చిట్టి న్యూస్

Lokesh: గంజాయిపై..గవర్నర్‌కు లోకేష్ ఫిర్యాదు..

ఏపీలో విచ్చల విడి గంజాయి లభ్యతపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేయనున్నారు.ఉదయం 11గంటలకు గవర్నర్‌ను లోకేష్ కలవనున్నారు.రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై నేడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.ఏపీని గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.యువత గంజాయి బారిన పడుతున్నారంటూ యువగళం పాదయాత్రలో తనకు వచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్‌కు నివేదించనున్నారు. 

Srikakulam: బంధీ అయిన భల్లూకం..

శ్రీకాకుళం జిల్లాలో అధికారులు ఓ ఎలుగుబంటిన బంధించారు. మందస మండలం పెద్ద లోహరిబందలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఉదయం మత్తు మందు ఇచ్చి విశాఖ జూ అధికారులు బంధించారు. నిన్న ఉదయం నుండి గాయాలతో రోడ్డు పక్కన చుట్టూ చక్కర్లు కొట్టింది. విశాఖ జూలో భల్లూకానికి వైద్యం అందివ్వనున్నారు.

Modi France tour: మోదీకి మెక్రాన్‌ బహుమతి..

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని బహుమతిగా ఇచ్చారు మోదీ. అలాగే మెక్రాన్‌ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. దీంతో పాటు కాశ్మీరీ కార్పెట్‌ను బహూకరించారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి సైతం పలు బహుమతులను మెక్రాన్‌ అందజేశారు.

Vishaka Rishi Konda: రుషికొండ నిర్మాణాలపై..మరో పిటిషన్‌

విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పనులపై హైకోర్టును ఆశ్రయించారు. పనులు ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే కొన్ని సూట్‌ రూములతో కూడిన ఒక బ్లాకు నిర్మాణం చివరి దశకు చేరగా మరో బ్లాకును కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యుత్తు పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండ తవ్వకం పనుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులున్నావాటిని పట్టించుకోలేదు. ఇదే అంశంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ లేఖ రాశారు. 

AP:ఏపీలో పథకాలు కావాలంటే..ఆధార్ ఉండాల్సిందే..

ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు, సేవలు పొందాలంటే లబ్దిదారులు తమ ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఆధార్‌కు గోప్యత అవసరమని,దానిని నిర్బంధం చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే రూలింగ్‌ ఇచ్చింది.ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు,రాయితీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బట్వాడా చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆధార్‌ నంబరు ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో బిల్లును ఆమోదించిందని దానిని ఇప్పటికే దేశంలోని 16రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులన్నారు. 

KTR: టీ కాంగ్రెస్‌ని ఓ పోకిరీ చేతిలో పెట్టారు..కేటీఆర్‌ కామెంట్స్‌

తెలంగాణ కాంగ్రెస్‌ని ఓ పోకిరీ చేతిలో పెట్టారంటూ మంత్రి కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని ట్వీట్‌ చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులమంటూ కొందరు తనకు కాల్‌ చేసి బెదిరించారని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్‌ ట్వీట్‌పై.. మంత్రి కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ISRAEL: తెగిన తలను అతికించిన వైద్యులు..బాలుడికి పునర్జన్మ..

ఇజ్రాయెల్‌ వైద్యులు అధ్బుతం సాధించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు సులేమాన్‌ హసన్‌ సైకిల్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హసన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల భాగం మెడ నుంచి దాదాపు వేరయింది. వెంటనే అతడిని విమానంలో హదస్సా మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించి, తెగిపోయిన అతడి తలను తిరిగి అతికించారు. ఇది కచ్చితంగా అద్భుతమేనని వైద్యులు తెలిపారు.

Medical Officer Posts: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికెషేన్‌

నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ, పూర్తి వివరాల కోసం mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని బోర్డు సూచించింది.


వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగ అభ్యర్థులు రూ.500

అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 44 సంవత్సరాలు ఉండాలి. తెలంగాణలో వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 80 మార్కులు విద్యార్హతకు, 20 మార్కులు అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం: రూ.54,220 – రూ.1,33,630.

తెలంగాణలో వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోందని ఈ అవకాశాన్ని అభ్యర్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Plane accident: ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలైన..విమానం

ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. దాని రెక్కలు విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సోమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్ జరిగింది. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఉండగా.. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. అయితే విమానం రన్‌ వే నుంచి పక్కకు ఎందుకు వెళ్లిందో అన్నదానికి సరైన కారణం తెలియలేని వెల్లడించింది. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది.

హరీష్‌రావుతో రాజాసింగ్ భేటీ

గోషామహల్ బీజేపీ రాజాసింగ్ మంత్రి హరీష్‌రావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మార్పు జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే హరీష్‌రావును కలిసానన్నారు.

Jagaon: బీజేపీ నేత మిస్సింగ్

జనగామలో బీజేపీ నేత మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డిని దుండగులు కిడ్నాప్‌ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

కాన్వాయ్‌ దిగి..మహిళలకు వైద్యం

మంగళగిరిలోని సీతానగరంలో బండిపై నుంచి పడిపోయిన ఇద్దరు మహిళలను చూసి చంద్రబాబు చలించిపోయారు. వెంటనే కారు దిగి ప్రమాదానికి గురైన వారిని పరామర్శించారు. కాన్వాయ్‌లో ఉన్న డాక్టర్ ద్వారా వైద్య పరీక్షలు చేయించారు. 

లోకేష్‌కు పాదయాత్రకు మద్దతుగా.. ప్రభాకర్

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న లోకేష్‌కు మద్దతుగా నియోజకవర్గంలో చేపట్టే పాదయాత్రలో భారీగా టీడీపీ సైనికులు పాల్గొంటారని చెప్పారు. 

అమ్మఒడి పథకం.. తల్లుల ఖాతాలో జమకాని వైనం

అమ్మఒడి పథకం నాలుగో విడత డబ్బు ఇప్పటికీ తల్లుల ఖాతాలో జమ కాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్‌ జూన్‌ 28న బటన్‌ నొక్కారు. 42.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6 వేల 392 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం గొప్పగా ప్రకటించారు. బటన్‌ నొక్కి 15 రోజులైన ఇప్పటికీ 40 శాతం మందికి నిధులు జమ కాలేదు. అమ్మఒడి సాయం 15 వేల రూపాయలల్లో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు 2 వేల రూపాయలు మినహాయిస్తున్నారు. మిగతా 13 వేలైనా వస్తాయా అని ఎదురుచూస్తున్నారు లబ్ధిదారులు. డబ్బులు పడ్డాయోమోనని తల్లులు బ్యాంకులకు వెళ్లి చూసుకుంటున్నారు. డబ్బులు పడకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

TDP: మహాశక్తి పథకం ప్రారంభం..

మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో భాగంగా మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మహాశక్తి పథకాన్ని ప్రారంభించన్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో మహిళలు పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగు మహిళల తరలి వెళ్లారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ జెండాను ఊపి ప్రారంభించారు.టీడీపీ మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు జ్యోతుల నెహ్రు. మహాశక్తి పథకం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలతో దూసుకెళ్తోందన్నారు. మహాశక్తి పథకం ప్రారంభానికి మహిళా నేతలంతా పాల్గొంటారన్నారాయన. 

TDP: లోకేష్ పాదయాత్రకు..సంఘీభావం

ఈ నెల 19న లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీ సైనికులు పాల్గొంటారన్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంపై నియోజకవర్గ నేతలు, క్లస్టర్‌ ఇంఛార్జీలు, సీనియర్‌ నేతలతో రివ్యూ చేశారు చింతమనేని ప్రభాకర్‌. కార్యకర్తలే తన బలం బలహీనత అన్నారాయన. వారి వల్లే తాను రాజకీయాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. మండల నేతలు ప్రతి కార్యకర్తల్ని కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ నెల 19 తర్వాత నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గ్రామాల వారీగా నిర్వహిస్తామని చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు.

వైసీపీ పాలనలో నిరుద్యోగుల ఇబ్బందులు

వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారంటూ మండిపడుతున్నారు నిరుద్యోగులు. కేవలం ప్రకటనలు ఇస్తున్నారు కానీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు పెట్టి తీవ్ర నష్టపోతున్నామని, మరోవైపు వయస్సు కూడా దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

BONALU: ప్లెక్సీల ఏర్పాటులో ఉద్రిక్తత

హైదరాబాద్‌ మంగళహాట్‌లో బోనాల ప్లెక్సీల ఏర్పాటు విషయంలో గత రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. సంతోష్‌ గౌడ్, నరేందర్‌ గౌడ్‌ బోనాల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీలను తొలగించాలంటూ స్థానిక కార్పొరేటర్‌ శశికళ అనుచరులు వీరంగం సృష్టించారు. వారి ఇళ్లపై దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకోవడంతో.. పరిస్థితి సద్దుమణిగింది. ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Vizag: పెరుగుతున్న డెంగ్యూ నేసులు..

విశాఖ నగరంలో డెంగ్యూ మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖలోని 4,5,6 జోన్ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తగా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రతను పాటిస్తే డెంగ్యూను కట్టడి చేయవచ్చని జీవీఎంసీ ముఖ్య వైద్య అధికారి నరేష్ కుమార్ తెలిపారు.

BANGALURU: రోడ్డుపై రెచ్చిపోతున్న ఆకతాయిలు

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.రోడ్డుపై అడ్డంగా బైక్‌ రైడింగ్‌ చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారు.సైడ్‌ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా బైక్‌లను నడిపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు యువకులు. ఈస్ట్ బెంగళూరులో కొందరు యువకులు ఓ కారుకు అడ్డంగా బైక్‌ నడుపుతూ వింతగా ప్రవర్తించారు. అయితే సైడ్‌ ఇమ్మన పాపానికి కారులోని వారిపై దాడికి దిగారు. అయితే ఆకతాయిల వికృత చేష్టలను రికార్డ్ చేసిన కారు లోని ప్రయాణికులు.. ఆ వీడియోను కర్నాటక డీజీపీకి పంపారు. మరి ఈ ఆకతాయిలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

KIA: మిలియన్ కార్ల ఉత్పత్తిపై..చంద్రబాబు హర్షం

కియా పరిశ్రమ ఏర్పాటుతో సంపద సృష్టి జరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురంలోని కియా పరిశ్రమ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కియా పరిశ్రమకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ సంకల్పం, సమర్ధవంతమైన ప్రభుత్వ విధానాల కారణంగా కియా పరిశ్రమ 2017లో రాష్ట్రానికి వచ్చిందన్న చంద్రబాబు.. కియా పరిశ్రమ ద్వారా వేలాది మంది రాయలసీమ యువత స్థానికంగా ఉపాధి పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

MODI: ఫ్రాన్స్‌లో.. అతి త్వరలో యూపీఐ సేవలు

ఫ్రాన్స్‌లోనూ త్వరలో యూపీఐ సేవలు ప్రారంభం అవుతాయని ప్రధాని మోదీ అన్నారు. ప్యారిస్‌లో భారత పౌరులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు.త్వరలోనే ఈఫిల్‌ టవర్‌ వద్ద సేవలు ప్రారంభమవుతాయని ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చే భారత పర్యాటకులు రూపాయిని ఇక్కడ చెల్లింపుల కోసం వాడుకోవచ్చన్నారు. తన ఫ్రాన్స్‌ పర్యటన ప్రత్యేకమైందన్న మోదీ ఇదే సమయంలో జీ20కి అధ్యక్షత వహించడం ప్రత్యేకమన్నారు.

PAVAN KALYAN: పంచాయతీ వ్యవస్థ ఉండగా.. సచివాలయ వ్యవస్థ దేనికి..

ఏపీలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికంటూ మరోసారి జనసేనాని పవన్‌కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయిందని పవన్‌ ఆరోపించారు.జగన్‌ భాష చూస్తుంటే చిరాకేస్తోందని ఆయన్ను ఇంటికి పంపే రోజు వచ్చిందని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని కామెంట్స్‌ చేశారు.

NGT: తెలంగాణ ప్రభుత్వంపై..NGT ఆగ్రహం..

తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకున్నా సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై అభ్యంతరం తెలిపింది. పనులు కొనసాగిస్తే కోర్టు ధిక్కరణకు గురవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.పర్యావరణ అనుమతులు లేనందున సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఆ ఆదేశాలను పక్కనపెట్టి పనులు సాగిస్తోంది.దీంతో పనులు కొనసాగిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని గోదావరి రివర్‌బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపైన ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

జగన్ ను ఇంటికి పంపుదాం: పవన్

ఏపీలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికంటూ మరోసారి పవన్‌కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయిందని పవన్‌ ఆరోపించారు. జగన్‌ భాష చూస్తుంటే చిరాకేస్తోందని.. ఆయన్ను ఇంటికి పంపే రోజు వచ్చిందని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని కామెంట్స్‌ చేశారు. తన కుటుంబాన్ని ఏమైనా అన్నా తనకు కోపం రాదని.. ప్రజల్ని అంటే మాత్రం కోపం వస్తోందన్నారు. జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం బాధేసిందన్నారు. 

లైగర్ బ్యూటీ ప్రేమాయణం

బాలీవుడ్ నుంచి మరో ప్రేమ జంట హల్ చల్ చేస్తోంది. నటి అనన్య పాండే, నటుడు ఆదిత్య రాయ్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు జోరుగా ప్రాచారం సాగుతోంది. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనన్యను ఆదిత్య హగ్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం స్పెయిన్‌ టూర్‌లో ఉన్న వీరు అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు వీళ్లు లవ్‌లో ఉన్నారంటూ కన్ఫామ్‌ చేస్తున్నారు.  

Lucknow Saree: ఆ చీర ఖరీదు అక్షరాల రూ. 21 లక్షలు

ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. పండగలొస్తే ఈ చీరల ధరలు భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో వస్త్రదుకాణంలో విక్రయిస్తున్న 21 లక్షల రూపాయల చీర చూస్తే ఏకంగా మతులే పోతాయి. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి తెలిపారు. దీని తయారీకి రెండేళ్లు పట్టిందన్నారు. 

Vikarabad: అతి రుద్ర మహాయాగంలో.. అపశృతి

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తలపెట్టిన అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని నివాసంలో యాగం నిర్వహిస్తుండగా చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో టెంట్స్, హోమం గుండాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ప్రాణనష్టం, ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మీడియాను ఎమ్మెల్యే అనుచరులు అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

AP BJP: అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు. విజయాడ పార్టీ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు. రాబోయే ఎన్నికలలో పురంధేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని ఇప్పటికే వెల్లడించారు ఏపీ బీజేపీ నేతలు.ఈ నెల 16న ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యాచరణపై చర్చించి అదే రోజు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 


ISRO: చంద్రయాన్ -3 రేపే ప్రయోగం.. అంతా సిద్దం

చంద్రయాన్ -3 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనున్నారు.  LVM 3 - M4.. దీన్ని మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌-2 పేరిట నాలుగేళ్ల కిందట జాబిల్లిపై ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సిద్ధమైంది.  

AP POLITICS: సజ్జలపై నారా లోకేష్ ఫైర్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుపై టీడీపీ యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉదయగిరిలోని 3వేల ఎకరాలపై సజ్జల కన్ను పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నీ లాక్కుంటామని వారు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని స్పష్టం చేశారు. 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు పింఛను ఇస్తానని చెప్పి జగన్‌ మోసం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తామన్నారు అంగన్‌వాడీ కార్యకర్తల అన్ని డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. 

TS WEATHER: మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు..

తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు ఆదిలాబాద్‌, కుమ్రంభీం‌, మంచిర్యాలతో పాటు నిర్మల్‌, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం, శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లిలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. శుక్రవారం, శనివారం వరకు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌ లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 

VANDHE BHARAT: కొత్తగా మరో 4 వందే భారత్‌ ట్రైన్స్..

దేశంలో కొత్తగా మరో నాలుగు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరులోనే వీటిని ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలాఖరులో ప్రారంభం కానున్న 4 రైళ్లూ ఎనిమిదేసి కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్‌ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ నెలలో ప్రారంభించనున్న రూట్లలో ఢిల్లీ- చండీగఢ్‌, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌, గ్వాలియర్‌- భోపాల్‌ ఉండనున్నాయి.

Telangana HC: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వీ భట్టిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించిన తర్వాత వారిద్దరినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తాజా కేంద్రం నిర్ణయంతో తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది.

T BJP: స్పీడ్ పెంచిన బీజేపీ

తెలంగాణలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు బీజేపీ నాయకత్వం స్పీడ్ పెంచింది.వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది.కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారధ్యంలో నిరంతరం నేతలు ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాల అమలుకు నిర్ణయం తీసుకుంది. వందరోజుల కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తీర్మానించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్న ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.

డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు

వాలంటీర్‌ వ్యవస్థపై దుష్ప్రచారం చేశారంటూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వైసీపీ నాయకులు, వాలంటీర్లు దగ్ధం చేయడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధపడ్డారు. ఐతే.. జనసేన నాయకుల నుంచి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేసారు. దీంతో డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. సీఐ అంజూ యాదవ్‌ ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడాన్ని జనసేన నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.