- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ బాపునగర్‌లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగి రెండు వారాలు గడవక ముందే పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భర్త సంతోష్ రెడ్డి వేధింపులుతో నితిషా ఆత్మహత్యకు పాల్పడిదంటూ వధువు తండ్రి నరసింహ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

హైదరాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికి తోడు వడగాలులు భయపెడుతున్నాయి. ఉదయం 7 నుంచే సెగలు పుడుతున్నాయి.

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ సభలు పెట్టిన జనం పోటెత్తుతున్నారు. ఇక వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేతలు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజులుగా తమిళనాడులోని కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్ లోని కుప్పంలో భీభత్సం సృష్టిస్తోన్న మదపుటేనుగులను అటివీ శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించారు. వాటికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. బంధించిన ఏనుగులను హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం.. సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో పెద్ద మార్పుకు నాందేడ్ వేదికైందన్నారు. దేశం ప్రబల శక్తిగా ఆవిర్భావించాలన్న ఆయన.... స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన... సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చిన్నదేశాలైన సింగపూర్ వంటివి అభివృద్ధి చెందాయని....కానీ భారత్ మాత్రం ఇంకా అభిృవద్ధి చెందలేదన్నారు. వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు కేసీఆర్.

సీఎం జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. R5 జోన్ అంశంలో అమరావతి రైతులకు నిరాశ మిగిలినా.. ఇది తాత్కాలికమే అన్నారు. పేదలపై జగన్ ప్రేమ దృతరాష్ట్ర కౌగిలి లాంటిదని విమర్శించారు. సుప్రీంకోర్టులో R5 జోన్ పై క్లారిటీ రాగానే, ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వేగం పెంచిందన్నారు. భూములిచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం లాఠీ జులిపించిందని మండిపడ్డారు.

నిజామాబాద్ మార్కెట్‌లో ఆమ్‌చూర్ తయారు చేసే రైతు దగా పడుతున్నాడు. తెలంగాణలో ఏకైక నిజామాబద్ మార్కెట్‌లో క్వింటాకు అత్యధికంగా 20వేలు దాటడం లేదని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మామిడి ఆమ్ చూర్‌కు మంచి డిమాండ్ ఉంది. పంట సాగు చేసి, ఆమ్ చూర్ తయారు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు, ఆమ్‌చూర్ నాణ్యత లేదంటూ వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారని అంటున్నారు రైతులు.

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ సీబీఐ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందాయి. అవినాశ్ విచారణకు మరోసారి గైర్హాజరు అవ్వడంతో గ్రీన్ సిగ్నల్ అందుకున్న అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే అవినాశ్ కారులో తప్పించుకున్నారని తెలుస్తోంది. సీబీఐ అధికారులు అతడిని ఛేజింగ్ చేస్తున్నారని సమాచారం.

పుష్ప-2 గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పుష్ప-2లో ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ పై సుకుమార్ ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

"మల్లేశం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్ రాచకొండ తాజాగా "8 A.M మెట్రో"చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో కిషోర్ గంజితో కలిసి నిర్మించిన ఈ చిత్రం రేపు (మే 19) తొలుత హిందీ భాషలో విడుదల కానుంది. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వంగల హేమలత తన పదవికి రాజీనామా చేశారు. డివిజన్లో అభివృద్ధి జరగకపోగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామంటూ ఆమె తరఫున భర్త వీరారెడ్డి పార్టీ నేతలకు రాజీనామా లేఖలు అందజేశారు. అయితే తాము పార్టీకి రాజీనామా చేయలేదని, పదవికి మాత్రమే చేశామని ఆయన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ ముఖ్య నేతలు వారిని బుజ్జగిస్తున్నారు.

మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు లోక్‌సభ సెక్రేటరియట్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధానీ మోదీని కలిసి కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలి ఆహ్వానించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే నూతన పార్లమెంట్ భవనంలో 888 మంది ఎంపీలు రాజ్య సభలో 300 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునే విధంగా సదుపాయాలు ఉండనున్నాయి.

వైఎస్.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిబిఐ ఎదుట హాజరు కావటం పై ఆయన న్యాయవాదులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, వేంపల్లి, లింగాల ,చక్రాయపేట మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు.

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన కర్నూలు ప్రుభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి సబ్ జైల్ లో ఉన్న అఖిల ప్రియ ఛాతి నొప్పి అని ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య పరీక్షలు చేయించారు. అయితే పరీక్షా నివేదికలు సాధారణంగానే ఉండటంతో ఆమెను తిరిగి సబ్ జైల్ కు తరలించారు.

శృంగవరపుకోటో తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శిరికి రిసార్ట్స్ లో బసచేసిన చంద్రబాశబు, నేడు ట్రైబల్ యూనివర్శిటీ విధ్యార్ధులతో భేటీ కానున్నారు. విద్యార్ధులు తమ సమస్యలను మెమొరాండం రూపంలో బాబుకు సమర్పించనున్నారు. తరువాత ఫొటో సేషల్ లో పాల్గొనున్నారు. అనంతరం దాసరి సామాజిక వర్గీయులు, జిల్లా టీడీపీ నేతలతో సమావేశమవ్వనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం అనకాపల్లి బయలుదేరనున్నారు.

నెల్లూరు : ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం..
గాలి బీభత్సానికి పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ వైర్లు,పోలీస్ స్టేషన్, దర్గా సెంటర్ వద్ద విరిగి పడ్డ చెట్లు,ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో పట్టణంలో నిలిచిన విద్యుత్ సరఫరా.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదు
TSPSC పేపర్ లీకేజ్ విషయంలో ఫిర్యాదు చేసిన నరేందర్ యాదవ్ అనే వ్యక్తి.సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, పార్టీ ని దూషిస్తూ మాట్లాడారని ఫిర్యాదు.
షర్మిలపై సెక్షన్505(2),504 కేసు నమోదు చేసిన పోలీసులు

మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.. ఆయన ఇవాళ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు.. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘతన ఎన్టీఆర్‌దయితే.. బీసీల రిజర్వేషన్లు కుదించిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు.

అమరావతి :రేపటినుండి ఏపీలో బంద్ కానున్న ఆరోగ్యశ్రీ సేవలు,
సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ కి నోటీసు ద్వారా తెలియజేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్

జగన్ పాలనతో విసిగిపోయారన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారన్నారు. అందుకే చంద్రబాబు మీటింగులకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు

అనంతపురం జిల్లా తల్లిమడుగులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంజరు భూములలో వైసీపీ కార్యకర్తలు వేసుకున్న షాపులను వదిలి.. మిగిలిన వాటిని అధికారులు తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది

వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్ ట్రానిక్ కంపెనీ.. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అరాచకాలకు అడ్డేలేకుండా పోతోంది. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి దోపిడీకి, దాష్టీకం హెచ్చుమీరుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్నదమ్ములిద్దరూ ఇటు పుంగనూరు.. అటు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఏకంగా నియంత పాలన సాగిస్తున్నారు. ముదివేడుల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన కళ్లకు కడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణంతో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు ప్రారంభించడం పెద్దిరెడ్డి దాష్టీకానికి అద్దంపడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

విద్యుత్ కోతలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేళాపాళా లేకుండా కరెంట్ కట్ చేస్తుండటంతో.. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం సాంకేతిక లోపమంటున్నారు.

ఒడిశా తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు హౌరా-పూరీ మధ్య 500 కి.మీ దూరాన్ని ఆరున్నర గంటల్లో చేరుకుంటుందని అంచనా. ఈరోజు ఒడిశాలో రూ. 8,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేయనున్నారు.

రిజర్వ్ బ్యాంకుకు చెందిన రూ. 1,070 కోట్ల నగదును తరలిస్తోన్న ట్రక్కులో సాంకేతికలోపం ఏర్పడటంతో రోడ్డుపైనే నిలిచిపోయిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురానికి నగదును తరలిస్తుండగా తాంబరంలో ట్రక్కు నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు వాహనానికి రక్షణగా నిలిచారు. తాంబరం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసన్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడికి బయట వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేదించారు. రిపేరు సాధ్యమవ్వకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు ట్రక్కును తిరిగి పంపించారు.

ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఐడీసీ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్ర కార్టర్‌తో సమావేశమయ్యారు. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 12 వందల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుందని వివరించారు.

వరుడు నచ్చకపోవడంతో వధువు వేదికపైనే వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటన బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లోని కహల్ గావ్ లో చోటు చేసుకుంది. వధువు కిట్టూ కుమారి వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే పెద్దగా కనిపిస్తున్నాడని చెప్పి నిరాకరించింది. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. అయినా ససేమిరా అంది. మరింత మొండిగా ప్రవర్తించింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.

యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడున్నారు. దీంతో ఇవాళ స్కానింగ్ చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ వ్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లో లోకేష్ కుడి భుజానికి MRI పరీక్షలు చేశారు వైద్యులు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది. భుజం నొప్పి అధికంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా నొప్పి తగ్గకపోడవంతో గురువారం MRI స్కానింగ్ చేయించుకున్నారు.

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తల్లిమడుగుల గ్రామంలో బంజరు భూముల్లో వైసీపీ, టీడీపీ నేతలు షాపులు వేసుకున్నారు. అయితే వాటిని తొలగించారలని అధికారులు ఆదేశించారు. దీంతో పోలీసులు అధికార పార్టీకి చెందిన వారు వేసుకున్న షాపులను తొలగించకుండా, టీడీపీ వేసుకున్న షాపులను తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 35 మంది అరెస్ట్ అయ్యారు. డీఏవో పరీక్షల్లో ర్యాంకులు.. అత్యధిక మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన అధికారులు, రాష్ట్రస్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించిన నిందితులను అరెస్ట్ చేశారు. కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు రాగా అతని భార్య శాంతికి రెండో ర్యాంకు వచ్చింది. నిందితురాలు రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చింది.

కొలంబియాలో దట్టమైన అడవిలో విమానం కూలిపోయిన ఘటనలో రెండు వారాల తర్వాత నలుగురు చిన్నారులు సజీవంగా లభ్యమయ్యారు. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటన చేశారు. మే 1న జరిగిన విమాన ప్రమాదంలో ఈ చిన్నారుల ఆచూకీ గల్లంతు అయింది. వీరందరూ తోబుట్టువులే కాగా, వీరిలో 11 నెలల పసికందు సహా, 4, 9ఏళ్ల వయసుగల అబ్బయిలతో పాటూ, 12ఏళ్ల వీరి పెద్దక్క ఉంది. ప్రమాదంలో పైలట్‌తో సహా ముగ్గురు పెద్దలు మరణించగా, వారి మృతదేహాలు విమానంలోనే లభ్యమయ్యాయి. అడవిలో అర్థరాత్రి పూట చిన్నారులు సురక్షితంగా ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన తుంగనాథ్ శివాలయం ఒరిగిపోతోంది. 8వ శతాబ్ధంలో కాత్యూరీ రాజులు, 12,800 అడుగులు ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయం సుమారు 6 నుంచి 10 డిగ్రీల మేర వాలుతోందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలోకి చేర్చాలని, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు పురావస్తు శాఖ అధికారులు.

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజుకు చేరుకుంది. నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో మ. 2గం.లకు యాతం ఫంక్షన్ హాల్ వద్ద రైతులతో లోకేష్ ముఖాముఖిలో పాల్గొననున్నారు. సా. 4 గం.లకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. 4.45కి కానాలలో జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమవుతారు. 5.45కి హెచ్‌ఎస్ కొట్టాలలో స్థానికులతో భేటీ అవుతారు. అదేవిధంగా 6.55కి జూలపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో సమావేశమవ్వనున్నారు. రాత్రి 7.45కి పసరుపాడు, 9.30కి తెల్లాపూరి ప్రజలతో లోకేష్ భేటీ అవుతారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ జాతాయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి అఖిలప్రియ, ఎ.వి. సుబ్బారెడ్డి సభాప్రాంగనానికి చేరుకున్నారు. అయితే ఇరు వర్గాల మధ్యా చాలాకాలంగా వైరం నడుస్తోంది. ఈ క్రమంలో అఖిలప్రియ అనుచరుడు సుబ్బారెడ్డిపై చేయిచేసుకోవడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. ఈ విషయంపై అఖిలప్రియను అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


