- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో DVC హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ జగదీష్‌కుమార్, గుంటూరు స్టార్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవికుమార్, డాక్టర్ శైలజతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. DVC హాస్పిటల్ వైద్య సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరింపజేయనున్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. పల్లె ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ధ్యేయమన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో.. CISF భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేశారు. అలాగే ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. బెదిరింపు కాల్ చేసింది ఎవరో గుర్తించారు. అయితే తన పిల్లలు పొరపాటున ఫోన్ చేశారని, జరిగిన తప్పుకు క్షమించాలని భద్రతా సిబ్బందిని కోరాడు. మొత్తానికి బాంబ్ బెదింపు కాల్ ఫేక్ అని తేలండతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖలో అక్రమ మద్యం పట్టుబడింది. పక్కా సమాచారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీతమ్మదారలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని 79 డిఫెన్స్ మద్యం సీసాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట లేఅవుట్‌లో వైసీపీ పెద్దల పాత్ర ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్సన్నపేట భూముల్లో 60 ఎకరాలను మంత్రి అమర్నాథ్, విజయసాయిరెడ్డికి గురుదక్షిణ కింద ఇచ్చినట్లు ఆరోపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి బినామి గోపీనాథ్‌రెడ్డి సంస్థ ఎశుర్ డెవలపర్స్ పేరుపై భూబదిలీ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ బినామి బొడ్డేటి ప్రసాద్, ఆయన తండ్రితో పాటు మరికొంతమంది బినామిల పేర్లపై విస్సన్నపేట భూములు మారిపోయాయి. మరోవైపు రైతులను వారి భూముల వద్దకు వెళ్లకుండా మంత్రి అనుచరులు అడ్డుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూదోపిడీ చేస్తున్నారని వామపక్షాలు, జనసైనికులు ఆరోపిస్తున్నారు.

కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూను పరామర్శించారు టీడీపీ సీనియర్ నేత యనమల. ఇటీవల జ్యోతుల నెహ్రూ సోదరి మృతిచెందారు. యనమలతో పాటు చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి జగ్గంపేట వెళ్లి జ్యోతుల నెహ్రూను కలిసి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ సోదరి తోట నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

దళితుల పేరుతో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదు పాల్స్ డిక్లరేషన్ అని విమర్శించారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్‌ఎస్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. మొదట కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. అమిత్ షా ఖమ్మంలో రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని కవిత విమర్శించారు

చిత్తూరు జిల్లా నగరిలో జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌లను సైతం పక్కకు నెట్టివేశారు. కేంద్రం గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో తిరిగి నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఏపీలో జగన్ సర్కారు జనాన్ని పన్నులతో బాదేస్తోంది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో షాకిస్తోన్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఇంటి పన్నుతో కొరడా ఝుళిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ రేకుల షెడ్డుకు ఏకంగా 3400 రూపాయలు ఇంటి పన్ను వేసింది. గతంలో కేవలం 200 రూపాయలు ఉన్న ఇంటి పన్ను ఏకంగా... 3వేల 400 రూపాయలు వేయడంతో.. లబోదిబో మంటున్నాడు బాధితుడు. రేకుల షెడ్డుకు.. ఇంత భారీగా ఇంటి పన్ను వేయడమేంటని ప్రశ్నిస్తున్నాడు. క్రాంతి, నీరజ దంపతులు.
ఇబ్రహీంపట్నంలో ఓ రేకుల షెడ్డులో ఉంటున్నారు క్రాంతి, నీరజ దంపతులు. ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ఇంటికి 3400 రూపాయల ఇంటి పన్ను వేయడంతో.. షాక్ కు గురయ్యారు. దీనిపై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఎస్సీలకు 200 యూనిట్లు లోపు కరెంట్ ఉచితంగా ఇస్తుంది. బాధితులు ఎస్సీ అయినా ప్రతినెలా కరెంట్ బిల్లు కట్టడం విశేషం. కనీసం ఈ రేకుల షెడ్డుకు మౌలిక సదుపాయాలు కూడా లేవు.
ఏ సదుపాయాలు లేని ఈ రేకుల షెడ్డుకు వేల రూపాయల ఇంటి పన్ను విధించడం, ఎస్సీలకు ఉచితంగా ఇచ్చే కరెంటే చార్జీలు కూడా వసూలు చేయడం పై మండిపడుతున్నాయి విపక్షాలు. రెక్క ఆడితే కానీ.. డొక్కాడని తాము...ఇంత ఇంటి పన్ను ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్ జరిగిన కార్యక్రమంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ స్మారక నాణెన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మింట్‌లో తయారైన ఈ నాణెం మార్కెట్‌లో చలామణి కోసం కాదని. కేవలం స్మారక నాణెమని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు.ఈ నాణెం ధర 3 వేల 500 నుంచి 4వేల850 వరకు ధర ఉంటుందని..దీని తయారీకి కూడా అంతే ఖర్చు అవుతుందని అన్నారు. తొలి విడతలో 12వేల నాణేలు తయారు చేశామన్న ఆయన వీటి కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని అన్నారు.డిమాండ్ కి తగినంత సప్లై లేదని,అందరికీ అందేలా నాణేలు తయారు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మింట్‌లో తొలిసారి ఓ వ్యక్తి పేరు మీద నాణెం ముద్రించామని,ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వంద రూపాయిల డినామినేషన్ తో కాయిన్ ముద్రించామని అన్నారు. ఈ కాయిన్ కొనుగోలు కోసం ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు నాయుడు తెలిపారు.

సీఎం జగన్ పర్యటనలో నగరి వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం జగన్ శిలాపలకం ప్రారంభించిన తర్వాత సభాస్థలి వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదిక వద్ద వైసీపీ నేత కేజే శాంతితో మంత్రి రోజాను కలిపే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఇద్దరూ చేతులు కలపాలని సూచించారు. అయితే వీరిద్దరూ దీనికి అంగీకరించలేదు. వీరిద్దరిని కలిపేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుండగా రోజా తన చేతిని వెనక్కు తీసుకున్నారు. సీఎం సమక్షంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడటం ఆసక్తిగా మారింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అసమ్మతి సెగ తగులుతోంది. కొమరోలులో రాజన్న భోజనశాల ఏర్పాటు చేశారు వైసీపీ నేత రమణారెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరైయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపలేదు. కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో జన సమీకరణతో పాటు హెలీకాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తూ హంగామా చేశాడు. ఐతే ఇటీవల అట్టహాసంగా పుట్టినరోజు జరుపుకున్న అన్నా రాంబాబుకు కౌంటర్‌గా ఈ కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ నేతలు చర్చించుకుంటారు.

తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైకి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు, 30 వార్డు కౌన్సిలర్ హర్ష వర్ధన్ రెడ్డి దూసుకువచ్చాడు. టీడీపీ కౌన్సిలర్ గా గెలిచి ఇటీవలే వైసీపీలోకి వెళ్ళిన 6వ వార్డు కౌన్సిలర్ రాబర్ట్ మునిసిపల్ స్థలంలో అక్రమంగా హోటల్ నిర్మాణానికి సంబంధించి గొడవ మొదలైంది. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అనంతపురంలో జడ్జిపైన ఆయన భార్య కేసు నమోదు చేశారు. జిల్లా 8వ ఏడిజే ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న డి. శ్రీనివాసులుపై ఆయన భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ కంఫ్లైంట్ చేశారు. మ్యూచవల్ డైవర్స్ కి ఒప్పుకోవాలని వేధిస్తున్నారని ఆరోపించారు. జడ్జి సోదరుడు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన కూతురి భవిష్యత్తు కోసమే కలిసి ఉండాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలసి ఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. పొందూరు మండలం సింగూరు ఇసుక రిచ్‌ల పరిశీలనకు వెళ్లిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో కూన రవికుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఇసుక అక్రమాలను పరిశీలిస్తామంటూ ముందుకు వెళ్లిన కూనరవికుమార్ తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారని కూనరవికుమార్ ఆరోపించారు.

విజయవాడ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతల అవినీతి బట్టబయలు అయింది. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్‌లో డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామంటూ మరికొందరు నేతులు అడ్డంగా దోచేస్తున్నారని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై నజర్ పెట్టి భారీ డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. వాటల పంపిణీలో తేడాలు రావడంతో స్వంత పార్టీనేతలే ఒకరి బాగోతం ఒకరు బయట పెట్టుకున్నారు.

ఏపీలో ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట పట్టింది. వైసీపీ నాయకుల ఇసుక అక్రమాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ఇసుక రీచ్‌ల పరిశీలనకు వెళ్ళిన టీడీపీ నాయకులను పోలీసులను అడ్డుకున్నారు. చంద్రగిరిలో టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అధికారపార్టీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని నేతలు ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం కత్తనపర్తి వద్ద పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇసుక రీచ్ వైపు వెళ్తుండగా టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఉషా శ్రీచరణ్ ఇసుక దోపిడికి అడ్డు అదుపు లేకుండాపోయిందని మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయచౌదరి ఆరోపించారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గూనాంలో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. చంపావతి నదిలో యథ్చేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని టీడీపీ నేత కరణం శివరామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఇసుక సొమ్ము వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఖాతాల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. బొత్స కుటుంబం జిల్లాలో ఇసుక భూములను చెరబట్టిందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత తీర్పులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణమోహన్‌రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో కృష్ణమోహన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ వేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎమ్మెల్యేపై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ అనర్హత వేటు వేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై వాలంటీర్ల ఫిర్యాదు కలకలం రేపుతోంది. తమను ఎమ్మెల్యే దూషించాడంటూ ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇటీవల మన్నవ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను అభివృద్ధి పనులపై గ్రామస్తులు నిలదీశారు. దాంతో మన్నవ సచివాలయానికి తమను పిలిపించి ఎమ్మెల్యే కిలారి రోశయ్య బూతులు తిడుతూ ఇష్టానుసారం మాట్లాడాని వాలంటీర్లు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి పనులు చేయకుండా అడిగినవారిపై దుర్బాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోశయ్య నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి హాజరువుతున్నారు.వీరితో పాటు GHMC మేయర్, డిప్యూటీ మేయర్, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన MLC లు, MLA లు, బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఏపీ వ్యాప్తంగా అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. అక్రమ ఇసుక క్వారీలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినా... ఇసుక రవాణా యథేచ్చగా జరుగుతోందంటున్నారు టీడీపీ నేతలు. దీన్ని అడ్డుకునేందుకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇసుక క్వారీల వద్ద ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం జువ్వలపాలెంలో మాజీ మంత్రి ఆనందబాబు ఆధ్వర్యంలో ఇసుక క్వారీల వద్ద ఆందోళన చేస్తున్నారు. అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తాడికొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల సంఘం నిబంధనల కు విరుద్ధంగా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఒక వార్డులో ఉన్న వాళ్ళను ఒక బూత్ కు కాకుండా 8 వేర్వేరు బూత్ లకు కేటాయించారని వివరించారు. 150 మంది మృతుల ఓట్లను కూడా తొలగించలేదని వెల్లడించారు. సున్నా ఇంటి నెంబర్ తో 53 ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.

తిరుమలలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. నడకమార్గంలో 7వ మైలు వద్ద అర్థరాత్రి బోనులో చిక్కింది. 2 నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను బంధించింది అటవీశాఖ. ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన ఆడ చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 197వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సుందరరావు పేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లింగపాలెంలో స్థానికులతో సమావేశమైన అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు లోకేష్ 2 వేల 624 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఫాతిమాపురం జంక్షన్ లో రైతులతో సమావేశమవుతారు. చింతలపూడి శివార్లతో భోజన విరామనం అనంతరం.. తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి తీగల వంచ శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.

హైదరాబాద్ రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ స్వీపర్ సునీతపైకి దూసుకెళ్లింది. దీంతో పారిశుద్ద్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు ను సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏకగ్రీవ ఎన్నికకు విపక్షాలు సహకరించాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించిన దివంగత నేత సాయన్నపై గౌరవం ఉంటే..ఆయన కూతురు లాస్య నందితకు పార్టీలన్నీ మద్దతు తెలపాలన్నారు. కంటోన్మెంట్‌లోని లాస్యనందిత నివాసంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి తలసాని హాజరయ్యారు. ఎన్నికలు వస్తే లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. సమావేశం తర్వాత బోయిన్‌పల్లిలో యాదవ భవనాన్ని ప్రారంభించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. పూర్ణపాడు- లాభేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలంటూ.. అరగుండుతో నిరసన తెలిపారు కోమటిపేట గ్రామస్తులు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ 11 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. వంతెన నిర్మాణం విషయంలో కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తాత్సారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల... అత్యవసర పరిస్థితుల్లో నదిని దాటడానికి నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు.

వైసీపీ సర్కార్ విద్యావిధానంపై TSNF ఫైర్ అయింది. పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి నిధుల్లో కోతపెట్టడం దారుణమని, నవరత్నాలను ఖురాన్, బైబిల్‌తో పోల్చిన సీఎం జగన్..నవ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 5లక్షల మంది విద్యకు దూరమైయ్యారని ఆరోపించారు. 2 లక్షల మంది విద్యార్ధులకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ అందడం లేదని.. దీంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు TSNF నేతలు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బిగిస్ బర్గర్ స్టోర్‌లో అగ్నిప్రమాదం తర్వాత ఓనర్ పరారయ్యాడు. బిగిస్ బర్గర్ కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది .. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. బిగిస్ బర్గర్‌లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ చర్యలు లేవని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. కిచెన్‌లో ఎలక్ట్రిక్ మిషన్లు ఎక్కువగా వాడటం కూడా మరో కారణమని తేల్చారు. పరారీలో ఉన్న బిగిస్ బర్గర్ ఓనర్‌పై కేసు నమోదు చేశామంటున్నారు మాదాపూర్ జోన్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫజల్.

పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళంలో దారుణ హత్య జరిగింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని SHB కాలోనీలో.. నరసింగరావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆస్తి తగదాల కారణంగా ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తి కోసం హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్తు తగదా కేసు.... మూడేళ్లుగా కోర్టులో కేసు నడుస్తుండగా ... హత్యకు గురయ్యాడు నరసింగరావు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటన స్థలానికి చేరుకుని...క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.

కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. బెంగళూరు బయలుదేరిన ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ ముఖ్యనేతలకు..పలు సూచనలు చేశారు.మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్‌ను..బలంగా రూపొందించాలని అన్నారు.ఖర్గేను కలిసేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సూచించారు ఖర్గే. త్వరలో తెలంగాణకు రాహుల్ లేదా ప్రియాంక రానున్నారని, అవసరమైతే మరోసారి రాష్ట్రానికి వస్తానని కాంగ్రెస్ నేతలకు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు ఇవాళ మరో అద్భుత ఘట్టానికి వేదికకానుంది. 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వీక్షించనున్నారు. ఇవాళ మంత్రి హరీష్ సమక్షంలో డ్రోన్ షో జరగనుంది. సాయంత్రం డ్రోన్ షో కనువిందు చేయనుంది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో సిద్దిపేట అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు. సినీ గాయనీ గీతామాధురి బృందం ఆట పాటలతో అలరించనున్నారు.

విశాఖలో జగనన్న బస్ బే కూలిపోయింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా నిర్మించిన ఈ బస్సు బేను..హడావుడిగా నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు. పనులు కూడా పూర్తి కాకుండానే... మేయర్ చేతుల మీదుగా.. దీన్ని ప్రారంభించారు. అయితే.. ఇవాళ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా బస్ బే కూలిపోయింది. కూలిన సమయంలో.. పలువురు ప్రయాణికీలు బస్ బే కింద ఉన్నారు. అయితే విరిగి శబ్దం రావడంతో.. ప్రయాణీకులు తప్పించుకున్నారు. జగననన్న బస్ బేలు కేవలం ప్రచారానికి తప్ప ఎలాంటి నాణ్యత ఉండటం లేదంటు మండిపడ్డారు విశాఖ వాసులు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శనివారం శ్రీనగర్ లోని నగీన్ సరస్సులో బోట్ రైడ్ చేశారు. ఈ సరస్సు అందాలను ఆస్వాదించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ... నైగీన్ సరస్సులోని..... హౌస్ బోటులోనే ఉంటున్నారు. బోట్ రైడ్ అనంతరం.. రైనావారీ ప్రాతంంలోని హోటల్ లో సోనియాగాంధీ బస చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం సోనియా, రాహుల్ ను కలవనున్నారు. ఇక.... ఇవాళ సోనియా కుటుంబం గుల్మాల్‌ను సందన్శించనున్నారు.

కాసేపట్లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు కొనసాగే ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చిందని భావిస్తున్న సీపీఎం నేతలు.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు సీపీఎం నేతలు.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్‌లో కొంత మాయం చేసిన ఎస్‌ఐ.. వాటిని అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో.. ఎస్‌ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న టీమ్‌లో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ కూడా ఉన్నారు. అయితే.. సీజ్ చేసిన డ్రగ్స్‌లో కొంత మాయం అయినట్లు గుర్తించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


