత్తు అంశంపై గంటన్నరపాటు ఇద్దరూ చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన స్పష్టంచేశారు. ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ.... ప్రజలను సంరక్షిస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు. అలా అనుకున్నందుకు తెలంగాణలో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారని.... ఇప్పుడు జగన్ వంతని చెప్పారు. ప్రజలు వనరుల నిర్వహణనే కాకుండా నాయకుడి శక్తి సామర్థ్యాలను కూడా చూస్తారని వివరించారు. ప్రజలు ఓటు వేసే ముందు తప్పకుండా అభివృద్ధిని చూస్తారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఉదారంగా ఉచితాలు ఇస్తేనే ఓట్లు వస్తాయని అనుకోవడం సరికాదన్నారు. జగన్ ను ఓడించడం కష్టమనికొందరు భావిస్తారని... కానీ జగన్ పనైపోయిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజకీయ నేతలతో పనిచేసినందుకు మీరు బాధపడుతున్నారా అన్న ప్రశ్నకు... తాను బాధపడనని,వారి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన..అన్ని అంశాలు పరిశీలించి, అధ్యయనం చేయడం సహా పగుళ్లకు కారణాలు విశ్లేషించి... తగిన సిఫారసులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ..కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ NDSA ఆదేశాలు జారీచేసింది. మరో ఐదుగురిని సభ్యులుగా నియమించింది. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్. పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ కమిటీలోసభ్యులుగా ఉన్నారు. NDSA టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై.. సమగ్ర అధ్యయనం, తనిఖీల కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. NDSA కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి....... ప్రాజెక్ట్ డేటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమోరండా, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, బ్యారేజ్ ఇన్ స్పెక్షన్ రిపోర్ట్స్, మెటీరియల్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలను... పూర్తిగా పరిశీలించాలని సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా ఇతర అంశాలకు.... కారణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. 3 ఆనకట్టల విషయంలోతదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ.. సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ... 4 నెలలలోపు నివేదిక ఇవ్వాలని NDSA గడువు నిర్దేశించింది.

కాళేశ్వరం పరిశీలనకు ఈనెల 6న నిపుణుల కమిటీ రానుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని, ఇందుకు అన్నిరకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు తమ ప్రభుత్వం.......... ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ ఆనకట్టను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి.... నీటిని ఖాళీ చేయాలని చెప్పిందని గుర్తుచేశారు. తర్వాత సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన కమిటీ.. మేడిగడ్డలో ఉన్న సమస్యలే వాటిల్లోనూ ఉన్నాయని..... నీటిని ఖాళీ చేయాలని సూచించిందని చెప్పారు. అథారిటీ సూచన మేరకే ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తోందన్నారు. కానీ... భారాస రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో..... గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన భారాస నేతలు..... ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు..

పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కనీసం రాజధాని కూడా లేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేతగా కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తుందని తిరుపతిలో నిర్వహించిన న్యాయ సాధన సభలో..... షర్మిల హామీ ఇచ్చారు. ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వారికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటమని అన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన శంథన్ కన్నుమూశాడు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శంథన్ అలియాస్ సుతేంద్రరాజా ఆరోగ్యం విషమించడంతో.. తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల సంథాన్ 1991లో రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషీగా తేలి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాలేయ వైఫల్యానికి చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున శంథన్‌కు గుండెపోటు వచ్చిందని సీపీఆర్ చేసి అతడిని బతికించామని రాజీవ్‌గాంధీ ఆస్పత్రి డీన్ తెరనిరాజన్ తెలిపారు. తర్వాత అతడిని వెంటిలేటర్‌పై ఉంచామని.... చికిత్సకు అతడి శరీరం స్పందించలేదని వివరించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో శంథన్ తుది శ్వాస విడిచినట్లు తెరనిరాజన్ వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్‌కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల అయ్యాడు.

గుజరాత్‌లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్‌బందర్‌లో భారత నౌకా దళంయాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATSనార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3 వేల 300 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3 వేల 300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని.. అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్ చేశామని అందులో నలుగురు ఇరానీయులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే పోలీసు, సెక్యూర్టీ బలగాలు తక్షణమే స్పందించిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అదనపు ఎస్పీ అమిత్ కుమార్‌ను ఆ దళాలు కాపాడాయి. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉంది. మంగళవారం రాత్రి ఏడు గంటలకు కిడ్నాప్ ఘటన చోటుచేసుకున్నది. ఇంపాల్ ఈస్ట్‌లో ఉన్న కుమార్ ఇంటిపై మైతీ తెగ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నాలుగు రోజుల క్రితం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. .

విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన నీటిపై తేలే వంతెన తెగిపోయింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్... రెండో రోజే తెగిపోయింది. సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరిభాగంవిడిపోయి...సముద్రంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఆ సమయంలో సందర్శకులు వంతెనపై లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ప్రజలు వెళ్లకుండా...... భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగానే వంతెన తెగిందన్న బ్రిడ్జ్ నిర్వహణ సంస్థ... తెగిన భాగాన్ని తీసుకొచ్చి మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపింది. ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిను ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణలో భాగంగా వంతెనను విడదీసినట్లు నిర్మాణ సంస్థ చెబుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని సందర్శనకు అనుమతిస్తామని తెలిపింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్న చంద్రబాబుకు... విచారణ వాయిదా పడటం బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు.
స్కిల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీంతో, చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

బీహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్‌కలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అయితే ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది. జీపులో ఉన్న ఎనిమిది మందితోపాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి కారులో వస్తున్న ఆరుగురు యువకులు మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అతివేగంగా ముందుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. అనంత కుమార్ బారిక్ అనే ఒడిశాకు చెందిన బాలానగర్ ప్రాంతంలోని ఘరక్ కంటా ప్రాంతంలో తన చిన్న కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్ లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలానగర్ SOT పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా షాపును తనఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్ లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీట్ కింద డిక్కీ లో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలన్నారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నించిన వారు ఆశించిన ఫలితం రాలేదన్నారు. నరసాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషిచేస్తానన్నారు.

సరైన కారణంగా లేకుండా కరెంటు కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం... కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ త ప్రభుత్వ హ యాంలో నియ మితులైన కొంద రు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోత విధిస్తున్నారనే సమచారం.. ఉందని సీఎం తెలిపారు. గ తేడాదితో పోల్చితే గత రెండు నెల ల్లో విద్యుత్ స ర ఫ రా ఎక్కువ గా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ వివరించారు. ఇటీవ ల మూడు సబ్ స్టేషన్ల ప రిధిలో లోడ్ హెచ్చుతగ్గులను గమనించనందున కొంతసేపు విద్యుత్ స ర ఫ రాకు అంత రాయం క లిగింద ని చెప్పారు. మరోవైపు తాగునీటి సరఫరాపై సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 టీఎంసీలు తీసుకుంటోందని, ఏపీలో ఎక్కడ వాడుతున్నారో లెక్కలు తీసుకోవాలన్నారు. తాగునీటి పేరిట ఇతర అవసరాలకు తీసుకెళ్లకుండా చూడాలన్నారు. సమగ్రంగా సమీక్షించి కేఆర్ఎంబీకి లేఖ రాయాలన్నారు. జీహెచ్ ఎంసీలో తాగునీటికి సమస్య రాకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనే నిద్రించారు. ఇవాళ చలో సెక్రటేరియట్ ఉన్న నేపథ్యంలో షర్మిల ఉన్న భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఈ పరిస్థితి రావడం జగన్‌కు అవమానం కాదా అని నిలదీశారు. తామేం తీవ్రవాదులం కాదని... సంఘ విద్రోహ శక్తులె కూడా కాదన్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదన్నారు.

ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది 95 సంవత్సరాల వయసున్న ఫాలీ నారీమన్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్ 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ పని చేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారీమన్ ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు.
న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. నారీమన్ ఓ గొప్ప రచయితగానూ గుర్తంపు పొందారు. 'బిఫోర్ ది మెమొరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీంకోర్టు' వంటి పుస్తకాలు రాశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకు టిక్కెట్ ఇవ్వకున్నా తాను వ్యతిరేకించబోనని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఇన్నాళ్లు... తనను తప్పించేందుకు కేశినేని నాని తెగ ప్రయత్నించినట్టు చెప్పారు. మొదటి కేశినేని నాని తనను లక్ష్యం చేసుకుని పనిచేశారని ఆరోపించారు.

ఏపీలోని 175 స్థానాల్లో... విజయవాడ పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెట్టి.... 174 స్థానాల్లో IVRSసర్వే చేపడుతున్నారన్న బుద్దా వెంకన్న.. ఇది తనకు బాధ కలిగించిందని తెలిపారు. రక్తం తీసి చంద్రబాబు చిత్ర పటానికి బుద్దా వెంకన్న కాళ్లు కడిగారు. సీబీఎన్ జిందాబాద్ అంటూ.. రక్తంతో గోడపై రాశారు. తన అభిమానాన్ని చాటుకునేందుకే ఇదంతా చేస్తున్నట్టు బుద్దావెంకన్న తెలిపారు.


రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 14లోక్ సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు సునీల్ కనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్ సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం... ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా TPCC వడపోత పూర్తి చేసి.. స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీష్ చౌదరి ఛైర్మన్ గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి ముగ్గురు లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లతో కలిసి రెండు గంటలపాటు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై సునీల్ కనుగోలు బృందం ఆరా తీస్తోంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసిన ముఖ్య నేతలతో పాటు పార్టీలో చేరిన, చేరనున్ననాయకుల బలాబలాలపైనా సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేపడుతోంది

నల్గొండలో 3 లక్షలు లంచంతీసుకుంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్... ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో 'బై హ్యాండ్' ఔషధాల టెండర్ కి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు.... గుత్తేదారు తెలిపారు. టెండర్ కావాలంటే ప్రతిదానిలో 10 శాతం కమిషన్ కావాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. గత నవంబర్ నుంచి కమిషన్ మరింత కావాలని డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించినట్లు వివరించారు. సూపరింటెండెంట్ అడిగిన మొత్తాన్ని బాధితుడు అందిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

తిరుపతి ఎస్వీ జంతుప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన సందర్శకుడు సింహం బారిన పడి ప్రాణాలు కొల్పోయాడు. మధ్యాహ్నం రెండున్నర సమయంలో రాజస్ధాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జర్ అనే వ్యక్తి.. అక్కడి సిబ్బంది వారిస్తున్నా లయన్ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈలోపే ఎన్ క్లోజర్ లో ఉన్న మగ సింహం దాడి చేయడంతో..సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు అతని కుటుంబసభ్యులకు...... సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.

సొంత సైన్యమైన వాలంటీర్ల వల్లే 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఏపీలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్ అవి వాలంటీర్ల వల్లే అందరికీ చేరువ అవుతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంపురంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిరంగిపురం ఊరిబయటే బారికేడ్లు పెట్టి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులతో పాటు, బస్సులు, లారీలు నిలిచిపోయాయి. గ్రామానికి బయటి నుంచి వచ్చే స్థానికులనూ అనుమతించకపోవడంతో మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే అంబాసిడర్లనీ లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనని వాలంటీర్లు నిరూపించారని ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


