- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

విశాఖ జిల్లాలో వైసీపీ నేత దాట్ల పెదబాబు రూ. 4వేల కోట్ల విలువైన భూమిని ఆక్రమించారంటూ, భీమిలి మండలం నారాయణ రాజు పేటకు చెందిన రైతులు ఆరోపించారు. సుమారు 400 ఎకరాల భూమిని, నకిలీ పట్టాలు సృష్టించి విక్రయిస్తున్నారని, విశాఖ కలెక్టరేట్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. వారసత్వంగా సంక్రమించిన భూమి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అంటున్నారు.

అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ నిబద్ధత ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామని అన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.

నల్గొండ జిల్లా కలేక్టరేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది. IKP-VOAలకు మద్దతుగా సీఐటీయూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో సీఐటీయూ కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డుగా నిలవడంతో మహిళా వీఏఓలను స్టేషన్‌కు తరలించడం కష్టంగా మారింది.

తాను కోట్లకు పడగలెత్తాను అంటూ సీనియర్ హీరో నరేశ్ ప్రకటించారు. మళ్లీపెళ్లి రిలీజ్ సందర్బంగా మీడియాతో మాట్లాడిన నరేశ్ తన ఆస్తి విలువ 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఇదంతా బ్లాక్ మనీ కాదని.. అంతా వైటేనని, ఆస్థికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తానని చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం శరత్ బాబు కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది. శరత్ బాబు మృతి పట్లా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

'ది కేరళ స్టోరీ'కి రామ్ గోపాల్ వర్మ మద్దతు ప్రకటించాడు. ఈ సినిమా బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ డెడ్ ఫేస్ కు అద్దంపడుతోందని ట్వీట్ చేశారు. "మాకు అబద్ధాలు చెప్పడంలోనే చాలా సౌకర్యంగా ఉంది. ఎవరైనా ముందుకు వెళ్లి నిజాన్ని చూపించినప్పుడు షాక్ అవుతాం.. # కేరళస్టోరీ (sic) విధ్వంసక విజయం బాలీవుడ్ నిశ్శబ్ద మరణాన్ని తలపిస్తోంది" అని అన్నారు. కేరళ స్టొరీ నుంచి నేర్చుకోవడం కష్టం. ఎందకంటే అబద్దాన్ని కాపీ చేయడం సులభం, నిజాన్ని కాపీ చేయడం చాలా కష్టం.

మంత్రి KTR అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. బెయిన్ క్యాపిటల్ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ లో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. అదేవిధంగా టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మండీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. దీనిద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ప్రకాశం మర్డర్ కేసులో భర్తే హంతకుడు అని తేలింది. రాధను తానే హత్య చేసినట్లు మోహన్ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. 15 రోజులుగా సెల్ ఫోన్ లో తన భార్యను తానే వేధించి, చివరకు హత్య చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో మోహన్ రెడ్డి నేరం అంగీకరించాడు .

సుప్రీం కోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. మెన్షననింగ్ లిస్ట్ లోనే ఉంటేనే విచారిస్తామని స్పష్టం చేసింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందిగా సూచించింది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని పేర్కొన్నారు. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఎంపీ అవినాష్ తల్లిని వైద్యుల బృందం పర్యవేక్షణలో CCUలో ఉంచారు. అయితే ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో వైద్యులు అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉంచారు.

- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెచ్చిన సిద్ధార్థ్ 'టక్కర్' ట్రైలర్ సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా 'టక్కర్' ట్రైలర్ విడుదల
అంచనాలను అమాంతం పెంచేసిన సిద్ధార్థ్ 'టక్కర్' ట్రైలర్
చార్మింగ్ హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధార్థ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొనడం సహజం. ఇప్పుడు ఈ చార్మింగ్ హీరో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సంగమంగా రూపొందిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
ఈరోజు(మే 21) సాయంత్రం 5 గంటలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా 'టక్కర్' ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న టక్కర్ సినిమా ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
విడుదలైన 'టక్కర్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు" అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాధారణ యువకుడిగా కథానాయకుడు కనిపిస్తుండగా, బాగా డబ్బున్న యువతిగా కథానాయిక కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తున్నాయి. తనని ఎంతగానో నమ్మిన కథానాయికని డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి కథానాయకుడికి ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? కథానాయిక ఆత్మహత్యాయత్నానికి కారణం కథానాయకుడేనా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ లో యోగిబాబు హాస్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే "డబ్బు సంపాదిస్తానని చెప్పు.. కానీ డబ్బున్నోడిని అవుతానని అనకురా.. నాకు భయంగా ఉంది", "నా దగ్గర డబ్బుల్లేవు.. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే, నా కిడ్నీలు అమ్ముకోవాలి", "నూడుల్స్ తినే నీకే ఇంతుంటే.. చేపల పులుసు తినే నాకెంత ఉంటుందిరా" వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే.. ఖర్చు విషయంలో వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించారని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.
ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలతో 'టక్కర్'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'టక్కర్' టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్

గాలి దుమారం, అకాల వర్షం వరంగల్ నగరాన్ని వణికించింది.. నగరంలోని పలు ప్రాంతాలు, వివిధ కాలనీల్లో తీవ్ర నష్టం మిగిల్చింది.. ఈదురు గాలులకు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.. చెట్లు విరిగిపడ్డాయి.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. నష్టం వాటిల్లిన ప్రాంతాలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పరిశీలించారు.. ఇంటింటికీ తిరిగి బాధితులను పరామర్శించారు.. తక్షణ సహాయంగా ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలను తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు… పోలీసుల సహాయంతో గుడిసెల్ని తొలగించారు. గుడిసెల్ని తొలగించడంతో ఆందోళనకు దిగారు. తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మెదక్ జిల్లా నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారుడు ఆటోను ఢీకొట్టింంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నులుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు ఆర్మూర్ మండలం ఏలూరువాసులుగా గుర్తించారు. వీరు ఆర్మూర్ నుంచి గజ్వేల్‌కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. 330 కోట్ల నిధులు ఇచ్చారని అన్నారు. లక్ష్మక్కపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు

ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు చాంద్ బాష . మే22 న ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. అక్టోబర్31న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. నవంబర్ లో నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆయన అన్నారు. 22వతీదీన రిలే నిరాహారదీక్షకు దిగుతామని, చెప్పారు.

జగన్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీటస్త్రం సంధించారు. నాడు ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న టాప్-5లో ఏపీ ఉండేదన్నారు. నేడు జాబితాలో అట్టడుగు స్థానానికి చేరుకుని 14వ స్థానంలో నిలిచిందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. తన సంపద గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. ఎఫ్‌డీఐలు లేదా ఏపీ యువత ఉద్యోగాల గురించి జగన్ పట్టించుకోరని చంద్రబాబు విమర్శించారు.

తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కమాలపురంలో రైలు నిలయం దాటిన అనంతరం రైలు ఆగడంతో, కిటికీ పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలోంచి, బంగారు ఆభరణాలు అపహరించారు దుండగులు. బాధితులు ప్రొద్దుటూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటన శనివారం జరిగింది. 7.1 తీవ్రతతలో భూకంపం సంభవించిందని US జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 35 కిలోమీటర్లు లోతుగా ఉందని అధికారులు తెలిపారు. న్యూ కాలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్లు దూరంలో ఉందని పేర్కొన్నారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సునామీ అలలు 0.3 మీటర్లు కంటే తక్కువగా ఉండవచ్చని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాలో గార్ల మండలం కృష్ణాపురంలో సౌజన్య అనే పాప కంట్లో నుంచి వివిధ పదార్థాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. గత పది రోజులుగా పాప కుడి కన్నులోంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు, బియ్యపు గింజలు జారిపడుతున్నాయి. దాంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పాపను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. హుస్సేనియాలం పరిధిలోని ఎయిర్ కూలర్, ఆటో మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

పదో తరగతి తప్పిన ఓ బాలిక తల్లిదండ్రులు కోపగిస్తారన్న భయంతో ఏకంగా కిడ్నాప్ డ్రామాకు తెరలేపిన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. కోల్ కతాలోని బాన్స్ ద్రోని ప్రాంతానికి చెందిన బాలిక పరిక్షా ఫలితాలను చూసుకుంటానని చెప్పి చెల్లితో సహా ఇంటి నుంచి బయలుదేరింది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని తెలుసుకున్న బాలిక తిరిగి ఇంటికి వెళ్లలేక చెల్లిని తీసుకుని పలు ప్రాంతాలు తిరిగింది. తాను చెల్లి కిడ్నాప్ అయినట్లు తండ్రికి ముబైల్ సందేశం పంపింది. పిల్లలు కావాలంటే కోటి రూపాయిలు కావాలని కిడ్నాపర్ మాదిరి మాట్లాడింది. అయితే ఈలోగానే తల్లిదండ్రులు పిల్లలు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగ సీసీటీపీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారుల ఆచూకీ కనుగొన్నారు. వారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ బీచ్‌లో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు ప్రేమోన్మాది. శ్రావణి, గోపాల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రావణి వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఇది సహించని గోపాల్ సదరు యువతితో గొడవకు దిగాడు ఈ క్రమంలోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. శ్రావణి గొంతు నులిమి హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. హుస్సేనియాలం పరిధిలోని ఎయిర్ కూలర్, ఆటో మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై హై టెన్షన్ నెలకొంది..నిన్న సీబీఐ విచారణకు హాజరు కాకుండా అవినాష్ రెడ్డి..తన తల్లికి గుండె నొప్పి వచ్చిందని పులివెందులకు బయలు దేరిన విషయం తెలిసిందే.. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అవినాష్ తల్లిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో చేర్పించారు.. ఇప్పుడు సీబీఐ అధికారులు కర్నూలు కి వెళ్లి అవినాష్ ని అరెస్ట్ చేస్తారా లేక..తదుపరి విచారణకు మరో నోటీసు ఇచ్చి వస్తారా అన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.

విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీకి రెండో రోజు చికిత్స కొనసాగుతుంది. తల్లి లక్ష్మి వద్దనే ఉన్నారు అవినాష్ రెడ్డి. లక్ష్మీకి గుండె సంబంధిత చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అవినాష్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు సర్వ్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ ను మరోసారి సీబీఐ విచారించనుంది.

నేడు ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. నెల్లూరు జిల్లా కావాలిలో ఇటీవల నిరసన తెలపడానికి వెళ్లిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ పై పోలీస్ దాష్టికాన్ని నిరసిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పిర్యాదు చేయనున్నటకలు వీర్రాజు తెలిపారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూకట్ పల్లి అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. కైత్లాపూర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటూ, సినీ ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై 500 పేజీల సావనీర్ ను ఆవిష్కరించబోతున్నారు.

రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి పాలిసెట్ -2023 ఫలితాలు విడుదల విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్ లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం160332 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా, 143625 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 124021 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం - 86.35 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత - 88.90 శాతం, బాలుర ఉత్తీర్ణత - 84.74 శాతంగా నమోదైంది. ttps://polycetap.నీచ్.in ఈ వెబ్ సైట్ లో పరీక్షా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. పాస్వర్డ్ : ఎంప్లోయబిలిటీ.

సీబీఐ ముందు హాజరుకావడానికే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనుకోకుండా ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో పులివెందులకు వెళ్తున్నారని తెలిపారు. వివేకానందరెడ్డిని నరికినోడేమో బయట తిరుగుతున్నారు. హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వారిని వేధిస్తున్నారు. అవినాష్ కారు వెనుక వెళ్లే మీడియా పై దాడిజరగడం దురదుష్టకరం. మీడియాపై అలా దాడి జరగకూడదు ... దాడి విషయం అవినాష్ కు తెలిసి ఉండకపోవచ్చు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా మీడియా వెంబడించింది. అవినాష్ రెడ్డి ని నేరస్తుడు గా చూపే ప్రయత్నించడం సరికాదని ఆయన అన్నారు.

దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇందుకుగాను సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గమని అన్నారు. దళితులను, గిరిజనులు బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు. గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే బిజెపి తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు.

యథేచ్ఛగా కోట్లరూపాయలు విలువచేసే మట్టిని అక్రమంగా తరలిస్తుంది మైనింగ్ మాఫియా. అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేయాలంటూ గతంలో NGT ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రెండు సార్లు కొత్తూరు తాడేపల్లిలో పర్యటించిన NGT బృందం. తుది నివేదిక ఇవ్వకపోవడంతో బృందంపై సీరియస్ అయిన NGT. మైనింగ్ మాఫియాపై యన్టీఆర్ జిల్లా కలెక్టర్,సిపి కి మెమరాండం ఇచ్చిన పిటిషనర్ పిల్లి సురేంద్రబాబు. అక్రమ మైనింగ్ మాఫియాను ప్రశ్నిస్తున్న స్థానికులపై దాడులకు తెగబడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

బనగానిపల్లి నియోజకవర్గం టంగుటూరు గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసిన తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నారా లోకేష్ స్పందిస్తూ... వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రైతాంగాన్ని నట్టేట ముంచారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని చెప్పిన జగన్ నాలుగేళ్లుగా ముఖం చాటేశారని అన్నారు. 30లక్షల ఇళ్లు కడతానని డబ్బాలు కొట్టిన జగన్... నాలుగేళ్లలో 5ఇళ్లు మాత్రమే కట్టారని ఎద్దేవాచేశారు. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే బాధ్యత రాబోయే టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.

జీవోలను ఆన్‍లైన్‍లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ గెజిట్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్‍లో ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్‍లో నమోదైన అన్ని జీవోలనూ వెబ్‍సైట్‍లో అప్‍లోడ్ చేయాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఇచ్చిన జీవోలను అప్‍లోడ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ గెజిట్ వెబ్‍సైట్ లో అప్‍లోడ్‍కు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

సత్యసాయి జిల్లా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో.. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ క్రికెట్ ఆడి సందడి చేశారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరంలో క్రికెట్ పోటీలను వారు పర్యవేక్షించారు.

వైసీపీ ఏపీని నాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. విజయనగరంలో దాసరి సామాజిక వర్గీయులతో చంద్రబాబు సమావేశమయ్యారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అంతా దోపిడీయేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఏనాడూ కరెంటు కోతలు లేవని చెప్పారు. వైసీపీ పాలనలో కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


