చిట్టి న్యూస్

పల్నాడు జిల్లాలో యువగళం జోష్‌

పల్నాడు జిల్లాలో యువగళం జోష్‌ నెలకొంది. లోకేష్‌ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. సమీప గ్రామాల నుంచి ట్రాక్టర్లపై తరలి వస్తున్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. 

పుంగనూరు పాకిస్ధాన్‌లో లేదు- టీడీపీ

పుంగనూరు నియోజకవర్గం పాకిస్ధాన్‌లో లేదని.. ఏపీలోనే ఉందన్న విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకోవాలని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిందే కాక.. తిరిగి ఇవాళ జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపు నివ్వడం హేయమైన చర్యగా అభివర్ణించారు. త్వరలో పుంగనూరులోని ప్రతి మండలంలో చంద్రబాబు సభ నిర్వహిస్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్న టీడీపీ నేతలు తీర్మానించారు. 

గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతల బృందం

ఏపీ గుండా రాజ్యంగా మారిందన్నారు టీడీపీ నేతలు. పుంగనూరు, తంబళ్లపల్లె దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించిన వీడియో, ఫోటోలను గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందంలో నిమ్మల రామానాయుడు, బోండా ఉమ,గద్దె రామ్మోహన్‌, వర్ల రామయ్య, అశోక్‌బాబు ఉన్నారు.

ప్రతిపక్ష నేతను అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్‌ రాజకీయం చేస్తున్నారని,గతంలో చంద్రబాబు ఇంటి, బస్సుపై దాడి చేశారని మండిపడ్డారు.టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగితే జగన్‌ సహా పోలీసులు సమర్థించుకున్నారని అన్నారు.చంద్రబాబు 2500 కిలోమీటర్లు పర్యటిస్తుంటే దారిలో వైసీపీ నేతలను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.చంద్రబాబును అడ్డుకుంటామన్న వారు యధేచ్చగా తిరుగుతున్నాఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు.డీజీపీ కనీసం తమని కలవడానికి ఇష్టపడడం లేదని గవర్నర్‌కు చెప్పామని తెలిపారు.పెద్దిరెడ్డిని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని..ఎస్పీ రిషాంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు టీడీపీ నేతలు. 

చిత్తూరులో వైసీపీ అరాచకం, బంద్‌ నేపధ్యంలో వీరంగం

చిత్తూరు జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చింది అధికార పార్టీ. ఈ నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. విధులుకు హాజరవుతున్న అమరరాజా ఉద్యోగులపై దాడి చేసి నానా హంగామ చేశారు. ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి టైర్లలో గాలితీసి, అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ కేడర్‌ ఉద్యోగులను బయటకు లాగి విచక్షణ లేకుండా కొట్టారు. అక్కడే పోలీసులు ఉన్నా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మరోవైపు అమర్‌రాజా బస్సుపై వైసీపీ దాడిని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.  

మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి సకల జనుల దీక్ష

మంత్రి కారుమూరి నాగేశ్వర రావు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, దాన్ని నిరసిస్తూ సకల జనుల దీక్ష చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాలు సోదరభావంతో ఒకే కుటుంబంగా ఉంటారని, గ్రామ పంచాయతి అనేక సార్లు ఉత్తమ పంచాయతిగా గుర్తింపు పొందిందని తెలిపారు. అక్కడ మంత్రి కారుమూరి తన రాజకీయ స్వార్ధం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి విమర్శించారు. 

జగన్ రెడ్డికి ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు- లోకేష్‌

జగన్ అండ్‌ కోకు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం నిధులిచ్చినా వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది అని విమర్శించారు. జల్ జీవన్ మిషన్‌ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వనికుంట గ్రామస్థులు లోకేష్ కు వినతి పత్రం అందచేశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఫ్లోరిన్ సమస్య వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.  

ఆర్టీసీ విలీనాన్ని బీజేపీ స్వాగతిస్తోంది : ఈటల

అసెంబ్లీ సమావేశాలు రేపు, ఎల్లుండి జరిగే అవకాశముందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ నీ భ్రమ దేవుడు కూడా కాపాడలేరని చెప్పిన కేసిఆర్..... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

పరిటాల సునీతను అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతపురం మారూరు టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిటాల సునీతను అరెస్ట్ చేశారు పోలీసులు.పుంగనూరు ఘటనపై రాప్తాడులో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీతను మారూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సునీతను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఢిల్లీకి బయలుదేరిన పోలవరం నిర్వాసితులు

పోలవరం నిర్వాసితులు తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి బయలుదేరారు. జంతర్ మంతర్ వద్ద ఈనెల 7న ధర్నాకు పిలుపునిచ్చారు. రాజధానికి పయనమైన నిర్వాసితులను విశాఖ రైల్వేస్టేషన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగారావు కలిసి సంఘీభావం తెలిపారు. రెండో ముసాయిదా ప్రకారం 35 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ కేంద్రం ఆమోదించింది 15 వేల 5వందల కోట్లు మాత్రమే. తమకు తీరని అన్యాయం జరిగిందని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.  

గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

ఇవాళ  రాష్ట్ర గవర్నర్ నజీర్‌తో టీడీపీ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. నిన్న పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న వైసీపీ నేతలు చేసిన దాడులకు సంబంధించి వీడియోలను గవర్నర్‌కు అందజేయనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల ఫోటోలను కూడా గవర్నర్‌కు సమర్పిచనున్నారు. 

అనుమతులు ఉన్నా ఫ్లెక్సీలు తొలంగించాలట

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులున్నా ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రానున్నారు. అగ్రహారం రోడ్‌ ఏపీ సీడ్స్‌ సర్కిల్‌ వద్ద జరిగే రోడ్‌షోతో పాటు బేరివీధి మండపం వద్ద జరిగే పబ్లిక్‌ మీటింగ్‌లో చంద్రబాబు మాట్లాడుతారు. బాబు కార్యక్రమాల కోసం టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా.. మున్సిపల్‌ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. 

వైసీపీ పిలుపిచ్చినా చిత్తూరులో బంద్‌ ప్రభావం లేదు

అధికార వైసీపీ పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా బంద్‌ ప్రభావం చూపలేదు. స్థానిక ఎమ్మెల్యే ధర్నాకు దిగినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు ఉన్నా ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ అధికారుల తీరుపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. రేణిగుంటలోని బాలాజీ రిజర్వాయర్‌ను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తరువాత శ్రీకాళహస్తిలోరోడ్‌ షో, బహిరంగ సభలలో పాల్గొంటారు. 

బిల్లు ఆగింది.. బస్సులూ ఆగాయి


ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్ పెట్టడాన్ని నిరసిస్తూ.. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు. బంద్‌లో భాగంగా డిపోల ముందు ధర్నాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా బీజేపీ వైఖరి ఉందని కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు.గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసనలకు దిగారు. హయత్ నగర్ డిపో ల్లోని బస్సులు బయటికి కదల్లేదు. ఉప్పల్‌ డిపో ముందు ఉదయాన్నే ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. 

గుడిమెట్ల గ్రామస్తుల ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల గ్రామస్తుల ఆందోళన దిగారు.తమ గ్రామానికి నీరు ఇవ్వకుండా ఏ గ్రామానికి నీళ్ళు ఇచ్చేది లేదంటూ RWS స్కీం నిలిపివేశారుగత వారం రోజులుగా మంచి నీరు లేక గ్రామస్తుల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులుతమ గ్రామానికి నీరు ఇచ్చాకే ఇతర గ్రామాలకు నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అశంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నా స్పందించకపోవడంతో RWS స్కీంను అడ్డుకున్నారు గ్రామస్తులు. 

ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

టీఎస్‌ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈనెల 2న ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపించారని.. మూడో తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం మాత్రమే అభ్యర్థించారని తెలిపారు. ఈ బిల్లును పరిశీలించడానికి, లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. దాంతో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్‌ ఆమోదముద్ర వేయడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ను ఆపడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చే యోచన చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అతిక్రమించిన వాలంటర్

ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించిన వాలంటీర్‌.. ఏకంగా బీఎల్‌వో చేతిలో నుంచి ఓటర్ జాబితా లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు సచివాలయం-3 పరిధిలోని దుగినేపల్లి గ్రామంలో బీఎల్‌వో ప్రియాంకతో పాటు టీడీపీ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు.   వాలంటీర్‌ బయ్యారెడ్డి తన ఓటు చూసుకోవాలంటూ బీఎల్‌వో చేతిలోని జాబితాను తీసుకున్నాడు. ఘటనపై తహసీల్దార్‌కు టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.ఆర్డీవోకు నివేదిక పంపుతామని చెప్పారు.  

రాహుల్ కు కోర్టు స్టే.. రేవంత్ హర్షం

రాహుల్‌గాంధీపై పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై...టీ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి. న్యాయమే గెలిచిందంటూ చెప్పారు. ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్లీ విశ్వాసం పెరిగిందన్నారు. ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం....అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడంలాటి దుర్మార్గ చర్యలను జనం సహించలేకపోయారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రజలు రాహుల్‌గాంధీకి అండగా నిలిచారని తెలిపారు. 

చంద్రబాబు, లోకేష్‌  భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ సీరియస్‌

చంద్రబాబు, లోకేష్‌ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌, డీజీపీని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో చాలాసార్లు భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ భద్రత విషయంలో.. జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు టీడీపీ ఎంపీ కనకమేడల. వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ పర్యటనల్లో భద్రతా వైఫల్యంపై నివేదిక పంపాలని ఆదేశించారు.  

మీరు తప్పుకుంటే.. వాళ్ల అంతు మేం చూస్తాం


అన్నమయ్య జిల్లా అంగళ్లులో వైసీపీ బరితెగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు. పెద్దిరెడ్డీ... ఇవాళ్టి నుంచి రోజులు లెక్కపెట్టుకో అంటూ మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైందన్నారు. బాంబులకే భయపడలేదు… నాలుగు రాళ్లు వేస్తే భయపడతానా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు... పోలీసులకు రోషం ఉంటే.. టీడీపీ కార్యకర్తల్ని కాదు.. వైసీపీని అడ్డుకోవాలన్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రావడం మగతనమా?.... మీరు తప్పుకుంటే.. వాళ్ల అంతు మేం చూసుకుంటామని గర్జించారు చంద్రబాబు.   

ఆందోళనకు దిగిన వరద బాధితులు

అల్లూరి జిల్లా కూనవరంలో... ఆందోళనకు దిగారు వరద బాధితులు. కూనవరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గోదావరి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోతే... ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదంటూ మండిపడ్డారు. గిన్నెల దిబ్బ, చేపల బజారులో ఉన్న 50 కుటుంబాలకు చాలీ చాలని నిత్యావసరాలు ఇచ్చారు అధికారులు. కేవలం 4 బంగాళ దుంపలు, 4 ఉల్లిపాయలు, ఓ అరటికాయ ఇచ్చారు. దీంతో ఈ కూరగాయల్ని తిరిగి అధికారులకు ఇచ్చేశారు వరద బాధితులు. 

వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

జగన్ సర్కారు సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నవరత్నాల్లో ఏ ఒక్క రత్నాన్నైనా వందశాతం అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను జగన్ వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40 రోజుల్లో మహాశక్తి ప్రచార యాత్ర కొనసాగుతుందన్నారు.

పల్నాడులో దారుణం; పాతకక్షలతో బాలికపై వైసీపీ నేత దాడి

పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధి దారుణానికి తెగబడ్డాడు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ ఉపసర్పంచ్ నంబూరి కృష్ణమూర్తి ఓ మైనర్ బాలికపై దాడి చేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో పలువురితో కలిసి దారుణంగా హింసించారు. జుట్టుపట్టుకుని రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాడు. బాలికను కర్రతో బలంగా కొట్టి, గుండెలపై తన్నడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యం అసెంబ్లీ ముట్టడికి యత్నం

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెకెండ్ ఏఎన్ఎంలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతలవారిగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ కు తమ బాధ చెప్పుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. 15ఏళ్లుగా సెకెండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్నామని తమను తక్షణమే క్రమబద్ధీకరించాల్నారు. 

జైపూర్ రైల్వే కాల్పుల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా కేటీఆర్

ఇటీవల జైపూర్ రైల్లో కాల్పుల్లో మృతి చెందిన సైఫూద్దీన్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే ఒవైసీ కోరారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఒవైపీ విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Tirupati: ఎస్వీయూలో రోడ్ల విస్తరణపై విద్యార్ధుల ఆందోళన

తిరుపతి ఎస్‌వీయూలో రోడ్ల విస్తరణపై వివాదం కొనసాగుతుంది. ప్రశాంతతను దెబ్బతీసే, పర్యావరణాన్ని కలుషితం చేసేలా వ్యవహరిస్తే ప్రాణాలర్పించైనా రోడ్డును అడ్డుకుంటామని విద్యార్ధులు అంటున్నారు. విద్యార్ధులకు సంఘీభావంగా గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైయ్యారు బీజేపీ నేతలు. మరోవైపు ఎస్వీయూలో సమావేశమైన పూర్వ విద్యార్థులు రోడ్ల విస్తరణ ఆపాలంటూ సంతకాల సేకరించారు. విద్యార్ధుల ఆందోళన ఉదృతం కావడంతో వైస్‌ఛాన్స్‌లర్‌ వెనక్కి తగ్గారు SVUలో రోడ్ల విస్తరణ అవసరం లేదని ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కు చుక్కెదురు

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కునిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తోటపాలేం గ్రామంలో గడపగడపు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరయ్యారు. తోటపాలెం గ్రామంలో మంచి నీటి కులాయిలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధలేదని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి చేసిన అభివృద్ధి శూన్యం అంటూ ఎమ్మెల్యే కిరణ్ ను అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా కనిపించకుండా పోయి ఇప్పుడెందుకు వచ్చారు అంటూ మండిపడ్డారు. ఉపాధి హామీ పనులు కూడా తీసేసి తమ పొట్టలు కొట్టారని ఎమ్మెల్యే కిరణ్‌పై తోటపాలెం గ్రామ మహిళలు మండిపడ్డారు.

విజయనగరంలో గ్రీన్ అంబాసిడర్ల ఆందోళన

విజయనగరంలో గ్రీన్ అంబాసిడర్లు ఆందోళనకు దిగారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.అయితే తాము నిరసన చేస్తున్నా అధికారులు పట్టించుకు పోవడంతో కలెక్టరేట్ లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు.గ్రీన్ అంబాసిడర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు,గ్రీన్ అంబాసిడర్లుకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.నెలలు తరబడి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని,తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులు నుండి వైదొలుగుతామని హెచ్చరించారు. జీతం అందక గత నెలలో బొబ్బిలికి చెందిన గ్రీన్ అంబాసిడర్ ఆత్మహత్య చేసుకున్నాడు.  

శాసనసభ నిర్వహణపై భట్టి  అసహనం

శాసన సభ నిర్వహణపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులో చెప్పడం లేదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని అన్నారు. లఘు చర్చ అని అర్ధరాత్రి పంపించి.. పొద్దున్నే చర్చ అంటే ఎలా..? ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీ తరుపున లఘు చర్చలకు కొన్ని అంశాలను ఇచ్చామని అయితే ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు.గత ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆస్తులు సృష్టిస్తే.. ప్రస్తుత సర్కార్‌ వాటిని అమ్మేస్తున్నారని అసైన్డ్ భూములు గుంజుకొని అమ్మేస్తున్నారని మండిపడ్డారు భట్టి. 

Yadadri: హత్య చేసి నగదు ఎత్తుకెళ్లారు

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి ఎనిమిది లక్షల రూపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. మృతుడు సూర్యాపేటకు చెందిన వారణాసి లింగయ్యగా గుర్తించారు. వరి నాట్లు వేసే గుత్తేదారు అయిన లింగయ్యను డబ్బుల కోసమే హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనాస్ధలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

తెలంగాణలో వైద్య విప్లవం


తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోందని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత 26 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామని హరీష్ రావు అన్నారు.

మన ఓట్లు అనుకుంటే ఓకే... కాదంటే అబ్జెక్షన్

ఏపీ మంత్రి అప్పలరాజు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మన ఓట్లు అనుకుంటే ఓకే..కాదంటే అబ్జెక్షన్ చేయండి అంటూ కార్యకర్తలకు సూచించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. వైసీపీకి ఓట్లు వేయకున్నా,లేదా పార్టీ మీటింగ్‌లకు రాకున్నా అబ్జెక్షన్ తెలపాలని, ఫాం నెంబర్ 7 కి ఫిర్యాదు అంటూ పార్టీ నాయకులకు మంత్రి దిశానిర్థేశం చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్. దుర్గం చిన్నయ్య అన్యాయం చేశాడని పోరాటం చేస్తున్న తనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో మహిళల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గొంతెత్తున్నారని సొంత రాష్ట్రంలో సొంత ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం మణిపూర్ మహిళలకే హక్కులున్నాయా? తనకు హక్కులు లేవా అంటూ ప్రశ్నించారు.

దోపిడీ కోసమే కొత్త కాలువలు

దోపిడీ కోసమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న కాలువను నిర్వీర్యం చేసి కొత్త కాల్వ తవ్వకాలని డ్రామాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గంలో నాయిని చెరువు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.   నిర్వాసిత రైతులతోనూ మాట్లాడారు. పులివెందుల చక్రాయపేట నుంచి తంబళ్ళ పల్లికి నీటి తరలింపు పేరుతో పెద్దిరెడ్డికి 5036కోట్ల అనుమతులు మంజూరు చేశారన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ దోపిడీకి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు.

శ్రీధర్‌బాబు, కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం

శాసనసభలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మంత్రి కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది.వరదలు, పంట నష్టంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీధర్‌బాబురైతులను పట్టించుకోరా అంటూ..మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. అయితే శ్రీధర్‌బాబు ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు కేటీఆర్‌.రైతుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని 3 గంటలే కరెంటు చాలన్న వాళ్లా మమ్మల్ని ప్రశ్నించేది అంటూ ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్‌ నీతులు చెబితే వినే పరిస్థితుల్లో లేమని,రైతుల విషయంలో అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. వరదల విషయంలో బట్టకాల్చి మీదపడేస్తున్నారని..రెండుసార్లు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌ దేనని అన్నారు కేటీఆర్‌. 

ఆర్టీసీ విలీనం.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గవర్నర్ సమ్మతి కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనకు పంపింది. అయితే రెండ్రోజులైనా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గవర్నర్ సమ్మతి కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి

తెలంగాణ అసెంబ్లీను ముట్టడించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకార నేతలు, కార్యకర్తలు. ఆ పార్టీ మత్య్సకార ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ నేతృత్వంలో ఈ ముట్టడి జరిగింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలంంటూ డిమాండ్ చేశారు. ఏకంగా అసెంబ్లీ గేటు వరకు దూసుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.