చిట్టి న్యూస్

Krishna: గుడివాడలో పెరిగిపోతున్న భూకబ్జాలు

కృష్ణా జిల్లా గుడివాడలో బైపాస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఎకరంన్నర  భూమిని అధికార పార్టీ నేత ఈడుపుగంటి హరి భగవాన్ కబ్జా చేశారని బాధిత రైతు కుటుంబం మీడియా ముందుకొచ్చి గోడు వెళ్లబోసుకుంది. తమ వద్ద 33 సెంట్ల భూమిని కొన్న వైసీపీ నేత కొన్న భూమిలో కాకుండా తమ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని రైతు పార్థసారథి కుమారుడు నీలాకాంత్ ఆరోపించారు. అంతేకాక అధికారబలంతో తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Kurnool: సర్కారు తీరుపై అంగన్‌వాడీల నిరసన

జగన్ సర్కారు తీరును నిరసిస్తూ కర్నూలులో అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయ ధర్నా సర్కిల్‌ వద్ద 36 గంటల మహాధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల నిరసనకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ మద్దతు తెలిపారు. సీఎం జగన్ ప్రజలను మోసం చేసినట్లే అంగన్‌వాడీ వర్కర్లను నయవంచన చేశారని గఫూర్ ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే రిలే, ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు.

Khammam: కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేస్తారు: పొంగులేటి

భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసానన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చించామన్నారు. కేసీఆర్‌ పాలనను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమంటూ ఎద్దేవా చేసారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలున్నాయని, ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండోది వ్యతిరేక వర్గం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. ఏపీలో సీఎంఓ అధికారులను మాత్రమే కలిసానని, సీఎం జగన్‌ను కలవలేదన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. 

Anantapuram: రాయదుర్గంలో అఖిలపక్షం భేటీ

రాయలసీమ హక్కులను పరిరక్షించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రాయలసీమ భవిష్యత్తు-సమాలోచన పేరుతో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైసీపీ నాలుగేళ్ల పాలనపై పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన ఆస్తులను కాపాడుకునేందుకు జగన్‌ ఏపీని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టారని కాల్వ ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని కాల్వ శ్రీనివాసులు అన్నారు. 

BASARA IIIT: విద్యార్థి మిస్సింగ్..

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న మెదక్ జిల్లా నర్సంపల్లికి చెందిన విద్యార్థి బన్నీ ఐదు రోజులుగా కనిపించకుండాపోయాడు. ఈనెల 6న ఔట్ పాస్ తీసుకొని కాలేజీ నుంచి బన్నీ ఇంటికని వెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు నుంచే బన్నీ ఫోన్ స్విచ్ఛాప్‌లో ఉంది. అటు బన్నీ ఇంటికి చేరుకోలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కొత్త అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌ బాధ్యతలు స్వీకరించారు. 2025 వరకూ ఈ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం రాజనగరానికి చెందిన నిరంజన్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2001లో యూఎస్‌ వెళ్లారు. 2003లో ఐటీ బిజినెస్‌ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ స్థాపించారు. 2008లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యుడిగా చేరారు. తానా అభివృద్ధికి భారీగా విరాళం ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 

T BJP: అర్వింద్‌,ఈటలకు Y కేటగిరి భద్రత

బీఆర్ఎస్ సర్కారును ఢికొట్టే నేతలకు కేంద్రం భారీ భద్రత కల్పిస్తోంది. నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర హోంశాఖ Y కేటగిరి భద్రత కల్పించింది. ఇప్పటికే ఈటల, అర్వింద్‌ ఆఫీస్‌, నివాసం వద్ద పరిస్థితిపై ఐబీ టీమ్, స్టేట్ ఇంటెలిజెన్స్ టీమ్ జాయింట్ రివ్యూ నిర్వహించింది. కాన్వాయ్‌లో వ్యక్తిగత వాహనంతో పాటు ఒకటి లేక రెండు వాహనాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అర్వింద్ ఇంటిపై కవిత అనుచరుల దాడి నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తోంది.  

కేతిరెడ్డికి ప్రభాకర్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేతిరెడ్డి అవినీతి, దౌర్జన్యాలపై విరుచుకుపడ్డారు. కేతిరెడ్డిలా దౌర్జన్యం చేసి సంపాదించడం తనకు చేతకాదన్నారు. తాను ఆధారాలతో నిజాలు మాట్లాడితే కేతిరెడ్డి తనపై అవాకులు చెవాకులు పేల్చుతున్నారని ఆరోపించారు. తాను ధర్మవరం వస్తే తనను ఎవరూ అడ్డుకోరని కానీ ఎమ్మెల్యే కేతిరెడ్డికే జనం తరిమికొడతారన్నారు.పోలీసులు లేకుండా కేతిరెడ్డి, వారి తండ్రి బయటకు రాగలరా అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం మారితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పాడె ఎత్తడం ఖాయమని జేసీ ప్రభాకర్‌రెడ్డి తేల్చిచెప్పారు.

BONALU: అంగరంగ వైభవంగా రంగం

లష్కర్‌ బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగం భక్తుల్ని విశేషంగా ఆకట్టుంది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని ఆలయంలో భవిష్యవాణి వినిపించి ఎలాంటి లోపాలు లేకుండా పూజలు అందుకున్నానని అన్నారు. ఐతే గతేడాది వాగ్దానం చేసినవి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వర్షాలు కురుస్తూనే ఉంటాయని అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. లష్కర్ బోనాల్లో అమ్మవారిని లక్షలాది మంది దర్శించుకున్నారని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారికి ఉత్సవం వైభవంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయ్యాయని  తెలిపారు. 

Hyd: రన్నింగ్‌ కారులో..చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో కారు దగ్ధం అయ్యింది. రన్నింగ్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు అగ్నికి ఆహుతయ్యింది. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

KADAPA: రాష్ట్ర ముఖ్యమంత్రి పరదాల మధ్య పర్యటన

గత నాలుగేళ్లుగా ఏపీ సీఎం జగన్ ఏ జిల్లాకు వెళ్లినా పరదాల మధ్యే వెళ్తున్నారు. సొంత జిల్లా కడపలోనూ అదే పరిస్థితి. కడపలో రాజీవ్ పార్క్ ప్రారంభించేందుకు వెళ్లగా అధికారులు ప్రహరీ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పరదాల మధ్య పర్యటించడమేంటని కడప నగర వాసులు మాట్లాడుకుంటున్నారు. ఇక కలెక్టరేట్‌ మెయిన్ గేట్ వద్ద పలువురు వైసీపీ నాయకులు సీఎం ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ప్రహరీ మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది. 

LOKESH: బీసీల అభివృద్ధే మా లక్ష్యం..

బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు చేపడతామన్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. బీసీ సామాజికవర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు. గొర్రెల కాపరుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. గొర్రెల కొనుగోలుకు రుణాలు, పెత్తందారుల చేతిలో ఉన్న మేత భూములను తిరిగి బీసీలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. రజక కార్పొరేషన్‌ను బలోపేతం చేసి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రజకులకు దోబి ఘాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

వైసీపీపై తిరగబడ్డ  గిరిజనులు

అల్లూరి జిల్లాలో వైసీపీపై గిరిజనులు తిరగబడ్డారు. కూనవరంలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభను అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కూనవరం టేకులబోరు నుంచి కూనవరం వరకు అఖిలపక్షనాయకులు ర్యాలీ నిర్వహించారు. కూనవరం జంక్షన్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత హంతకుడు అనంతబాబు అంటూ విపక్ష నాయకులు నినాదాలు చేశారు. అనంతబాబుకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో గిరిజనులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

రక్తసిక్తంగా బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు... రాష్ట్ర పోలీసులను మోహరించినప్పటికీ హింస చెలరేగింది. ఉదయం నుంచే పోలింగ్‌ బూత్‌లపై దాడులు జరిగాయి. టీఎంసీ, బీజేపీ, లెఫ్ట్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో 11 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు ఉన్నారు.  

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికాబజార్‌లోని ధమాకా సేల్ బట్టల షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ

వారాహి విజయ యాత్రకు జనసేనాని రెడీ అయ్యారు. ఇవాళ్లి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరి నుంచి ఏలూరు చేరుకున్న పవన్.. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గం ముఖ్య నేతలు, వీర మహిళలతో పవన్ భేటీ అవుతారు.   

TS: అమ్మవారికి భోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఎమ్మెల్సీ కవిత బోనాలు సమర్పించారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు ఇంటి నుంచి వందలాది వాహనాలతో సికింద్రాబాద్‌కు ర్యాలీగా వెళ్లారు. మంత్రి పద్మారావు గౌడ్ గజమాలతో ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న కవిత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

మొఖం చాటేసిన వరుణుడు

ఎగువ కర్ణాటక, దిగివన తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మొఖం చాటేశాడు. దీంతో దిగువన రాయలసీమ జిల్లాల్లో అత్యంత దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా.. అత్యంత లోటు వర్షపాతం నమోదు అవుతోంది. దీంతో వాతావరణశాఖ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్ట్‌ 15 మధ్య భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. అప్పటికీ కురువకపోతే తాగు, సాగునీటి గండం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. 

ఏడుపాయలకు క్యూ కట్టిన భక్తులు

మెదక్‌ జిల్లా ఏడుపాయల భక్తులతో కిటకిటలాడింది. ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా ఫలాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడమాసం.. ఆదివారం సెలవు దినం కావడంతో ఏడుపాయల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

నెల్లూరులో యువగళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కావలి నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మరో రెండు రోజుల్లో లోకేష్‌ యాత్ర.. రెండు వేల కిలో మీటర్ల మైలురాయికి చేరుకోనుంది. లోకేష్‌ పాదయాత్ర సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తుందంటున్నారు టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి.

TS: వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్న గౌరిశెట్టి

తెలంగాణ ప్రభుత్వం ఆర్య వైశ్యుల కోసం వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గౌరిశెట్టి మునీందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. దేశంలో కార్పోరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు తమ జీవనోపాధిని కోల్పోయారని ...ఇతర వృత్తులను ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఆన్‌లైన్ వ్యాపారాలు, మాల్స్‌ తమ పొట్టకొట్టాయని... వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 

AP: అనిల్‌ పై ఆనం ఫైర్

మాజీమంత్రి అనిల్‌ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఫైర్‌ అయ్యారు. అనిల్‌ను గుడిలోకి వెళ్లిఅబద్దాలు చెప్పమనలేదని అన్నారు. పవిత్ర దేవాలయాన్ని తన రాజకీయ స్వార్థాలకు.అనిల్ వాడుకుంటున్నాడని మండి పడ్డారు.అనిల్ పీఏ నాగరాజు, స్నేహితుడు చిరంజీవి పేర్ల మీద ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అన్ని చెప్పిన ఆయన సౌత్ అమెరికా పేరుతో గోల్డ్ మైనింగ్ గురించి మరిచిపోయాడని ఆరోపించారు. బాబాయ్‌తో బెట్టింగుల్లో వాటాలు తీసుకున్నారని తేడా రాగానే చేతులెత్తేశారని విమర్శించారు. 

అల్లూరిలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చలో కూనవరం కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభను అడ్డుకోకుండా.. పోలీసులు టీడీపీ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేయడంపై దుమారం రేపుతోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజును అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు. తమను అక్రమంగా ఎందుకు అరెస్టులు చేస్తున్నారంటూ పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అటు జిల్లాలో ముందస్తు అరెస్టులు, పోలీసుల తీరుపై టీడీపీ, గిరిజన సంఘం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

Canada: భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తానీల ఆందోళన

కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారీగా ఆందోళనలు చేపట్టారు. టొరంటోలోని ఇండియన్‌ కాన్స్‌లేట్ ముందు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వందలాది మంది భారత కాన్సులేట్ ముందు ఖలిస్తాన్ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అయితే అక్కడ ఉండే భారతీయులు కూడా అదే స్థాయిలో స్పందించారు. భారతదేశానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా జెండాలను పట్టుకుని ప్రదర్శనకు దిగారు. తొలుత ఖలిస్తానీలు ఆందోళనలు చేపట్టగా.. ఆ తరువాత భారత్ మద్దతు ప్రదర్శనలు జరిగాయి.

Ananthapuram: ఘర్షణకు దిగిన ఇరువర్గాలు..

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమద్దూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టుకునే విషయంలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసింది. సుత్తులతో దాడి చేసుకోవడంతో రాజు, నాగరాజు అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ నేత లాలూ స్వామి అండతోనే తమపై దాడి చేసినట్లు చెబుతున్నారు బాధితులు. శివాలయం గుట్ట సమీపంలోని కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టుకునేందుకు వడ్డే కులస్తులు ఓ సోసైటీ ఏర్పాటు చేసుకుని రాళ్లు కొట్టుకుంటున్నారు. అయితే వైసీపీ నేతల అండతో హద్దులు దాటి.. తాము ఉండే ప్రాంతంలోకి వచ్చి రాళ్లు కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SECUNDERABAD: రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.పాలికాబజార్‌లోని ధమాకా సేల్ బట్టల షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Falaknuma express: అగ్నిప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూటే..

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని తేలిపోయింది. క్లూస్ టీమ్ విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైలు బోగిలోని విద్యుత్‌ తీగల్లో లోపం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని క్లూస్ టీమ్ తేల్చింది. ఎస్‌-4 బోగిలోని టాయిలెట్ దగ్గర షార్ట్ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మూడు బోగీలు పూర్తిగా దగ్ధం కాగా.. మరో మూడు బోగీలు పాక్షికంగా కాలిపోయాయి. ప్రయాణికులు సకాలంలో రైలు దిగేయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని తేలినా.. రైల్వే అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

బీజేపీ కేడర్‌కు ఈటల పిలుపు

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ కేడర్‌కు పిలుపునిచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌.బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఒప్పందం మూడేళ్లుగా సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. కొందరు కావాలనే బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారన్న ఈటల..వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. 

6వేల109 కోట్ల  పనులకు శ్రీకారం

వరంగల్‌ పర్యటనలో 6వేల109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ.511 కోట్లతో రైలు వ్యాగన్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పాటుజగిత్యాల- వరంగల్‌ ఎన్‌హెచ్‌ పనులకు,మంచిర్యాల- వరంగల్‌ ఎన్‌హెచ్‌ పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం తన తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర అన్నారు.తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందన్నారు. ఆర్థికవృద్ధి లోనూ తెలంగాణది ప్రధాన భూమిక అన్నారు. తెలంగాణ వికాసం కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. 

ప్రపంచమే మోదీని బాస్‌గా గుర్తిస్తోంది

వరంగల్‌ బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా ఎమోషనల్‌ అయ్యారు బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌.ప్రపంచమే మోదీని బాస్‌గా గుర్తిస్తోందన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన ఘనత మోదీదే అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్న కేసీఆర్‌..మోదీ సభకు వచ్చి మాట్లాడాల్సిందని అన్నారు. ప్రధాని సభకు వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదన్నారు. ప్రధాని మోదీ వస్తే కేసీఆర్‌కు జ్వరం వస్తుందన్న సంజయ్‌.. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ గడీలు బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. 

YCPపై ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు విమర్శలు చేశారు.రాష్ట్రంలో రోజుకో ఘోరం జరుగు తుందని,ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం కనిపిస్తోందని ఆరోపించారు.రోడ్డు అడిగిన కానిస్టేబుల్ ను సస్పెన్షన్ చేశారని,పెన్షన్ అడిగిన మహిళపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు.బకాయిలు చెల్లించాలన్నందుకు వైసీపీ గూండాలు..వస్త్ర వ్యాపారులపై అమానుషంగా దాడికి పాల్పడ్డారని,బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయమన్నారు చంద్రబాబు.

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ షాపులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. షాపులోని వస్తువులు భారీ శబ్ధంతో పేలాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  

జగన్ సభ నుంచి ప్రజలు పరార్

సీఎం జగన్‌ ఎక్కడ సభ పెట్టి.. ప్రసంగించినా జనం పట్టించుకోవడం లేదు. ఎంతో ఉత్సాహంగా జగన్‌ స్పీచ్‌ మొదలు పెట్టగానే.. అదే ఉత్సాహంతో సభ నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. అన్ని సభలోనూ ఇదే సీన్‌ జరుగుతోంది. ఇప్పుడు కల్యాణదుర్గంలోనూ ఇదే సీన్‌ రిపీయింది. జగన్‌ ప్రసంగిస్తుండగా సభ నుంచి ప్రజలు వెళ్లిపోయారు . మీటింగ్‌ నుంచి వెళ్లిపోతున్న ప్రజల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎవ్వరూ పోలీసుల మాటల వినలేదు. మరోవైపు పోలీసులకు ఉదయం నుంచి టిఫిన్‌ పెట్టకపోవడంతో నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఉప్పు రైతులకు లోకేష్ అభయం

యువగళం పాదయాత్రలో ఉప్పు రైతుల సమస్యలు తెలుసుకున్నారు టీడీపీ యువనేత నారా లోకేష్‌. అల్లూరు మండలం ఇస్కుపల్లిలో ఉప్పుసాగు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఉప్పు రైతులు కుదేలయ్యారని అన్నారు.   టీడీపీ అధికారంలోకి రాగానే ఉప్పు రైతులను ఆదుకుంటామని చెప్పారు. గుజరాత్‌, తమిళనాడు ఉప్పు రైతులతో పోటీ పడే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఉప్పు రైతుల ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఉప్పు రైతుకు రూపాయి 40 పైసలకే యూనిట్ కరెంటు, ట్రాక్టర్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

అపచారం.. చెప్పులు వేసుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మప్రచారం కార్యక్రమంలో అపచారం చోటుచేసుకుంది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి చెప్పులు వేసుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి ధర్మప్రచారంలో భాగంగా మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే వీరిద్దరూ చెప్పులు వేసుకొని పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ తీసుకురావడంతో పెద్ద దుమారం రేగింది. సాక్షాత్తు దేవాదాయశాఖ మంత్రి చెప్పులు వేసుకొని పట్టువస్త్రాలు తీసుకెళ్లడంతో జనం మండిపడుతున్నారు. ఇదేం ధర్మప్రచారం అంటూ నిలదీస్తున్నారు. 

Varahi Yatra: రెండో విడత వారాహి షెడ్యూల్ ఇదే..!

రెండో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది జనసేన పార్టీ. రేపు సాయంత్రం ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఇక ఈ నెల10న ఏలూరులో మద్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్‌కళ్యాణ్‌ సమావేశం కానున్నారు. ఇక 11న దెందులూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు,వీర మహిళలతో పవన్‌కళ్యాణ్ సమావేశం కానున్నారు. మరోవైపు ఈనెల 12న తాడేపల్లిగూడెంలో బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.