- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతి పెరగడంతో బీబీనగర్ మండలం రుద్రవెల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతున్న కారణంగా పోలీసులు భారీ కేట్లను ఏర్పాటు చేసి ప్రజలను వాగు దాటవద్దని హెచ్చరించారు ఉధృతి పెరగడంతో ప్రజలు మరియు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నోరోజులుగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు నాయకులు చెప్పినా, సంవత్సరాలు గడుస్తున్నా బ్రిడ్జి నూతన నిర్మాణం జరగడం లేదని ప్రజలు అంటున్నారు, వాగు ఉధృతి తగ్గే వరకు బీబీనగర్ మండలం రుద్రవెల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. తనను దూషించినట్టు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనపై అసభ్య పదజాలంతో దండెత్తారని ఆరోపణలు కురిపించారు. తనను చంపేస్తానంటూ ఇతర ఎంపీల ఎదుటే సత్యనారాయణ బెదిరించారని రఘురామకృష్ణరాజు చెప్పారు. మాటల్లో చెప్పడానికి వీల్లేని భాషలో దూషణలకు దిగారన్నారు. ఈ పరిస్థితిని గమనించి సత్యనారాయణను.. వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి బయటకు తీసుకెళ్లారని తెలిపారు.
విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వశాఖకు గతంలో లేఖ రాశానని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఎవరినడిగి లేఖ రాశావంటూ సత్యనారాయణ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆరోపించారు. ఎంవీవీ తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. గతంలోనూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తనను చంపేస్తానని బెదిరించినట్టు లోక్‌సభ స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు.

గత రెండు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా, మెదక్ జిల్లా వన దుర్గ ప్రాజెక్టకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారి దర్శనాన్ని నిలిపివేసారు అధికారులు. నీటి ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నందున్న భక్తులకు అమ్మవారి గర్భాలయ దర్శనం నిలిపివేసి నట్లు, తెలిపారు ఆలయ ఈవో సారా శ్రీనివాస్. భక్తులను అమ్మవారిని రాజగోపురంలో దర్శనం చేసుకోవాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అధికారులు సూచించిన చోటే స్నానమాచరించాలని భక్తులను కోరారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భీకర వర్షం పడుతుంది. భోదాపురం వద్ద జిన్నెల వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో సీతారాంపురం గిరిజన పల్లెల్ని వరదలు చుట్టుముట్టాయి. వాగు దాటే పరిస్థితి లేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములకు విరోచనాలు, వాంతులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో అన్న చనిపోయాడు. తమ్ముడు కురుసం లక్ష్మయ్యది అదే పరిస్థితి కావడంతో డోలీలో అతడిని అతికష్టంమీద జిన్నెల వాగును దాటించారు. ప్రస్తుతం లక్ష్మయ్య వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో పెట్రోల్ ధర 111 రూపాయల 87 పైసలు కాగా.. డీజిల్ ధర 99 రూపాయల 61 పైసలుగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ ధర ఎక్కువ కాగా.. డీజిల్ ధరల్లో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరల్ని అమరావతి కేంద్రంగానే సేకరించినట్లు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌పై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ, టీడీపీతో కలిసి పవన్ వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారన్నారు. గతంతో ప్యాకేజీని పవన్ పాచిపోయిన లడ్డుతో పోల్చారని విమర్శించారు. బీజేపీ విభజన హామీలను సైతం అమలు చేయడం లేదన్నారు. క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అని ఎద్దేవా చేసారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చినా 3లక్షల కోట్లు వస్తాయని, కేవలం 30వేల కోట్లకే ఆదానికి ఇచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్‌లో నారాయణ విద్యాసంస్థలు గోల్డ్ మెడల్ సాధించాయి. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ 2023లో భారత విద్యార్థులకు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించారు. ఇందులో నారాయణ విద్యాసంస్థలు ఒక గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ నుండి ఐదుగురు విద్యార్థులు హాజరవగా అందరు విద్యార్థులు పతకాలు సాధించారు. మెడల్ సంపాదించుకున్న విద్యార్థి మహల్, వారి తల్లిదండ్రులకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, డాక్టర్ శరణి నారాయణలు అభినందనలు తెలిపారు.

విభజన హామీలను అమలు చేయాలని తిరుపతిలో ప్రత్యేకహోదా జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళనకుదిగింది. ఆర్డీవో కార్యాయలం ఎదుట దీక్ష చేపట్టింది. ప్రత్యేకహోదా, రాజధాని అమరావతి, పోలవరం, రైల్వే జోన్ సహా పలు అంశాలపై జగన్ ప్రఱదభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని కమిటీ నేతలు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రత్నం అందిస్తారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా ఆత్మగౌరవ దినోత్సవం రోజున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహిళా ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు. దీక్షకు సంబంధించి పోస్టర్‌ను తెలుగు మహిళలతో కలిసి విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మహిళా ఆత్మగౌరవ దీక్షకు అన్ని పార్టీల నాయకులను, మహిళలను ఆహ్వానిస్తున్నట్లు అనిత తెలిపారు. దీక్ష తర్వాత మహిళా ఆత్మగౌర పోరాట కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. మహిళలపై ఎన్నడూ లేని విధంగా దారుణాలు జరుగుతుంటే డీజీపీ ప్రశాంతంగా ఉందని స్టేట్మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా ఆధిపత్యపోరు రచ్చకెక్కింది. ఒకే కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వేర్వేరుగా హాజరవుతున్నారు. తాజాగా ఎస్.కోట మండలం మూలబొడ్డవర గ్రామంలో జరిగిన సురక్ష శిబిరానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విడివిడిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ వచ్చి వెళ్లిన తర్వాత అదే కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇద్దరి తీరుతో అధికారికి కార్యక్రమాలకు రావడానికి వైసీపీ నేతలు ఇష్టపడడం లేదు. దీంతో గ్రామస్థాయి సభలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు, సౌత్ సెంట్రల్ జీఎం అరుణ్ కుమార్ జైన్. రైల్వే స్టేషన్‌లో వసతులు సరిగా లేవని స్థానికులు అరుణ్ కుమార్ దృష్టికి తీసుకు రావడంతో, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైల్వే అధికారులకు సమస్యలను వివరించి, వినతి పత్రాన్ని అందించారు భువనగిరి మున్సిపల్ చైర్మన్. త్వరలో ఎంఎంటీఎస్ రానుందని, అందుకోసం స్థలం పరిశీలన జరుతుందన్నారు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.

కుండపోత వానలు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. భద్రాద్రి వద్ద ప్రమాదకరస్థాయికి చేరింది. ప్రస్తుతం 43 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రేపు 48 అడుగులు దాటే అవకాశం ఉందని రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అంచనా వేస్తున్నారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కొత్తగూడెం జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

అనంతపురం ఎస్‌కేయూలో వైఎస్ విగ్రహ ఏర్పాటుకు వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వీసీ రామకృష్ణారెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వర్సిటీల్లో నేతల విగ్రహాలు పెట్టడం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన త్యాగమూర్తులు విగ్రహాలు పెట్టకుండా వైఎస్‌ఆర్ విగ్రహం పెట్టడం సమంజసం కాదన్నారు. వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలన్నారు. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని కట్టారు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితా ఇవ్వడానికి సమస్యేంటని ప్రశ్నించారు. సీఎం ఒక మోనార్క్ అంటూఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిజేస్తున్న తమ నేతలను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే బీజేపీ బాట సింగారం డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన కార్యక్రమం చేపట్టిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రి వర్షంలో రోడ్డుపై కూర్చోవడం సరికాదన్నారాయన. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలో రాజకీయం తగదన్నారు. బీజేపీ పేదలపై ప్రేమ ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు తలసాని.

కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే..బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. కేంద్ర నిధుల వాటాను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భారత పౌరుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించే అధికారం ఉందని అన్నారు. తాము ముందే పోలీసులకు సమాచారం అందించామని.. కానీ పోలీసులే అనసరంగా అడ్డుకున్నారని అన్నారు. డబుల్ బెడ్ ఇళ్లు గొప్పగా నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులు ఎందుకని అన్నారు. ఇదేమైనా ఉద్యమమా.. లేక తిరుగుబాటా అని ప్రశ్నించిన ఆయన హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు..బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు.

కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఆళ్లపల్లి, గుండాల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్యులకు చేరింది. వరద ఉద్ధృతి మరింత పెరిగితే కిన్నెరసాని డ్యాం అధికారులు గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వినుగొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణం తీసుకున్నారంటూ ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై సమాధానం చెప్పాలంటూ బొల్లాకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వార్తల్ని ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు బొల్లా బ్రహ్మానాయుడు. ఇలాంటి ఆరోపణలుతో తన కుటుంబం బాధపడిందన్నారు. తనాఖా పెట్టిన బ్యాంకులో తనకు కనీసం అకౌంట్ కూడా లేదన్నారు.

బీఆర్‌ఎస్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రోజు యుద్ధం మొదలైందని,యుద్ధాన్ని వాళ్లే మొదలు పెట్టారని అన్నారు. యుద్ధానికి మేం సిద్ధమేనని అన్నారు. తెలంగాణ ప్రజల అండదండలతో బీఆర్ఎస్‌తో యుద్ధం చేస్తామన్నారు. చేతగాని, అసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్న కిషన్‌రెడ్డి పోరాటాలతోనే మా రాజకీయ ప్రస్థానం మొదలైందని అన్నారు. తాను ఢిల్లీ నుంచి వస్తే ఎయిర్‌పోర్ట్ వద్దే అడ్డుకుంటారని, నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ప్రశ్నించారు. ప్రజల బాగోగులు చూడానికి వెళ్లాలనుకుంటే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై భక్తుల సౌకర్యార్ధం ఆలయ ఆవరణలో మండపాలు ఏర్పాటు చేయకపోవడంతో దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. విశ్వశివులతో నిర్మించిన ఆలయ మండపాల నుంచి వర్షపు నీరు లీక్ అవుతున్నాయి. లీకేజీ వాటర్ తో స్వామి వారి ప్రసాద తయారీ కేంద్రంలోకి నీరు చేరుకుంది. నీరు నిలవడంతో కొద్ది సేపు ప్రసాద కౌంటర్‌ను మూసివేశారు. అనంతరం సిబ్బందితో వర్షపు నీటిని తొలగించారు. అనంతరం ప్రసాద తయారీని ప్రారంభించారు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలసలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. నాలుగేళ్లుగా.. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో వెళ్లాలంటే.. భయపడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతులతో ఈ మార్గం అస్తవ్యస్థంగా తయారైందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తానన్న సీఎం జగన్ హామీ హామీగానే మిలిగిపోయిందన్నారు. ఈ మార్గంలో వెళ్లేందుకు పిల్లలు, గర్బిణీలు తీవ్ర అవస్తలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా ఆదాయార్జన చేసేలా విజయవాడలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ నిర్వహించారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. వెయ్యి మంది యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. సెల్ ఫోన్ ద్వారా ఎలా సంపాదించుకోవచ్చో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు హాయంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాలు తిరిగి చేపడతామన్నారు కేశినేని చిన్ని.

ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ నాన్‌స్టాప్‌గా వానలు దంచుతున్నాయి. మరోవైపు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. దాంతో, ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. విశాఖ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు బెంబేలెత్తిస్తున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శబరి గోదావరి సంగమంలో రెండు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. వీఆర్ పురం మండలం అన్నవరం వాగు పొంగడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం వద్ద గోదావరి నది, చింతూరు వద్ద శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఆయన హోళగుంద మండలం ఇంగళదాళ్ కు వెళ్లారు. అయితే.. ఎక్కడికక్కడ ఆయన్ను నిలదీశారు మహిళలు. నాలుగేళ్లుగా గ్రామానికి ఏం చేశావంటూ ప్రశ్నించారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు లేవంటూ మండిపడ్డారు మహిళలు. మంత్రి అయ్యాక తమ గ్రామానికే రాలేదని, ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే ఎప్పటిలాగానే మంత్రి నిధులు కేటాయించాం, పనులు ప్రారంభిస్తాంటూ అక్కడనుంచి జారుకున్నారు.

భధ్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో పట్టణంలో బ్యాక్ వాటర్ భారీగా చేరుకుంది. రామాలయం తూర్పు మెట్ల వద్ద, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరుతోంది. ఈ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో విస్టా కాంప్లెక్స్‌లో చిరు వ్యాపారుల దుకాణాలు నీట మునిగాయి. దీంతో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్‌ను గోదావరిలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే బ్యాక్ వాటర్ ఎత్తిపోసే మోటార్లు మొరాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్థానికులు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. కాకర్లపల్లి ఊర చెరువు వర్షంతో అలుగు పారుతోంది. బేతపల్లి పెద్ద చెరువు పూర్తి సామర్ధ్యానికి చేరుకుంది. లంకసాగర్ ప్రాజెక్టులోనూ భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వీఎం బంజర్ బస్టాండ్ ప్రాంగణంలోనూ, రింగ్ సెంటర్‌లోనూ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జీవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురువనున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సిద్ధిపేట జిల్లా చేర్యాల, దూల్మిట్ట, కొమురవెళ్లి మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద బ్రిడ్జ్‌పై నుంచి మోహి తుమ్మెద వాగు ప్రవహిస్తోంది. దీంతో వరంగల్- సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానేపల్లి మండలం గూడెం- అహేరీ అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో పోలీసు కానిస్టేబుల్‌తో సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఇస్కాన్ వంతెనపై అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాన్ని చూసేందుకు కొందరు అక్కడ గుమిగూడారు. అదే సమయానికి ప్రమాదస్థలంలో ఉన్న వ్యక్తుల మీదకు గంటకు 160కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు దూసుకెళ్లింది. దీంతో 9 మంది మృతి చెందారు, 12 మందికి గాయాలు అయ్యాయి.

గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు, టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము. నిరుద్యోగ రహిత గుడివాడే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించామన్నారు వెనిగండ్ల రాము. జాబ్ మేళా ద్వారా నియోజకవర్గంలో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. సమాజ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు వెనిగండ్ల రాము. ప్రస్తుత పాలనలో స్ధానికంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సహకారంతో, గుడివాడలోనే స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు వెనిగండ్ల రాము.

కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ, నిధులు లేని జీవోను ఇచ్చారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్. నాలుగేళ్లుగా హంద్రీనీవా ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు కదల లేదని ధ్వజమెత్తారు. ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి కానీ, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం, వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కుప్పం నియోజకవర్గానికి, మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డికి సంబధమే లేదని, కుప్పం ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఎవరు స్దానికులో ఎవరు నాన్ లోకలో తేల్చుకోవాలని, మంత్రి పెద్దారెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ శ్రీకాంత్.

తిరుపతిలో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌లో తిరుపతి- తిరువనంతపురం ట్రైన్ చివరి బోగీ పట్టాలు తప్పింది. రైలుకు ప్రయాణికులు లేని బోగీని అటాచ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించారు.. బోగీని పట్టాల పైకి ఎక్కించారు.

కేసీఆర్‌కు పోయేకాలం దగ్గరపడిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. జాతీయస్థాయిలో కేసీఆర్ పరిస్థితి ఎటుకాకుండాపోయిందన్నారు. ఎవరిమద్దతులేక కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయారని సెటైర్లువేశారు. స్థాయిని మరిచి ఎగిరిపడితే ఇట్లానే ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో ఏకూటమో కేసీఆర్ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. పాలించే సత్తాలేక జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ ఊరేగుతున్నారని విమర్శించారు.

మెదక్ జిల్లా హవేళీ ఘన్‌పూర్ మండలంలోని చౌట్లపల్లిలో, కూలీలతో కలిసి వరినాట్లు వేసారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. మహిళా రైతుల కష్టాలను అడిగితెలుసుకున్నారు. రైతు బంధు, కరెంటు సమస్యలపై ఆరా తీసారు పద్మాదేవేందర్ రెడ్డి. వరినాట్లు వేస్తూ మహిళలు పాటలు పాడగా, వారితో కలిపి గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేయండం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విశాఖలో తెలుగు మహిళలు ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలకు నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


