చిట్టి న్యూస్

విశాఖలో అన్న క్యాంటీన్‌

ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు అన్నా క్యాంటీన్‌ ద్వారా కడుపు నిండా భోజనం పెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తన సొంత నిధుతలతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అయ్యన్న... స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఇక వైసీపీకి పోయేకాలం దగ్గరపడిందన్నారు అయ్యన్నపాత్రుడు. జగన్‌ చర్యలపై ప్రజలు తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్‌లను పునరుద్దరిస్తామన్నారు.

అరకొర వసతులతో తెరుచుకున్న పాఠశాలలు

అరకుర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. నాడు నేడు పేరుతో ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో విఫలమైంది. తిరుపతి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొన్ని పాఠశాలలను మరమ్మతుల పేరుతో, కూల్చివేసినా ఇంతవరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం అధికారులు చేపట్టలేదు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, విద్యార్థులకు శాపంగా మారింది. ఆరు బయట చదువుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పాఠశాలలకు వచ్చిన జగనన్న విద్యా కానుక పంపిణీ కూడా తిరుపతి జిల్లాలో ఆలస్యమవుతుంది.

నిడమర్రులో పేదల ఇళ్లను తొలగించిన అధికారులు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో పేదల ఇళ్లను తొలగించారు అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల తొలగింపుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇళ్ల తొలగింపుపై ప్రశ్నించిన వారి ఫోటోలు తీస్తూ కార్పొరేషన్‌ సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. బాధితులకు అండగా నిలిచారు టీడీపీ నాయకులు.

దశాబ్ది ఉత్సవాల్లో స్టెప్పులేసిన పోలీసులు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, స్టూడెట్స్‌తో కలిసి డాన్సులు వేసారు పోలీసులు. నల్గొండ జిల్లా సూర్యాపేట రూరల్ సిఐ సోమ్‌ నారాయణ సింగ్‌ డాన్సుల కార్యక్రమానికి హైలెట్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్‌లో పాల్గొన్నారు. డీజే టిల్లు అంటూ కుర్రకారుతో స్టెప్పులు వేసి యువతను ఉర్రూతలూగించారు.

విద్యార్ధులకు స్వాగతం పలుకుతున్న సమస్యలు

దాదాపు నెలన్నర రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు తిరిగి పాఠశాల బాట పట్టారు. అయితే స్కూళ్లలో విద్యార్ధులకు మాత్రం అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.విరిగిన కుర్చీలు, పగిలిన అద్దాలు,పగుళ్లుతో కూడాన పై కప్పులు.. తరగతి గదుల కొరత ఇవీ నిజామాబాద్ జిల్లా స్కూళ్ల పరిస్థితి పుస్తకాలు, యూనిఫామ్‌ ల సంగతి చెప్పే అవసరమే లేదు..

భువనగిరిలో ఘనంగా తెలంగాణ దశాబ్ది సంబురాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ దశాబ్ది సంబురాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా భువనగిరి కోటపై ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దశాబ్ది సంబురాల్లో కలెక్టర్ పమేలా, అడిషనల్ కలెక్టర్, డీసీపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. భువనిగిరి కోటపై విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 40 వేలమందికిపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు.

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ దశాబ్ది సంబురాలు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ దశాబ్ది సంబురాలు మిన్నంటాయి. పోలీస్‌శాఖ, GHMC సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీలు, నిజాంపేట్ మేయర్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. సినీ హీరోలు విశ్వక్ సేన్, అశీన్ బాబు, హీరోయిన్ నందిత శ్వేత సందడి చేశారు. మున్సిపల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై ఐడీపీఎల్ చౌరస్తా మీదుగా 2కే రన్ నిర్వహించి తిరిగి మున్సిపల్ గ్రౌండ్ వద్ద ముగించారు. 

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. పోలీసుల 5K రన్‌

 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్‌ను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ అన్నారు సబితా ఇంద్రారెడ్డి. సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు.

Watch Animal Movie Pre-Teaser

"Get ready for an animal extravaganza! Directed and written by Sandeep Reddy Vanga, this upcoming movie boasts a star-studded cast including Ranbir Kapoor. Produced by Bhushan Kumar, Krishan Kumar, Murad Khetani, and Pranay Reddy Vanga, the film promises a captivating experience. With cinematography by Amit Roy, editing by Sandeep Reddy Vanga, and mesmerizing music by Manan Bhardwaj and Harshwardhan Rameshwar, this animal movie is set to be a treat for all movie lovers."

అమిత్‌షా పర్యటనకు వ్యతిరేకంగా..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీక్షా శిబిరం వద్దకు భారీగా ఉద్యోగులు చేరుకుంటున్నారు. ఇవాళ విశాక రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇవాళ్టి సభలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు అమిత్‌ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉత్తరాఖండ్: 35వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

ఉత్తరకాశీలో పర్యటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి. దాదాపు 35వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.110 ప్రభుత్వ పధకాలకు శ్రీకారం చుట్టిన దామి సర్కార్‌ ఆ దిశగా ఆడుగులు వేసింది.మరోవైపు ఒకేసారి ఇంత ఎద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీఎంగా సరికొత్త రికార్డ్ సృష్టించారని బీజేపీ నేతలు

 

అదుపుతప్పి లోయలో పడిన..టాటా మ్యాజిక్‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌లో టాటా మ్యాజిక్‌ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 10మంది ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి భద్రాచలం టెంపుల్‌కి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టీరింగ్‌ లాక్‌ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక బాధితులంతా అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

భక్తులతో కిటకిటలాడున్న యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్టలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు భక్తులు.ఉదయం నుండి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి నిజాభిషేకం, అర్చన, నిత్యకళ్యాణం పూజల్లో భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులు.

 

రెండో పెళ్లి చేసుకున్ననిర్మాత మధు మంతెన

ప్రముఖ నిర్మాత మధు మంతెన రెండో పెళ్లి చేసుకున్నారు. రచయిత, యోగా టీచర్ ఐరా త్రివేది మెడలో మూడు ముళ్లు వేసారు. అంతకుముందు ముంబైలో ప్రీవెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ఖాన్, హృతిక్ రోషన్, రాజ్‌కుమార్ రావు, నిఖిల్ ద్వివేది తదితర నటీనటులు హాజరై సందడి చేశారు.


 

123వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 123వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు నదియాబాద్ లో రైతులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు.

Group 1 ఎగ్జామ్స్.. వరంగల్ జిల్లాలో 89 పరీక్షా కేంద్రాలు

గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 89 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3700మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 30నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఎగ్జామ్‌ సెంటర్‌లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. చెవి దిద్దులు, ఇతర ఆభరణాలను తీసివేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు.

ధర పిరం.. రూ.2లక్షలకు కిలో మ్యాంగో

సాదారణంగా మామిడి పండ్ల కిలో ధర యాభై నుంచి వంద రూపాయలు ఉంటుంది. లేదా ఎక్స్‌పోర్ట్ క్వాలిటి అయితే 400 వరకు ఉండొచ్చు. అయితే మియాజాకి రకం మ్యాంగో ధర కిలో ఏకంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంట. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.పశ్చిమబెంగాల్లో అమ్మకానికి వచ్చింది.  ఇక్కడకు మొత్తం 262 రకాల మామిడి పండ్లును ప్రదర్శనకు పెట్టారు. వాటిలో మియాజాకి రకం మామిడిని చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు.మియాజాకి రకం మామిడిని భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లో సాగుచేస్తారు. 

సిక్కోలులో సుర్రుమంటున్న సూరీడు

సిక్కోలు జిల్లాలో సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కవగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు.

వారాహి యాత్రను అడ్డుకోవడాని కుట్ర.. తక్షణమే సెక్షన్ 30 ని తీసేయండి

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అడ్డుకోవడానికే కోనసీమలో పోలీసు సెక్షన్ 30 అమలు చేశారని అన్నారు జనసేన నాయకులు శెట్టిబత్తుల రాజబాబు. పోలీసులు వెంటనే సెక్షన్ 30 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరగనున్న వారాహి యాత్రను అడ్డుకోవడం తగదన్నారు.  జూన్ 21 వ తేదీన అమలాపురం పట్టణంలో వారాహి యాత్ర జరిగి తీరుతుందని చెప్పారు. 

రోజురోజుకు పెరిగిపోతున్న సంధ్య శ్రీధర్‌ ఆగడాలు

సంధ్య శ్రీధర్‌ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాడులు చేయడం, బెదిరింపులకు దిగడమే పనిగా పెట్టుకున్నారు. అర్థరాత్రి గచ్చిబౌలిలో అనుచరులతో కలిసి హంగామా చేశారు. అనుచరులతో కలిసి ఇన్ఫినిటీ హోటల్‌లోకి చొరబడ్డ సంధ్య శ్రీధర్‌.. హోటల్‌లోని వస్తువులన్నింటీని ధ్వంసం చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదుతో సంధ్య శ్రీధర్‌, ఆయన అనుచరులపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదయ్యింది. ఐపీసీ 448, 42, 324, 506 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్‌చల్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్‌చల్‌ సృష్టించింది. ఎయిర్‌ పోర్ట్ టర్మినల్‌ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. సమయ స్ఫూర్తితో యువతిని కాపాడారు సిఐఎఫ్‌ఎఫ్ భద్రతా సిబ్బంది. యువతిని బెంగుళూరుకు చెందిన శ్వేతగా గుర్తించారు.

కేసముద్రంలో అగ్ని ప్రమాదం

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో మహదేవ్‌ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మహదేవ్‌ ఇండస్ట్రీలు మంటలు వ్యాపించడంతో, ధాన్యం బస్తాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది.

గోల్కొండ బోనాలకు రూ.10 లక్షలు మంజూరు

గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు పది లక్షలు మంజూరు చేసామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 22ని ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలపై గోల్కొండ కోటలో సమీక్షనిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు తలసాని.

బాలయ్యకు చంద్రబాబు విషెస్‌

బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. నటుడిగా కళాసేవ, ఎమ్మెల్యేగా ప్రజాసేవ, ఆస్పత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న బాలయ్య నిండు నూరేళ్లూ వర్థిల్లాలని కోరుకుంటున్నా అన్నారు చంద్రబాబు

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లాలో చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దాడులను లేఖలో ప్రస్తావించారు బాబు. దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

YCP మునిగిపోయేనావ:  MLA మేకపాటి

ఉదయగిరి సిట్టింగ్‌ MLA మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TV5తో మాట్లాడుతూ..YCP మునిగిపోయేనావ అని అన్నారు. పడిపోయింది ఎమ్మెల్యేల గ్రాఫ్ కాదని, CM జగన్‌ గ్రాఫ్‌ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే యువ గళం పాదయాత్రతో రాష్ట్రంలో TDP చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. నెల్లూరు నుంచే జగన్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జోష్యం చెప్పారు. నెల్లూరు జిల్లా రాజకీయాల పై నారా లోకేష్ తో సమగ్రంగా చర్చించానన్నారు. అలాగే YCPని వీడేందుకు కీలక వ్యక్తులు రెడీగా ఉన్నారని తెలిపారు. తాను కూడా అతి తొందరలో TDPలో చేరుతానని స్పష్టం చేశారు.

సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి

వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. ఆయనకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా... ఈ నెల చివరి వరకు.. ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఇవాళ సీబీఐ ముందు హాజరయ్యారు. ముందస్తు బెయిల్‌ వచ్చిన తర్వాత.. అవినాష్‌ రెండో సారి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు..

ఘనంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదినవేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. రాష్ట్రవ్యాప్తంగా జైబాలయ్య అంటూ... నినాదాలు చేస్తూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. తిరుమలలోనూ ఆయన జన్మదిన వేడుకుల్ని జరిపారు. శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 630 కొబ్బరికాయలు కొట్టారు టీడీపీ నేత శ్రీధర్‌ వర్మ. బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రామకృష్ణ ఫైర్

జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని అన్నారు సీపీఐ రామకృష్ణ. పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీల భారాన్ని ప్రజలపై గుదిబండలా వేశారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటూ మరో బాదుడుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు.

విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు: ఆనంద్‌బాబు

టీడీపీ ఫస్ట్‌ మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడని తెలిపారు. లోకేష్‌ యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు గురించి, ఆయన సెక్యూరిటీ గురించి స్పీకర్‌ తమ్మినేని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

ఫీజుల దోపిడి..వసతుల లేమి..కార్పొరేట్‌ స్కూళ్ల నిర్వాకం

విశాఖపట్నంలో కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడి మామూలుగా లేదు.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు, సదుపాయాలు కల్పించడంలో మాత్రం అలసత్వం పదర్శిస్తున్నాయి. ఇరుకు గదుల్లో క్లాసులు నిర్వహిస్తూ.. బుక్స్‌,యూనిఫాం పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నాయి. సూళ్ల కొత్త కొత్త నిబంధనలతో పేరంట్స్‌ షాక్‌కు గురవుతున్నారు. కార్పొరేట్‌ సూళ్ల దోపిడిని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. విద్యార్ధి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజుల దందాపై మండిపడుతున్నారు.

ఇతను చేప మందు కోసం చైనా నుంచి వచ్చాడు..!

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ కార్యక్రంలో చేప మందు కోసం చైనా నుంచి వచ్చి చేప మందు వేయించుకున్న చైనా దేశస్తుడు.

ఇప్పటివరకు 54 వేల మంది ఆస్తమా బాధితులు చేప మందును స్వీకరించారు.

శ్రీకాకుళంలో..రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

శ్రీకాకుళం జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం విలవిలాడుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఓ వైపు వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోత.. మరో వైపు కరెంటు కోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం శివారులో రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోదాడ డిపోకు చెందిన బస్సు.. హైదరాబాద్‌ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు.

కండక్టర్లను వేధిస్తున్న మేడ్చల్‌ డిపో మేనేజర్‌

టార్గెట్ల పేరుతో ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారంటూ మేడ్చల్‌ డిపో ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత నెలలో మంత్లీ పాస్‌లను తక్కువగా విక్రయించారన్న నెపంతో కొంత మంది కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కండక్టర్లను మానసికంగా వేధిస్తున్న డిపో మేనేజర్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.