చిట్టి న్యూస్

బిర్సా ముండాకు రాహుల్ గాంధీ నివాళి

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.  బిర్సా ముండా జీ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు గిరిజన సమాజానికి గౌరవనీయమైన నాయకుడని కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన ధైర్యం మరియు త్యాగం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందంటూ ట్విట్టర్ లో కొనియాడారు.



మంత్రి గంగులకు తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర పౌర సరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఊరురా చెరువుల పండగలో పాల్గొన్న గంగుల..కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ చెరువు లో ఇనుప తెప్పలో ప్రయాణించి దిగుతుండగా బ్యాలన్స్ తప్పి నీటిలో పడబోయారు. అయితే సెక్యూరిటి సిబ్బంది అలెర్ట్ అయి నీటిలో పడిపోకుండా పట్టుకున్నారు.

ఖమ్మంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ట్యాంకర్‌

ఖమ్మంలో కరెంట్ స్తంభాన్ని ఢీ కొని బోల్తా పడింది ట్యాంకర్‌. పులివెందులకు వెళ్తున్న ట్యాంకర్‌ కరెంటు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి ట్యాంకర్‌ దూసుకెళ్లి ఉంటే, భారీ ప్రమాదం జరిగి అంటున్నారు స్థానికులు.

వైసీపీ నేతల పైత్యం..మసీదుపై జగన్ ఫోటో

గుంటూరులో వైసీపీ నేతల పైత్యం ముదిరింది. నంబూరులో ఏకంగా మసీదు మీనార్‌కే పార్టీ బెలూన్ కట్టారు వైసీపీ నేతలు. హజ్ యాత్రికులను కలిసేందుకు హజ్ క్యాంప్‌కు సీఎం జగన్ వచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నేతలు... జగన్‌కు స్వాగతం పలుకుతూ మసీదు మీనార్లకు భారీ బెలూన్లు కట్టారు. వైసీపీ నాయకుల చర్యలపై ముస్లిం సోదరుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు



సీబీఐకి రైలు ప్రమాదం కేసును అప్పగించడంపై మమత ఫైర్

ఒడిశా రైల్వే ప్రమాదం కేసును సీబీఐకి అప్పగించడంపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒడిశా రైల్వే ప్రమాదంలో ఇప్పటికే దాదాపు ౩౦౦ మందికి పైగా చనిపోయారు. రైల్వే ప్రమాద ఘటనను కేంద్రం విచారించాల్సి ఉండగా, వాస్తవాలను తొక్కి పెట్టేసేందుకే సీబీఐకి అప్పగిస్తున్నారా అని మమతా బెనర్జి ప్రశ్నించారు.

మణిపూర్‌లో భద్రతా దళాల గాలింపు చర్యలు

మణిపూర్‌లోని కొండ ప్రాంతాలతో పాటు లోయలో భద్రతా దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. మణిపూర్‌లో ఘర్షణల తరవాత పరిస్థితిని సాధారణ స్థాయికి తెచ్చేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అక్రమ ఆయుధాలను సరెండర్‌ చేయాల్సిందిగా స్థానికులను కోరుతున్నాయి. 

ఇందిరా గాంధీ హత్యను సమర్థించేలా..కెనడాలో ఊరేగింపు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను సమర్థించేలా కెనడాలోని ట్రామ్‌టన్‌లో ఖలిస్థాన్‌ మద్దతు దారులు ఊరేగింపు నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ ఖండించింది. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రామ్‌టన్‌ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



 

రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్

మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 48 బంద్‌కు పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ నాలుగేళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటన రాకపోవడంతో 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు అఖిలపక్ష నేతలు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

121వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జంగాలపల్లిలో బస చేయనున్నారు నారా లోకేష్‌.

విశాఖలో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్‌ పురంలో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తేజ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే స్థానిక లారీ యార్డులో బాలుడు మృతదేహం లభించింది. తేజ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు

నగరిలో కారు ప్రమాదం

చిత్తూరు జిల్లా నగరిలో కారు ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పూర్తిగా కారు కాలిపోయింది.చెన్నై నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో కాలిన వాసన వస్తుండటంతో అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగేవారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

బాలున్ని రక్షించిన NDRF టీం

బ్రిడ్జి మధ్యలో ఇరుక్కున్న బాలున్ని కాపాడారు NDRF సిబ్బంది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం బీహార్ లో జరిగింది. నస్రిగంజ్ లో నివసించే 11సంవత్సరాల బాలుడు పిల్లర్ మధ్యలో ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీం బాలున్ని రక్షించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 గంటల పాటు శ్రమించినా లాభం లేకపోయే సరికి, పిల్లర్ స్లాబ్, రోడ్డును కూడా కొద్దిగా తొలంగించి బాలున్ని రక్షించారు. బాలుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని అధికారులు తెలిపారు. రెండురోజుల క్రితం బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడని చెప్పారు. అతడిగురించి తల్లిదండ్రులు వెతుకుతున్నట్లు చెప్పారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు భూమి పూజచేయనున్నారు. జడ్చర్ల, దేవరకద్రల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

చంద్రబాబు రోడ్‌ షో

ఈ నెల 14 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు కూడా ఉండనున్నాయి.

Telangana: ఊరూర చెరువుల పండుగ

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఊరూర చెరువుల పండుగ నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్నీ చెరువుల వద్ద సంబురాలు జరగనున్నాయి.

84వ రోజుకు చేరుకున్న భట్టి పీపుల్స్ మార్చ్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. ఇవాళ నక్కలగండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. బీఆర్ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.

రేపటి నుంచి..చేపప్రసాదం

రేపటి నుంచి హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో  జూన్ 9,10 తేదీల్లో చేపప్రసాదంపంపిణీ చేయనున్నారు.చేపప్రసాదం కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా  పంపిణీకి సంబంధించిన కౌంటర్లు, షెడ్ల ఏర్పాటు పూర్తయ్యింది.తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

120వ రోజుకు చేరిన యువగళం

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 120వ రోజుకు చేరుకుంది. నేడు రాజంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం 5.30కి టక్కోలిలో రైతులతో సమావేశమవుతారు.

ముందస్తుపై సీఎం జగన్‌ క్లారిటీ

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సీఎం జగన్‌ మంత్రులకు క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులతో రాజకీయ పరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీచాలా ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.


మృగశిర కార్తీ.. చేపల కోసం ఎగబడ్డ భాగ్యనగరవాసులు

తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తీ సంబురాలు రైతులు జోరుగా జరుపుతున్నారు. మృగశిర కార్తీ ప్రారంభంలో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుండటంతో హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లలో జనాలు ఎగబడ్డారు. దీంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.

TSPSC:37మందిపై అభియోగం

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 37మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. న్యాయసలహా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 15 మంది నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.

చల్లని కబురు

భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణం చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.



 

గుంటూరు : అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..!

ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పారాజు ఆధ్వర్యంలోజరిగే4వ ప్రాంతీయ సదస్సుకు భారీగా హాజరైన ఉద్యోగులు....

నగరంలోని కన్నవారి తోట మూడు బొమ్మల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం మీదుగా రెవిన్యూ భవన్ వరకు భారీ ర్యాలీ...ఉమ్మడి గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి హాజరైన ఉద్యోగ సంఘాలు. .

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం తీర్చాలని నినాదాలు

రెజ్లర్ల ఆందోళనకు చిన్న  బ్రేక్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు మల్లయోధులు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లతో చర్చలు జరపడం వళ్ళ మల్లయోధులు తమ ఆందోళనలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు

ప్రార్థనతో రోజును ప్రారంభించండి..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

మీరు మీ ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తారు... ఒక్కక్కరు ఒక్కో విదంగా దినచర్యను ప్రారంభిస్తారు. కొందరు జిమ్‌కి వెళ్లడానికి ఇష్టపడతారు, మరికొందరు ఉదయం లేవగానే వరండాలో కూర్చుని ఒక కప్పు వేడి కాఫీ లేదా టీని సిప్ చేస్తూ ప్రారంభిస్తారు. అయితే రోజును ప్రార్థనతో ప్రారంభించాలని అంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దానికి కారణం చెప్తూ మనల్ని చూసుకునేవాడు ఆయనే(దేవుడు) కదా అంటూ" ప్రార్థనతో రోజును ప్రారంభించండి "అనే క్యాప్షన్‌తో ఇన్ స్టాగ్రామ్ లో సెల్ఫీని పంచుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా పెన్షన్ డ్రా

మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన కిరీటి 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. 

తీర్పు దిక్కరించారని రెండు కుటుంబాలను వెలివేసిన పెద్దలు

భూ వివాదంలో తమ తీర్పును ధిక్కరించారన్న నెపంతో రెండు కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరి నుంచి వెలివేశారు. కృష్ణా జిల్లా వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భువనగిరిలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

యాదాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. కొయ్యలగూడెంలో హ్యాండ్లూమ్‌ మోడ్రన్‌ సేల్స్‌ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

జమ్ముకశ్మీర్‌ శారదా ఆలయాన్ని సందర్శించిన శృంగేరి శంకరాచార్యులు

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని తీత్వాల్‌లో శారదా ఆలయాన్ని శృంగేరి శంకరాచార్యులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు తీత్వాల్‌లో శంకరాచార్యులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శారదా కమిటీని కాపాడేందుకు శంకరాచార్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: అద్దంకి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైన్, సాండ్, ల్యాండ్, మైనింగ్ లలో దొరికిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో పన్నెండు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంటాంమని ధీమా వ్యక్తం చేసారు. తుంగతుర్తిలో తన గెలుపును ఎవరూ అడ్డకోలేరంటున్నారు అద్దంకి దయాకర్. 

బిల్లులు ఎలాగొ మంజూరు చేయట్లే..చావడానికైనా అనుమతివ్వండి

గుంటూరు జిల్లాల్లో పెండింగ్‌ బిల్లుల కోసం ఓ కాంట్రాక్టర్‌ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. హర్టీ కల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భాధితుడు హరికిషన్‌ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి చేతులెత్తి మొక్కాడు బాధితుడు.

హరికిషన్‌... వ్యవసాయశాఖకు మూడు ఎలక్ట్రిక్ ఆటోలను సప్లయ్ చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు 11లక్షల వరకు హరికిషన్‌కు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన హరికిషన్.. కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. తనకు రావాల్సిన 11 లక్షల రూపాయల బకాయిలు ఇప్పించకుంటే.. మరణమే శరణ్యమని వాపోయారు. నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ చెప్పినా.. హార్టీకల్చర్‌ కమిషనర్ శ్రీధర్ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు.

పోలవరం బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ముంపు

పోలవరం వెనక జలాలతో తెలంగాణ భూభాగంలో ముంపు ఏర్పడుతోందని, ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు నీటిని నిల్వ చేయవద్దని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ కోరింది.

ఒరిస్సా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

కోరమాండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. సీబీఐ సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.

వారిని చంద్రబాబు కలిస్తే తప్పేంటి: బండి

అమిత్ షా, జేపీ నడ్డాను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనేది ఊహగానాలే అని తేల్చిచెప్పారు.

కుప్పకూలిన బ్రిడ్జ్

బీహార్‌లోని ఖగారియాలో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లేన్ల బ్రిడ్జి కుప్పకూలింది. వంతెన కూలిపోతుండగా స్థానికులు ఫోన్లలో తీసిన వీడియో వైరలైంది.