- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు విమానం దిగింది. ఇంజనీర్లు విమానం ఎక్కి, తలుపులు పగలగొట్టి, రెండు గంటలపాటు శ్రమించి వ్యక్తిని రక్షించారు.
విమానంలో టాయిలెట్‌లో డోర్ లాక్ చెడిపోవడంతో ఓ మగ ప్రయాణికుడు దాదాపు 100 నిమిషాల పాటు ఇరుక్కుపోయాడు. ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంజనీర్లు లూ డోర్‌ను పగులగొట్టి ఆయనను రక్షించారు. ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరిన SG-268 ఫ్లైట్‌లో ఈ సంఘటన జరిగిందని KIA వర్గాలు తెలిపాయి.
ఈ విమానం సోమవారం రాత్రి 10.55 గంటలకు బయలుదేరాల్సి ఉంది. "14D సీటులో ఉన్న ప్రయాణికుడు టేకాఫ్ అయిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లాడని తెలిసింది. టాయిలెట్ తలుపు సరిగా పనిచేయకపోవడంతో అతను లోపల చిక్కుకున్నాడు " అని KIA గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడు చెప్పారు.
ప్రయాణీకుల కాల్స్ సిబ్బందిని అప్రమత్తం చేశాయి, వారు కూడా బయటి నుండి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. "ఒక ప్రయాణీకుడు ముంబై నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్నాడు. ల్యాండ్ అయ్యే సమయానికి టాయిలెట్ కు వెళ్లాడు. ఆశ్చర్యకరంగా, చిన్న లావేటరీలో చిక్కుకున్నాడు" అని బెంగళూరు విమానాశ్రయ అధికారి తెలిపారు.
టాయిలెట్ తలుపు తెరవడానికి అవకాశం లేదని సిబ్బంది గ్రహించడంతో, ఎయిర్ హోస్టెస్‌లలో ఒకరు బ్రౌన్ పేపర్‌పై పెద్ద అక్షరాలతో ఒక గమనికను రాశారు: "సార్ మేము తలుపు తెరవడానికి మా శాయశక్తులా ప్రయత్నించాము, కానీ డోర్ తెరుచుకోవడం లేదు. భయపడకండి.. మనం కొద్ది నిమిషాల్లో దిగుతున్నాము, కాబట్టి దయచేసి కమోడ్ మూత మూసివేసి దానిపై కూర్చుని మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. మెయిన్ డోర్ తెరవగానే ఇంజనీర్ వస్తాడు." చిక్కుకుపోయిన ఫ్లైయర్‌ని ఓదార్చడానికి ఆమె నోట్‌ను లావెటరీ డోర్ కింద నుంచి పంపించింది.
మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు విమానం ల్యాండ్ అయ్యింది. ఇంజనీర్లు విమానం ఎక్కి, తలుపులు పగలగొట్టి, రెండు గంటలపాటు శ్రమించి లోపల ఉన్న ప్రయాణీకుడిని రక్షించారు. వెంటనే ప్రయాణికుడిని ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. "క్లాస్ట్రోఫోబియా కారణంగా ప్రయాణీకుడు పూర్తిగా గాయపడ్డాడు" అని అధికారి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్ , బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరికి పోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు అభ్యర్ధులు నిర్దారించారు. అయితే... అధికారికంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రకటన ఏఐసీసీ ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద..... ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా... చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ , NSUI తెలంగాణ అధ్యక్షుడు బలమూరి వెంకట్ లకు.... పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈనెల 18వరకు నామనేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా ఆలోపు ఇద్దరూ పత్రాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉన్నందున శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ కే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.

కోనసీమలో ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, రాజోలుల్లో ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబాజీపంట మండలంలో ప్రసిద్ధి గాంచిన జగ్గన్న తోట ప్రభల తీర్థానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పురాణ ప్రాశస్తం ప్రకారం... ఏకాదశ రుద్రులు కనుమ పండగ రోజు దేశం మొత్తం మీద కొలువు తీరేది జగ్గన్న తోటలోనే కొలువుతీరతారు. ఏకాదశ రుద్రుల్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యంలో భక్తులు తరలివచ్చారు.

గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాలకు చెందిన సర్వమంగళ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి, పార్వతీవీరేశ్వరస్వామి ప్రభల్ని పంట కాల్వలు, వరిచేల మధ్య నుంచి ఎగువ కౌశిక నదిని దాటించి యువకులు భుజాలపై మోసుకొచ్చారు. ఈ దృశ్యాలను భక్తజనం తిలకించి అమితానందం పొందారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల ప్రభలు, రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలను అందంగా అలంకరించి భక్తులు భజాలపై మోసుకొచ్చారు. వాకలగరువులోని ఉమాపార్వతీ సోమేశ్వరస్వామి, తొండవరంలోని ఉమాతొండేశ్వరస్వామి, గున్నేపల్లి అగ్రహారంలోని పార్వతీరామేశ్వరస్వామి వార్ల ప్రభలకు తీర్థం నిర్వహించారు. పి.గన్నవరం మండలంలో వివిధ చోట్ల 80 ప్రభలను తీర్ధానికి తీసుకువచ్చారు. కోనసీమ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభల తీర్థాలకు జనం తరలివచ్చారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఎడ్ల పందాలు ఆకట్టుకున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లంవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగాయి. యువకులు, పెద్దల కేరింతలు మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. ఒంగోలు జాతి ఎడ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ లో అంతర్ రాష్ట్ర ఎద్దుల గిరక పోటీలు కోలాహలంగా జరిగాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేల పందేలు జరిగాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేలా నిర్వాహకులు ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్ ను.. ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నాం పాలసముద్రానికి చేరుకొనున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం... అకాడమీలోని కేంద్రాలను సందర్శించనున్నారు. తర్వాత ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం..ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్నిమోడీ విడుదల చేయనున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగించనున్న మోడీ N.A.C.I.Nకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

మటన్ తినే విషయంలో గొడవ కారణంగా...... ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ ఠాణా పరిధిలో.... జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ స్నేహితులు. ఇద్దరు మద్యం తాగి వచ్చి.. భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరిగి....చారి కోపంలో కత్తితో అజయ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజయ్..అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న తుకారాం గేట్ పోలీసులు... చారిని అదుపులోకి తీసుకున్నారు.

మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు రావటంతో.. పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తజనంతో.. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు కావటంతో... ముందుస్తుగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే యాభైవేలకుపైగా భక్తులు..తల్లులను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవాలను స్మరించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో...దర్శనం కాస్త ఆలస్యమైంది. మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద స్నానాలకోసం.. ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.కోటేశ్వర్ రెడ్డి అనే ఓ ఆర్మీ జవాను శనివారం రాత్రి విధులకు వెళ్లే సమయంలో లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఆర్మీ ఆస్పత్రి సిబ్బంది గమనించి హుటాహుటీన హాస్పటల్‌కు తరలించి చికిత్స ఇస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి లంగర్ హౌస్ లో అద్దెకు ఉంటూ విధులకు వెళ్తూ వస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయంసైనిక లాంఛనాల తర్వాత కోటీశ్వర్ రెడ్డి మృతిదేహాన్ని స్వస్థలమైన విశాఖపట్నం పంపారు.

వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..... ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా..... వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ట్విటర్ ఎక్స్ ఖాతాలో బాలశౌరి వెల్లడించారు. అలాగే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఎక్స్ వేదికగా తెలియచేశారు. మచిలీపట్నం MLA పేర్ని నానితో పాటు పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌తోనూ ఎంపీ బాలశౌరికి రాజకీయంగా విభేధాలున్నాయి. తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని పేర్ని నానిపై బాలశౌరి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం...... లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పు చేస్తుండటంతో బాలశౌరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నాయకురాలు Y.S.షర్మిల.... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. బాబుతో భేటీ అనంతరం మాట్లాడిన షర్మిల YSRతో ఆయనకున్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని... తన కుమారుడి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదన్న షర్మిల... తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు ఉండబోమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.... పోలీసులతో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పోలీసులను పరుష పదజాలంతో దూషించడం... తీవ్ర విమర్శల పాలైంది. అధిష్ఠానం కలగజేసుకోవడంతో MLA రాచమల్లు...పోలీసులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు పోలీసులతో అనుచితంగా మాట్లాడిన MLAపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులతో వ్యవహరించిన తీరు వైసీపీ అధిష్ఠానానికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకుని వెళ్తుండగా... ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేందుకు సంతకం పెట్టాలని కోరగా... పుల్లయ్య నిరాకరించారు. అక్కడికి వచ్చిన రాచమల్లు ఎస్ఐ బేగ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీకి కాదు, వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన...చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో వ్యవహరించిన తీరు అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో... అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో రాచమల్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న తాను ఓ సామాన్యుడిలా మాట్లాడానని రాచమల్లు అన్నారు. తన మాటలు పోలీసు అధికారుల మనసు నొప్పించి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు MLA రాచమల్లు తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. రాచమల్లుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్ధతగా వైకాపా అధిష్టానం భావించి ఉండొచ్చని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అర్హత లేదని తనకు మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదన్నారు. బీసీలకు వైకాపాలో అగ్ర తాంబూలం అనేది నేతి బీర కాయలో నెయ్యి తరహానేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో తానూ చెప్పిన వాడినేనన్న పార్థసారథి...అది తప్పని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. గన్నవరంలో వైకాపా గెలిచే పరిస్థితి లేదన్న ఆయన...ఆ స్థానానికి తనను పంపాలని జగన్ చూశారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

YSR జిల్లా ప్రొద్దుటూరు సెబ్ ఎస్సై అలీబేగ్ ని..... MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ప్రొద్దుటూరుకి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి.. పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకెళ్తుండగా.... ఎస్ ఈబీ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించిన పోలీసులు.. సంతకం పెట్టాలని కోరగా పుల్లయ్య నిరాకరించారు. ఇదితెలిసి స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు..కుర్చీలో కూర్చుని ఎస్సై బేగ్ పై విరుచుకుపడ్డారు. తల్లి చనిపోయి... దినం కోసం మందు బాటిల్లు తీసుకెళ్తుంటే..కేసు పెడతావా అని ప్రశ్నించారు. కేసు నమోదుచేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని బేగ్ చెబుతున్నా MLA పట్టించుకోలేదు. ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో.... అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు పెడితే ఒప్పుకోబోనన్న ఆయన...... చట్టాన్ని మార్చుకో లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కేశినేని నాని వైకాపా కోవర్టని తెలిపోయిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో కేశినేనికి కూడా భాగం ఉందని తేలిపోయిందన్నారు. వెలంపల్లికి అనుకూలంగా పనిచేయడానికే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారని వెంకన్న విమర్శించారు. చంద్రబాబు మాటపై గౌరవంతో ఇన్నాళ్లు నానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇప్పడు ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసిందన్నారు. అలాగే కేశినేని కుటుంబంలో కలహాలతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత కేశినేని చిన్నీ తెలిపారు. మా కుటుంబంలో సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయని ఆయన వివరించారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని ఆయన మండిపడ్డారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు నాని చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరన్నారు.

హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. చెన్నె నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఐదో ప్లాట్‌ఫాంవద్ద డెడ్‌ఎండ్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో మూడు బోగీలు పట్టాలు తప్పి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్టేషన్‌లో ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న క్రమంలోనే గోడను ఢీకొట్టడంతో పెద్దగా నష్టంజరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది...పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, ప్రమాదానికి గురైంది. ఉదయం 8గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలావరకు ప్రయాణికులు దిగిపోగా మిగిలిన వారితో చివరి స్టేషన్ నాంపల్లికి వచ్చింది. ఐదోప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు ఆగే సమయంలో డెడ్‌ఎండ్ గోడని ఢీకొట్టింది. ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా... మూడు బోగీలు "S-2, S-3, S-6” పట్టాలు తప్పాయి అప్పటికే దిగేందుకు సిద్ధమై, డోర్ల వద్ద నిలబడిన ప్రయాణికులు.... భయాందోళనకు గురై పరుగులు తీశారు. బోగీల కుదుపుతో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. ….ఇబ్రహీం అనే ప్రయాణికుడికి ఛాతి వద్ద గాయమైంది.
ప్రమాదాన్ని గమనించిన స్టేషన్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలుచేపట్టారు. గాయపడిన ఆరుగురిని లాలాగూడ రైల్వేఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటికి దిగటంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. ఐదో ప్లాట్ ఫాంలో ప్రమాదంచోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేసి, పునరుద్దరణ పనులు చేపట్టారు నాంపల్లిస్టేషన్‌లో ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరాతీశారు. ఘటనకు గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతోఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రి వేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొనింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం... నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు విజయవాడ చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీల తో సీఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై A.P C.E.O ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దిల్లీకి కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు తిరిగి వెళ్లనున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో అన్న క్యాంటీన్ పైలాన్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. కనిగిరిలో రెండో రోజు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంగా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నియోజకవర్గ ఇంఛార్జి ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ..... ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని.... స్వయంగా ఆయన భోజనాలు వడ్డించారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను, ఇంఛార్జిలను తన బస్సులోకి పిలిపించి ముఖాముఖి మాట్లాడారు. కార్యకర్తలతో ఫొటోలు దిగి ఉత్సాహ పరిచారు. వైకాపాను వీడి తెలుగుదేశంలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూపొందించిన పాటలు సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు

విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్ట కు చెందిన తెలుగుదేశం కార్యకర్త జాగరపు చిన్నా, 41వ డివిజన్ జ్ఞానాపురంలో మృతి చెందిన మలిశెట్టి రమణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. 45వ డివిజన్ తాడిచెట్లపాలెం కనకరాజు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గాజువాక 66వ డివిజన్ అజిమాబాద్ కోరుకొండ మంగ, 65వ డివిజన్ భానోజి తోటలో సరోజిని, షీలానగర్‌లో కృష్ణమూర్తి కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఆరు కుటుంబాలకు పార్టీ తరఫున ఆమె ఆర్థికసాయం అందించారు. భువనేశ్వరితో పాటు తెలుగుదేశం ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.TDP: కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర

రాజస్థాన్‌లోని కోటాలోప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్‌లో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. రైల్వే సిబ్బంది ఆ మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. వీలైనంత తొందరగా రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని వెల్లడించారు. కాగా, ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను అధికారులు విడుదల చేశారు. ఈ సంఘటన బికనీర్‌లోని లాల్‌ఘర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియలేదు. రైల్వే అధికారులు రైలు మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. అంతకుముందు డిసెంబర్ 2023లో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది.

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని.. తప్పుడు చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేశారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఉన్న ఓటు హక్కును ఆమె ఇటీవల గుంటూరుకు మార్చుకున్నారు.ఈ క్రమంలో ఆమె తప్పుడు చిరునామా ఇచ్చారని ఆరోపించిన తెలుగుదేశం నాయకులు.... ఈ అంశంపై గుంటూరు వెస్ట్ ఓట్ల నమోదు అధికారికి ఫిర్యాదు చేశారు. శ్యామలా నగర్ లో ఉంటున్నట్టు.. మంత్రి ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి చూస్తే అక్కడ ఖాళీ స్థలం ఉందని తెలుగుదేశం నేతలు ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు చిరునామాతో దరఖాస్తు చేసిన మంత్రి ఓటు తొలగించాలని డిమాండ్ చేశారు.

కొత్త ఏడాది జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషెద్‌పూర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఆదిత్యపూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జంషెద్‌పూర్ పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతాన్నికి చెందిన సుమారు వందమంది మహిళలకు తన సొంత నిధులతో తయారు చేయించిన రాట్నాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అధికారంలో లేకపోయినా నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు 20కి పైగా సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో అమలు చేస్తున్నారని..... అదే ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మంగళగిరిని ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికలలో నారా లోకేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందు కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది.
ఈ కేవైసీ తప్పకుండా పూర్తి చేసుకోవాలన్న అధికారుల సూచనతో రేషన్ దుకాణాల వద్దకు లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. అయితే కొత్త రేషన్‌కార్డులకు అర్హులైన లబ్ధిదారులను అధికారులే ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా తెల్ల రేషన్‌కార్డులు ఎవరికీ ఇవ్వాలో తేల్చాలని.. అనర్హులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా తిరుచ్చి - రామేశ్వరం రహదారిపై ఈ తెల్లవారుజామున ఓ టక్కు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కనున్న ఓ టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.TN: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని భావిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలవకుండా ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించగా తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మైన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. కొలరాడో తీర్పుపై రిపబ్లికన్ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్.. ట్రంప్ పేరును ప్రైమరీ బ్యాలెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులపై ట్రంప్ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బెల్లోస్ నిర్ణయాన్ని రిపబ్లికన్ పార్టీ.. మైన్ రాష్ట్ర కోర్టుల్లో సవాల్ చేయనుంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి 2021 జనవరి 6న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది.

కర్ణాటక చిత్రదుర్గలోని ఓ ఇంట్లో ఐదు అస్తిపంజరాలు బయటపడటం....కలకలం రేపింది. పాత బెంగళూరులోని జైలురోడ్డులో ఓ పాడుబడిన ఇంట్లో... అస్తిపంజరాలు ఉన్నట్లు మీడియా ప్రతినిధులు పోలీసులకు...సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చిత్రదుర్గ పోలీసులు... ఇంటి లోపలికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఒక గదిలో మంచంపై రెండు, నేలపై మరో రెండు అస్తి పంజరాలు కనిపించాయి. అవన్నీ నిద్రపోతున్న భంగిమలో.... ఉన్నాయి. మరో గదిలో ఐదో అస్తిపంజరాన్ని గుర్తించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అస్తి పంజరాల నమూనాలు... ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అస్తి పంజరాలన్నీ ఆ ఇంటి కుటుంబ సభ్యులవే అని...ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ ఇంటి సభ్యులంతా ఇతరులకు దూరంగా ఉండేవారని, అనారోగ్యంతో బాధపడేవారని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు...పోలీసులు వెల్లడించారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో దొంగపని చేయించిన జగన్‌ను మార్చకుండా, ఎమ్మెల్యేల్ని మారిస్తే సరిపోతుందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇంకా వందరోజులే మిగిలి ఉందని అన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుడిపల్లి మండలం బిసానత్తము వద్ద గజమాలతో ఆహ్వానించారు. గుడిపల్లిలో రైల్వే స్టేషన్ కూడలి నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. వైసీపీకి మరో వందరోజులే మిగిలి ఉందని, ఊరికో రౌడీని తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పిన చంద్రబాబు.. వైకాపా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల్ని మార్చడాన్ని ఎద్దేవా చేశారు. బస్సు సౌకర్యం తీసేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువతకు, మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రాత్రి కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేశారు.

ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది.
కేసు ఏమిటంటే.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. దీంతో పాటుగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి(యూఏఈ), సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించింది.

TSPSC కొత్త బోర్డు ఏర్పాటయ్యాకే నియామకాలు చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజావాణి పకడ్బందీగా అమలు చేస్తామన్న సీఎం... గత ప్రభుత్వ పాలనాతీరుపై విమర్శలు గుప్పించారు. ఉన్న భవనాలను కూల్చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. TSPSC ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని తేల్చిచెప్పిన సీఎం...కొత్త బోర్డు ఏర్పాటు చేసి నియామకాలు చేపడతామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 24 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీఎం తెలిపారు. ఫిర్యాదులను స్థానిక అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రజావాణి విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానించిన సీఎం...ఓ మహిళకు ఇటీవల కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంపైనా స్పందించారు. గత ప్రభుత్వం ఉన్న భవనాలను కూల్చడం వల్ల ఏం లాభం జరిగిందని ప్రశ్నించిన సీఎం.. కోట్ల రూపాయల విలువైన కార్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచి పెట్టారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం... ఆరున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారని ఆరోపించారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 6.65 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు అయినట్లు తెలిపారు. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు కాగా, 972 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని సీపీ తెలిపారు.

అయోధ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు అంతకుమించిన ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయాన్ని విభిన్న కళాకృతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామ మందిరం తలుపులు హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. జూన్‌లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి 60మందికిపైగా కళాకారులు అయోధ్యకు వెళ్లారు. తలుపుల తయారీకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మహారాష్ట్రలోని బలార్హకు చెందిన టేకు ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతోపాటు మరో 100 తలుపులను తయారు చేస్తున్నారు.

అయోధ్యలోని రామమందిర ప్రాంగణానికి అవసరమైన తలుపుల తయారీలో నాణ్యమైన కలపను ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అధిపతి శరత్ బాబు తెలిపారు. నిపుణులైన కళాకారులతో రామాలయం తలుపులను తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం అయోధ్యలోనే ఓ ఫ్యాక్టరీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయోధ్య రామమందిరం ప్రారంభమైనా...ఏడాది వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. తమ శిల్పకళ చాలా బాగుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారని పేర్కొన్నారు. ఇంతగొప్ప అవకాశం తమకు లభించటం గర్వంగా ఉందని తెలిపారు.

రాజధాని లేకుండా నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఘనత సీఎం జగన్‌దేనని... సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఒక్కఛాన్స్ అంటే నమ్మి జగన్‌కు అధికారం ఇచ్చారన్న ఆయన.... దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏంచేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని పృథ్వీరాజ్ విశ్వాసం వ్యక్తంచేశారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంపై పృథ్వీరాజ్ మండిపడ్డారు. వైసీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం

కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డే అర్హత అని... మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని.... ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులు తీసుకుంటామని పొంగులేటి తెలిపారు. అర్హత ఉన్నవారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారని.... ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారని వెల్లడించారు. 10 ఇళ్లు ఉన్నా .. అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని వెల్లడించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్ట్ రిజర్వు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అభ్యంతరాలను తెలుగుదేశం తరపు న్యాయవాదులు.. కోర్టుకు సమర్పించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు... చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేశారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ రూపకల్పనలో.. అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించారు.ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న లోకేశ్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ రెండు మెమోలు దాఖలు చేసింది. ఈ మెమోలపై తెలుగుదేశం న్యాయవాదులు అభ్యంతరం చెప్పగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు లోకేశ్ అభ్యంతరాలను లాయర్లు కోర్టుకు సమర్పించారు.

ముఖ్యమంత్రి జగన్ మాటలను నిశితంగా పరిశీలిస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విమర్శించారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయని, పనులు గడప దాటవని లోకేశ్ పేర్కొన్నారు. సొంత ఇలాకా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేస్తానని చెప్పి శిలాఫలకం వేసి ఇప్పటికి నాలుగేళ్లైందని లోకేశ్ గుర్తుచేశారు. 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టే స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాతికవేలమందికి ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారన్న లోకేశ్ .... కనీసం తుప్పలు తొలగించేందుకు నిధులు కేటాయించక. లిబర్టీ స్టీల్స్ పారిపోయిందని ధ్వజమెత్తారు. తర్వాత JSW సంస్థను బతిమాలి మరోసారి భూమిపూజ చేసినా అదీ కార్యరూపు దాల్చలేదని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వనందున కంకర వేసి తారువేయకుండా కాంట్రాక్టర్ పారిపోయారని లోకేశ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


