చిట్టి న్యూస్

వివేకా హత్య కేసుపై జగన్‌  స్పందించాలి : సీపీఐ రామకృష్ణ

వైఎస్‌ వివేకా హత్య కేసుపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.. నాలుగేళ్ల తర్వాత సీబీఐ వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసిందన్నారు.. పదేపదే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాను ప్రాధేయపడటంతోనే కేసు నెమ్మదించిందన్నారు.. ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పిన మాటలను సీపీఐ రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మామిడి పండ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి

హైదరాబాద్‌లో మామిడి పండ్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో వంద నుంచి రెండు వందలు పలుకుతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మామిడి దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. గతేడాది కిలో 50 రూపాయల లోపే ఉండే ధరలు.. ఈసారి సెంచరీ దాటేశాయి. ఇక.. పండ్ల మార్కెట్‌ నగర శివారులోని బాటసింగారానికి వెళ్లడం.. ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు పెరిగి.. సామాన్యుడు మామిడి పండ్లు తినే పరిస్థితి లేకుండా పోయింది. 

అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల దగ్గరలోని కొట్టాయం దగ్గర ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మో దీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం విమా న ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. త ద్వారా మధ్యతరగతి వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొం దగలరంటూ కిషన్ రెడ్డి వివరించారు. దాదాపు 150 ఆపరేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. వాటిలో సగం 2014 తర్వాత ప్రారంభించినట్లు తెలిపారు.

నిజామాబాద్ ఆస్పత్రిలో వీల్‌ఛైర్స్‌ కొరత లేదు


నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఘటన బాధాకరమన్నారు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్‌ను తమ సిబ్బంది వీల్‌ఛైర్‌లో వెయిటింగ్‌ ఏరియాలో కూర్చోబెట్టారని చెప్పారు. పది నిమిషాల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులు లాక్కెళ్లారని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో వీల్‌ఛైర్స్‌, స్ట్రెచర్స్‌ కొరత లేదని పేర్కొన్నారు. వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని.. దీని వల్ల సిబ్బంది, వైద్యుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందంటున్నారు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌.

తల్లి పాలే బిడ్డకు ఆహారం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తల్లి పాలే బిడ్డకు ఆహారం, అమృతం, వైద్యం లాంటివి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమన్నారు. హైదరాబాద్‌ అంబ ర్‌పేట్‌ నియోజకవర్గంలోని బాగ్‌ అంబర్‌పేటలో హెల్తీ బేబీ షో కార్యక్రమంలో పా ల్గొన్నారు. దేశంలోని ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో హెల్తీ బేబీషో కార్యక్ర మం నిర్వ హించాలని మోదీ ఆదేశించినట్లు చెప్పారు. 3 నుంచి 13 నెలల పసి పిల్లలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భేటీ బచావ్‌ భేటీ పఢావ్‌లో భాగంగా బాలికల ఆరోగ్యంతోపాటు భ్రుణహత్యలను తగ్గించారని.. దీంతో మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల సగటు పెరిగిందని వెల్లడించారు.

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిపై యరపతినేని ఫైర్

పిడుగురాళ్ల బైపాస్‌ రోడ్డు ఆలస్యం కావడానికి అధికార పార్టీనే ప్రధాన కారణమని ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు. రియల్‌ ఎస్టేట్‌ కోసమే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిడుగురాళ్ల బైపాస్‌ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. దీనిపై నిరసన తెలపడం హాస్యాస్పదమన్నారు. ఈ రోడ్డు ఆలస్యమవడానికి అధికార పార్టీనే కారణమని సవాల్‌ విసిరానని.. త్వరలో అన్ని వివరాలు సాక్ష్యాధారలతో బయటపెడతానంటున్నారు యరపతినేని శ్రీనివాసరావు.

వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి : ధూళిపాళ్ల

ఏపీలో ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర. రంజాన్‌ సందర్భంగా పొన్నూరులో ఆయన ముస్లింలకు రంజాన్‌ తోఫా కానుకలు అందజేశారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ధూళిపాళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇమామ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాలు నిలిపేశారని.. మైనార్టీలపై దాడుల కారణంగా కర్నూలులో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసిందన్నారు.

ఈనెల 19, 20, 21వ తేదీల్లో ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈనెల 19, 20, 21వ తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు మార్కాపురంలోనే ఉండనున్నారు. ఇక.. 20వ తేదీన మార్కాపురంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు పార్టీ నేతలు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, టీడీపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఏర్పాట్లు పరిశీలించారు. మొన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు విజయవంతమైంది. రోడ్‌షోలు, రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. 

అజ్ఞాతం వీడిన ఎంపీ అవినాష్‌ రెడ్డి

అజ్ఞాతం వీడిన ఎంపీ అవినాష్‌ రెడ్డి .. పులివెందులకు చేరుకున్నారు. తండ్రి భాస్కర్‌ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి పులివెందుల లోని తన నివాసానికి వచ్చారు. ఉదయం భాస్కర్‌ రెడ్డి అరెస్ట్ సందర్భంగా.. సీబీఐ అధికారులు ఇచ్చిన అరెస్ట్‌ మెమోను.. అవినాష్ రెడ్డికి ఆయన తల్లి లక్ష్మి చూపించారు. రేపు ఉదయం అవినాష్‌ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.

Karnataka: జగదీష్‌ శెట్టార్‌ బీజేపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా

కర్ణాటక సీనియర్‌ బీజేపీ నేత, ఎమ్మెల్యే జగదీష్‌ శెట్టార్‌ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డేతో భేటీ అయిన ఆయన.. తన రాజీనామా సమర్పించారు. కర్ణాటకలోని సర్సి అసెంబ్లీ నుంచి శెట్టార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో విపక్ష నేత జగదీశ్‌ ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని నిర్మించిన తనకు MLA టికెట్‌ కూడా లభించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.

మొదలైన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌

వరంగల్‌లో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ మొదలైంది. కేయూ జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ జరగనుంది. ఈ ప్రదర్శనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు పేపర్‌ లీక్‌ కేసులో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.

బొత్స సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు

ఏపీ విపక్ష పార్టీలపై మంత్రి బొత్స సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అఖి లపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదన్నారు. స్టీల్‌ ప్లాం ట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ సర్కార్‌ వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్‌ను చూసి స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు బొత్స. కోడికత్తి కేసుకు సంబంధించి NIA రిపోర్ట్‌ను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు ఉపయోగం లేని ప్రభుత్వం జగన్‌ సర్కారేదే

ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది జగన్‌ సర్కారేనన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. జగన్‌కు చెందిన స్టిక్కర్లను ఇళ్లకు అంటిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు.

ఏడాది చివరికే నానీ సినిమా ...!

దసరా సినిమా సక్సెస్ తో మాంచి ఊపు మీదు ఉన్న నేచురల్ స్టార్ నానీ, తన ౩౦వ సినిమాతో మళ్లీ ఈ ఏడాది చివరిలోనే కలుస్తానంటూ కబురందించాడు. వైరా ఎంటర్టైర్మెంట్స్ పతాకంపై శౌర్యా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నానీకి జోడీగా మన అందాల సీత మృణాల్ ఠాకుర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల ో నానీ ఓ ఎనిమిదేళ్ల చిన్నారికి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది. మరి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న నానీ౩౦ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూాడాలి. 



దుబాయ్ లో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023`

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023`వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఇందులో భాగంగా శుక్ర‌వారం డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , టీమా ప్రెసిడెంట్‌, మిస్ ఏసియా ర‌ష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని క‌లిశారు. జులై నెలాఖ‌రు కానీ అగ‌స్టు మొద‌టి వారంలో కానీ అవార్డ్స్ వేడుక నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ అబు స‌లీం ప్ర‌తి ఏడాది దుబాయ్ లో నంది అవార్డ్స్ జ‌రపడానికి స‌హ‌క‌రిస్తామ‌ని మాటిచ్చారు. దుబాయ్ ప్రిన్స్, కేర‌ళ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రుల‌ను, బాలీవుడ్ నుంచి జాకీష‌రాఫ్‌, జితేంద్ర గారిని నంది అవార్డ్స్ కోసం ఆహ్యానిస్తున్నట్లు రామకృష్ణ గౌడ్ తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్‌ కేసుపై రౌస్‌ ఎవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్‌ కేసుపై రౌస్‌ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24 నుంచి వాదనలు వినబోతోంది. మరోవైపు ఈనెల 6న రెండో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌లో మాగుంట రాఘవ, రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రాపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. ఇక ఇవాళ మాగుంట రాఘవ బెయిల్‌పై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది.

Yuvagalam : లోకేష్‌పై వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు

గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నారా లోకేష్‌పై వైసీపీ సోషల్ మీడియా, సాక్షిలో అసత్య ప్రచారాలు చేసారని ఫిర్యాదు చేశారు. తమ యువనేత అనని మాటలను అన్నట్లుగా మార్ఫింగ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ఛానల్ అసత్య ప్రచారాలు మానుకోకపోతే.. రాబోయే రోజుల్లో ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు హెచ్చరించారు.

They Call Him OG: షూటింగ్ మొదలు
పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం దే కాల్ హిమ్ ఓజీ. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుని లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ రోజే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సందర్భంగా విడుదల లాంచింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాలుపంచుకుంటారని తెలుస్తోంది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. 
Ustad Bhagat Singh: మొదటి షెడ్యూల్ పూర్తి

గబ్బర్ సింగ్ తరువాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మరోసారి కలసి పనిచేస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయితే కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో పూర్తైంది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. 

నారా లోకేష్ పై వైసీపీ విష ప్రచారం

నారా లోకేష్ అనని మాటలను అన్నట్లుగా వైసీపీ విషప్రచారం చేస్తోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షడు ఎమ్మెస్ రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలతో కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు ప్రజలందరికీ తెలుసని.. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ అసత్య ప్రచారాలను దళితులు నమ్మకండని తెలిపారు. దళితుల సంక్షేమంపై వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

AP : సత్యసాయి నామస్మరణలో ప్రశాంతి నిలయం

సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం పులకించి పోయింది. కేరళ నూతన సంవత్సర సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. వేలాది మంది మలయాళ భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధిని మలయాళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో అలంకరించారు. అనంతరం కేరళ భక్తుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కుల్వంత్‌ మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ భక్త బృందం సభ్యులు నిర్వహించిన కచేరీ అలరించింది.

విజయవాడలో మండుతున్న ఎండలు

విజయవాడలో ఎండలు మండుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓవైపు సూర్యుడి వేడి.. మరోవైపు వడగాలులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఉపశమనం పొందేందుకు శీతలపానీయ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.

Vimanam: హృద్యమైన కథ

మరో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రముఖ నటుడు సముత్తిరఖని. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కిన విమానం సినిమాతో దివ్యాంగుడిగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రోమో విడుదలవ్వగా,అత్యంత ఆసక్తిని రెకెతిస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ తో పాటూ, అనసూయా భరద్వాజ్ కూడా నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సమర్ఫణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్ గా వ్యవహరించబోతున్నారు. 


 

తిరుపతిలో దంచికొడుతున్న ఎండలు

తిరుపతిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోజురోజుకీ ఎండలు పెరగడంతో వడదెబ్బకు ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఉదయం 9 తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు.  

జూన్‌ 15వరకు  చేపల వేట నిషేధం

విశాఖలో చేపల వేటను జూన్‌ 15వ తేదీ వరకు నిషేధించారు. కన్జర్వేషన్‌ పీరి యడ్‌లో భాగంగా మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు నెలల పాటు మత్స్యకారులు ఉపాధికి దూరం కానున్నారు. అయితే రాబోయే సీజన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు లక్షల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు బోటు యజమానులు. 

3వ స్థానంలో క్రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ఫ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న మన శ్రీవల్లి నేషనల్ లెవెల్ లో మరో రికార్డ్ నెలకొల్పింది. ఐఎండీబీ వెబ్ సైట్ ర్యాంకింగ్స్ లో దేశవ్యాప్తంగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాప్యులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది రష్మిక.  
Cinema: ఊహలో తేలాల అంటోన్న కొత్త జంట

అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల, సీనియర్ జర్నలిస్ట్స్ ప్రభు, సుబ్బారావు వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరై.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.


మాకు నమ్మకం లేదు జగన్ అంటూ నినాదాలు

గుంటూరు జిల్లాలో జగన్ స్టిక్కర్లపై తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి ఆధ్వర్యంలో ప్రజలు, యువత నిరసన తెలిపారు. మాకు నమ్మకం లేదు జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇళ్లకు స్టిక్కర్లు వేయించుకోకపోతే వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్‌ను ఎట్ల నమ్మాలంటూ ప్రశ్నించారు.

ప్రాంతీయ భాషల్లోనే కానిస్టేబుల్ పరీక్షలు : కేంద్ర హోంశాఖ

కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర భద్రతా దళాల కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇకపై తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి వరకు కేవలం హిందీ, ఇంగ్లీష్‌లోనే పరీక్షల నిర్వహణ ఉండేది. 2024 జనవరి నుండి ఇంగ్లీష్, హిందీతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. కేంద్ర భద్రతా బలగాల కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని ఇటీవలే కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

నల్లగొండలో  20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు వరిధాన్యం పోటెత్తుతోంది. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 12 లక్షల ఎకరాల్లో ఏకంగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి అవుతోంది. అయితే గత మూడు వారాలుగా ఐకేపీ కేంద్రాల్లో మాత్రం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు నేపథ్యంలో వరిధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

Suryapet: అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ లోకేష్ దాడి చేసాడని స్థానిక కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి జైబీమ్ అంటే ఏమిటని అక్కడికి వచ్చిన కళాకారులను అడిగే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ లోకేష్‌.. కాంగ్రెస్ ఎంపీటీసీని పక్కకు తీసుకెళ్లారు. కాసేపటికే శ్రీనివాసరెడ్డి కుడి కన్నుపై తీవ్ర గాయంతో సభ ముందుకు వచ్చారు. తనపై ఎస్ఐ దాడి చేసారని ఆరోపించారు. దాంతో శ్రీనివాసరెడ్డి వర్గం ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, సీఐ వీరరాఘవులను అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు ఎంపీటీసీకి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆందోళన విరమించారు. ఎస్ఐ మాత్రం తాను ఎవ్వరిపైనా చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు.



Jagan Stickers: జగన్‌ స్టిక్కర్లపై జనంలో తిరుగుబాటు

జగన్‌ స్టిక్కర్లపై జనం తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నారు.తల్లిని, చెల్లిని నమ్మలేని వాడు..ప్రజలకేం చేస్తాడంటున్నారు. వైసీపీ సర్కార్‌ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నువ్వే మా నమ్మకం జగన్ స్టిక్కర్లను ప్రజలు చించేస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయలేని జగన్‌ పాలనలో నువ్వే మా నమ్మకం ఎలా అవుతావని ప్రశ్నిస్తున్నారు. 2024 నిన్ను నమ్మితే మునగాల్సిందే అంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్ పై ఉన్న నమ్మకం పోయిందంటున్నారు. 


Maharastra:m మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌ఘడ్‌ జిల్లాలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో... 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. పుణె, రాయ్‌గడ్‌ జిల్లాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ సోమ్‌నాథ్‌ గార్గ్‌ తెలిపారు. పింపుల్‌ గౌరవ్‌ నుంచి గోరేగావ్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినపుడు బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.


Yuvagalam: వాళ్లు మార్ఫింగ్ మరీచులు

లోకేష్‌ యువగళం పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకం అవుతున్నారు యువనేత. అయితే ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే యువగళంపై అధికారపార్టీ పత్రిక విషం చిమ్ముతుందన్న విమర్శలు వస్తున్నాయి.లోకేష్‌ మాటలను వక్రీకరించి రాస్తున్నరని పలు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఫేక్‌ రాతల వెనుక వైసీపీ సోషల్‌ మీడియా, ఐప్యాక్‌ టీం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే లోకేష్‌ టీడీపీ అధికారంలోకి వస్తే విదేశీ విద్యా పథకానికి మళ్లీ అంబేడ్కర్‌ పేరే పెడతామని, దళితులకు జగన్‌ చేసిందేమీలేదని అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ సోషల్‌ మీడియా, జగన్‌కు చెందిన పత్రిక వక్రీకరించాయని టీడీపీ నేత లోకేశ్‌ మండిపడ్డారు.వైసీపీ మార్ఫింగ్‌ మారీచులు అంటూ దుమ్మెత్తిపోశారు. 

Nizamabad: జిల్లా ఆస్పత్రిలో దారుణం

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవరస పరిస్థితిలో రోగి కాళ్లు పట్టుకుని లిఫ్ట్ వరకు లాక్కెళ్లాల్సి వచ్చింది. రోగి వెంట వచ్చిన సహాయకులు అతడికి తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నా...  ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ప్రస్తుతం ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో రోగులు ఎన్ని ఇంబ్బందులకు గురవుతున్నార్నది ఈ ఘటనే స్పష్టంచేస్తోంది. రోగులకు సౌకర్యాలు, వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది.. కనీసం మానవతా విలువలు పాటించడం లేదా  అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అసమానతలు లేని సమాజం చూడాలన్నదే అంబేడ్కర్‌ కల : ఈటల రాజేందర్

అసమానతలు లేని సమాజం చూడాలన్నదే అంబేడ్కర్‌ కల అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆయన కలలు గన్న నిర్మాణం జరగలేదని తెలిపారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఉల్లంఘన అని విమర్శించారు. కేబినెట్‌లో ఉన్న దళిత డిప్యూటీ సీఎంని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళితులకు తెలంగాణలో అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయని అన్నారు.