- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీపడుతుండగా... ఇప్పుడు భూపాల్ నాయక్ సైతం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ సారి కచ్చితంగా డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తామంటున్నారు భూపాల్ నాయక్.

పోలవరం ప్రాజెక్టు దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టిసీమ,పోలవరం ప్రాజెక్టులు సందర్శించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈనేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి కేవలం 14 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఉభయగోదావరి జిల్లాలో సీఎం,ప్రతిపక్ష నేతల పర్యటన ఒకే రోజు ఉండటంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ రాత్రికి రాజమండ్రిలోబస చేయనున్నారు జగన్,చంద్రబాబు.

జగనన్న కాలనీల పేరుతో ఏపీలో యధేచ్చగా అక్రమాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతల చేతివాటానికి ఓ మహిళా రైతు నిండా మునిగింది. వెంకన్నపాలెంకు చెందిన మహాలక్ష్మి జగనన్న కాలనీ కోసం తన 10 సెంట్ల భూమిని ఇచ్చింది. అయితే పరిహారంగా సుమారు 72లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ నగదు వైసీపీ నేతల ఖాతాల్లో జమకావడంతో మహాలక్ష్మి కంగుతున్నారు. తనకు న్యాయం చేయాలని రెండేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని కన్నీరుమున్నీరువుతున్నారు.

మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ లోని దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడి చేసి వివస్త్రను చేశాడు ఓ కీచకుడు. మద్యం మత్తులో . అందరూ చూస్తుండగానే ఈ దారణానికి ఒడిగట్టాడు పెద్ద మారయ్య. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళతో పాటు స్థానికులపైనా దాడి చేశాడు. ఈ తతంగమమంతా పెద్దమారయ్య తల్లి సమక్షంలో జరిగింది. తల్లి తన కొడుకుని సమర్ధించడంపై స్థానికులు మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. బాధిత మహిళను రక్షించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. గుంతలు గుంతలుగా ఉన్న చంద్రమామ ఉపరితలం అందులో కనిపించింది. ఇక చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. మళ్లీ ఇలాంటి విన్యాసాన్ని ఎల్లుండి నిర్వహించనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరానికి వెళ్తారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు.

ధరణిలో అనేక లోపాలున్నాయన్నారు భట్టి విక్రమార్క. దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని కోరారు. భద్రాచలం దగ్గర ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా శాసనసభలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించింది. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ బిల్లుకు ఎంఐఎం, బీజేపీ శాసనసభ్యులు మద్దతు తెలిపారు.

ఏపీలో ప్రభుత్వం మారబోతోంది.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. అభివృద్ధి పేరుతో అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నవారు ఎక్కడికి పోవాలని పవన్ ప్రశ్నించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో ఆయన సమావేశం అయ్యారు. రైతుల పక్షాన జనసేన బలంగా నిలబడుతుందన్నారు. హక్కులను అడగకపోతే.. బలమున్న ప్రతి ఒక్కడు అన్యాయమే చేస్తాడని అన్నారు. పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శాసనసభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణను నిండా ముంచిన కాంగ్రెస్ నేతలా తమకు నీతులు చెప్పేది అంటూ ఫైర్ అయ్యారు. ఎవరేం చేసినా తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సీట్ల కంటే ఆరేడు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పారు.ఎంఐఎం ఎప్పటికీ మాకు ఫ్రెండ్లీ పార్టీనేనని అన్నారు.

మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో పోచారం బ్యాక్ వాటర్‌లో పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 300 ఎకరాలు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల పొలాలపై ఇసుక మేటలు వేశాయి.. రాజిపేట గ్రామంలోనే 100 ఎకరాలకు పైగానే సాగుకు వీలుకాకుండా పోయాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్ రెడ్డి పాలనలో ప్రాజెక్ట్‌ల పనులన్నీ నిలిచిపోయాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.. టీడీపీ హయాంలో 34 ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తే... వైసీపీ పాలనలో ప్రాజెక్ట్‌లన్నీ పడకేశాయని మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు.

దళితబంధును అందరికీ కాకుండా...పేద దళితులకే ఇవ్వాలని ఈటల కోరారు. రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. తెలంగాణ ఏర్పాటు- తొమ్మిదేళ్ల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో భారీగా వరదలొచ్చాయని... పంటలు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. విద్యారంగాన్ని పటిష్టపరచాలన్నారు. అన్ని ప్రభుత్వ హైస్కూళ్లకు హాస్టళ్లను అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఉన్నా...ఎక్విప్‌మెంట్ లేదన్నారు. వ్యాధి నిర్ధారణ పరికరాలను సమకూర్చాలన్నారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్ చంద్రునాయక్, మరో స్థానిక నేత నెహ్రూ నాయక్‌లు టికెట్ కోసం పోటీ పడున్నారు. వీరితో పాటు మరో యువనేత భూపాల్ నాయక్ పోటీకి సిద్ధమవుతున్నారు. భూపాల్ నాయక్... ఇప్పటికే కిసాన్ పరివార్ పేరిట రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా పై వ్యతిరేకత, కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు నేతల్లోనూ సఖ్యత లేకపోవడం తనకు కలిసివస్తాయంటున్నారు భూపాల్ నాయక్.

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉండకపోవచ్చన్న రాజాసింగ్.. ఇంటా, బయటా తాను అసెంబ్లీలోకి రావొద్దని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీలో తాను ఉన్నా లేకున్నా.. ధూల్‌పేట ప్రజల పట్ల దయ చూపాలని స్పీకర్‌ను కోరారు రాజాసింగ్.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీలో జయశంకర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసా రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పోలవరం -పట్టిసీమప్రాజెక్టు సందర్శించనున్నారు. ఇవాళ రాత్రికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు చేరుకోనున్న చంద్రబాబు.... రేపు పోలవరాన్ని పరిశీలిస్తారు. పోలవరం ఈఎన్సీ అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పోలవరం వెళ్తామంటున్నారు టీడీపీ నేతలు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు..... సోమవారాన్ని పోలవారంగా మార్చారు. ఏకంగా 28 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. రేపు సోమవారం కావడంతో..... విపక్షనేతగా పోలవరం వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి.గోదారిత ఉత్పత్తుల వినియోగాన్ని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారాయన. అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ దత్త పీఠాధిపతి విజయానంద తీర్థ స్వామి హాజరై ప్రారంభించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు సీఐఎస్‌ఎఫ్ అధికారులు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ప్రజలు భారీ సంఖ్యలో రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ప్రయాణీకుల్ని సైతం అలర్ట్ చేశారు. ఎయిర్‌పోర్టుకు.. బంధువుల్ని తీసుకురావద్దని సూచించారు.

అసెంబ్లీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్యే సీతక్క. సభలోకి వచ్చాక కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అవర్ లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే... ఏలా మాట్లాడేదని ప్రశ్నించారు. సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుందంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడిన మైక్ కట్ చేయరని.... కానీ మాకు ఓ నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..... పులివెందులలో అర్ధరాత్రి వరకు జనం ఎదురుచూశారన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు... అంగళ్లులో రాళ్ల దాడి చేశారన్నారు. వైసీపీ కార్యకర్తలకు తప్పతాగించి ఎమ్మెల్యే ద్వారాకారెడ్డి దాడి చేయించారంటూ ఆరోపించారు. రాళ్లు,రాడ్లతో తిరుగుతున్న వైసీపీ నేతల్ని ఎందుకు అడ్డుకోలేదని పోలీసుల్ని ప్రశ్నించారు. పైగా దాడి చేసిన వైసీపీ నేతల్ని కాదని.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడ్డారు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో 55, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్, తెలంగాణలో 21, ఝార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18, హరియాణాలో 15, కర్ణాటకలో 13 స్టేషన్లు ఉన్నాయి. రూ, 24 వేల 470 కోట్ల ఖర్చుతో చేపట్టనున్నారు.

లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఎంపీ సోయం బాబు రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి, పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆర్టీసీ విలీనాన్ని రాజకీయలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ అడ్డుపడటం వల్లే ఆర్టీసీ విలీనం కావట్లేదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే.. కానీ సీఏస్ తో వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించలేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎస్ ను పంపించి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.

ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదు. దీంతో ఎయిల్‌టెల్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నలింగ్ సమస్యలను పరిష్కరించడంలో ఎయిర్‌టెల్ యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో గత మూడు గంటల నుంచి మొబైల్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌టెల్ ఫోన్లు పనిచేయడం లేదు. సమస్య దేశ వ్యాప్తంగా ఉన్నట్టు సమాచారం వస్తోంది. ఎయిర్‌టెల్ కాల్స్ డ్రాప్ అవుతుండడంతో అత్యవసర పనుల్లో ఉన్నవారు ఆందోళనకు లోనవుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. 2006-2008 మధ్య కాలంలోనూ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు.

వైసీపీపై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతికి సంబంధించిన ఆధారాలను జీవోలతో సహా చూపిస్తుంటే అధికార పార్టీ నాయకుల దగ్గర సమాధానం లేదన్నారు. ప్రశ్నించిన తన నా రక్తం కళ్ల చూడాలనుకుంటున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొస్తానన్న చంద్రబాబు.. తన జీవిత ఆశయం నెరవేర్చుకుంటానని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఏపీ గుండా రాజ్యంగా మారిందన్నారు టీడీపీ నేతలు. పుంగనూరు, తంబళ్లపల్లె దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన వీడియో, ఫోటోలను గవర్నర్‌కు అందజేశారు. వీరిలో నిమ్మల రామానాయుడు, బోండా ఉమ,గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్‌బాబు ఉన్నారు.
ప్రతిపక్ష నేతను అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్ రాజకీయం చేస్తున్నారని,గతంలో చంద్రబాబు ఇంటి, బస్సుపై దాడి చేశారని మండిపడ్డారు.టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగితే జగన్ సహా పోలీసులు సమర్థించుకున్నారని అన్నారు.చంద్రబాబు 2500 కిలోమీటర్లు పర్యటిస్తుంటే దారిలో వైసీపీ నేతలను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

మంత్రి కారుమూరి నాగేశ్వర రావు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, దాన్ని నిరసిస్తూ సకల జనుల దీక్ష చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాలు సోదరభావంతో ఒకే కుటుంబంగా ఉంటారని, గ్రామ పంచాయతి అనేక సార్లు ఉత్తమ పంచాయతిగా గుర్తింపు పొందిందని తెలిపారు. అక్కడ మంత్రి కారుమూరి తన రాజకీయ స్వార్ధం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి విమర్శించారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేయాలని PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ యూనివర్సిటీలను కార్పోరేట్ విద్యాసంస్ధలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్ధి సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రికత్తకు దారి తీసింది. విద్యార్ధి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ నీటి విడుదలలో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. డ్యాం నుంచి దిగువ కాలువకు నీటిని విడుదల చేయడంతో పంటలు నీటమునిగాయి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి సమీపంలో దిగువ కాలువ కింద రైతులు దాదాపు వంద ఎకరాల్లో మిరప, పత్తి పంటలు వేశారు. పంటలు ఏపుగా రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. అయితే తుంగభద్ర అధికారులు అనాలోచితంగా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తలలు పట్టుకున్నారు. తమ పంటపొలాలను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు.

ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గవర్నర్ కోరిన అంశాలపై క్లారిటీ ఇచ్చింది. కార్పొరేషన్ కన్నా మెరుగైన జీతాలు ఉంటాయన్న ప్రభుత్వం.. విలీనం తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో.. అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. ఏపీ తరహాలోనే విలీన ప్రక్రియ ఉంటుదని స్పష్టం చేసింది.

పుంగనూరు ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలన సాగిస్తోందన్నారు.చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తుంటే వైసీపీ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.ప్రతిపక్ష నేతపైనే దాడులకు తెగబడుతున్నారంటే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రజలపై రాళ్లు విసరడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ యూనిఫామ్ పక్కన పెట్టి వైసిపి కండువాలు కప్పుకుంటే సరిపోతుందన్నారు. పుంగనూరు, సంఘటనలపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొంగునూరులో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ గౌతు శిరీష ఆధ్వర్యంలో పలాసలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. గౌతు శిరీషతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా గృహనిర్భంధం ఏంటని గౌతు శిరీష మండిపడ్డారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. గాంధీభవన్‌లో పార్లమెంట్ ఇన్‌చార్జీలతో ఆయన సమావేశం అయ్యారు.సాయంత్రం మూడు గంటలకు జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తో భేటీ కానున్నారు కేసీ వేణుగోపాల్.మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గాంధీభవన్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా భారీ ర్యాలీతో గాంధీభవన్ చేరుకోనున్నారు.

భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇరువర్గాల దాడిలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు స్ధానిక దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


